BPNL Recruitment 2023: పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, 3,444 పోస్టులు, పూర్తి వివరాలివే

Andaluri Veni

Updated On: June 23, 2023 04:52 pm IST

భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్  (BPNL Recruitment 2023) నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3444 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. కేవలం పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.
BPNL Recruitment 2023: పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు,  3,444 పోస్టులు, పూర్తి వివరాలివేBPNL Recruitment 2023: పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, 3,444 పోస్టులు, పూర్తి వివరాలివే

BPNL రిక్రూట్‌మెంట్ 2023 (BPNL Recruitment 2023): భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్  (BPNL Recruitment 2023) నుంచి రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3444 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. ఇందులో సర్వేయర్ పోస్టులు 2870, సర్వేయర్ ఇంఛార్జ్ పోస్టులు 574 ఉన్నాయి. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.ఆసక్తి ఉన్న అభ్యర్థులు  జూలై 05, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.  BPNL ఉద్యోగాలకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు, నోటిఫికేషన్, పరీక్షల నమూనా,  వయో పరిమితులు మొదలైన పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి. ఈ దిగువున ఉద్యోగ నోటిఫికేషన్ అందజేయడం జరిగింది.

BPNL రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్

BPNL రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (BPNL Recruitment 2023 Details)

BPNL రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. ఆసక్తి  ఉన్న అభ్యర్థులు స్థూలంగా పరిశీలించవచ్చు.
కండక్టింగ్ బాడీ భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్
మొత్తం ఖాళీలు 3444
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ జూన్ 19, 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 05, 2023
సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ
అధికారిక వెబ్‌సైట్ https://www.bharatiyapashupalan.com

BPNL రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు (BPNL Recruitment 2023 Eligibility)

BPNL ఉద్యోగాలకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందజేయడం జరిగింది.
  • సర్వే ఇంఛార్జ్ పోస్టులకు  ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
  • సర్వేయర్ పోస్టులకు  పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • పోస్టులను బట్టి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
  • సర్వే ఇన్‌ఛార్జ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అప్లికేషన్‌ ఫీజుగా రూ. 944లు చెల్లించాలి.
  • సర్వేయర్‌ పోస్టులకు రూ.826 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 24 వేల వరకు జీతం అందజేయడం జరిగింది. ఈ ఉద్యోగాలన్న ప్రభుత్వ ఉద్యోగాలే.  రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు  మరిన్ని వివరాల కోసం https://www.bharatiyapashupalan.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు జూలై 05, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు విద్యా సంబంధిత వార్తల అప్‌డేట్స్‌ను తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/bpnl-recruitment-2023-42373/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!