CTET 2024 కరెక్షన్ విండో యాక్టివేటెడ్, ఇలా ఎడిట్ చేసుకోండి (CTET 2024 Correction window link)

Andaluri Veni

Updated On: October 22, 2024 02:29 PM

CTET 2024 సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక వెబ్‌సైట్‌లో కరెక్షన్ విండో లింక్‌ను (CTET 2024 Correction window link) యాక్టివేట్ చేసింది.  
 
CTET 2024 కరెక్షన్ విండో యాక్టివేటెడ్, ఇలా ఎడిట్ చేసుకోండి (CTET 2024 Correction window link)CTET 2024 కరెక్షన్ విండో యాక్టివేటెడ్, ఇలా ఎడిట్ చేసుకోండి (CTET 2024 Correction window link)

CTET 2024 కరెక్షన్ విండో (CTET 2024 Correction Window) : సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. మీరు దరఖాస్తులో మార్పులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక వెబ్‌సైట్‌లో కరెక్షన్ విండో లింక్‌ను యాక్టివేట్ చేసింది.  అభ్యర్థులు అధికారిక CTET వెబ్‌సైట్  ctet.nic.inలో కరెక్షన్ విండోపై క్లిక్ చేసి తమ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో అవసరమైన మార్పులను చేయవచ్చు. CTET దిద్దుబాటు విండో అక్టోబర్ 25న  ముగుస్తుంది.  పరీక్ష కోసం నమోదు చేసుకున్న, ఫీజు లావాదేవీ ద్వారా ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులో కొన్ని సవరించదగిన విభాగాలను మాత్రమే సరిచేయగలరు.

CTET 2024 దరఖాస్తులో ఏమి సవరించవచ్చు?

అభ్యర్థులు CTET దరఖాస్తులో అన్నింటిని ఎడిట్ చేయలేరు. సెంట్రల్ బోర్డ్ ఫీజుతో సవరించగల కొన్ని విభాగాలను మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ దిగువున తెలిపిన వివరాలను ఎడిట్ చేయవచ్చు.
  • దరఖాస్తుదారు, తండ్రి, తల్లి పేరు
  • జెండర్, జాతీయత
  • పుట్టిన తేదీ, కేటగిరి, నివాస చిరునామా
  • ఉపాధి స్థితి
  • ప్రత్యేకంగా సామర్థ్యం గల కేటగిరీలను కూడా మార్చవచ్చు.
  • మొబైల్ నెంబర్, విద్య
  • ఎంచుకున్న పేపర్లు, పేపర్ 2 టాపిక్,  పరీక్షా కేంద్రం
  • పేపర్ 1, 2 రెండు భాషలు

CTET 2024: సవరించడానికి దశలు (CTET 2024: Steps to Edit)

CTET 2024 అప్లికేషన్‌లో మార్పులు చేసుకోవడానికి ఈ దిగువన తెలిపిన విధానాన్ని ఫాలో అవ్వాలి.
  • ఫేజ్ 1: కార్యాలయ వెబ్‌సైట్‌ను ctet.nic.in సందర్శించండి.
  • ఫేజ్ 2: ఒకసారి CBSE లింక్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత, అభ్యర్థులు లింక్‌ని ఎంచుకోవచ్చు. లాగిన్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు.
  • ఫేజ్ 3: లాగిన్ పూర్తైన తర్వాత అభ్యర్థులు పైన పేర్కొన్న కేటగిరీలను జాగ్రత్తగా సవరించాలని సూచించారు.
  • ఫేజ్ 4: సబ్మిట్ బటన్‌ను ఎంచుకుని, అవసరమైన మొత్తాన్ని చెల్లించాలి.
  • ఫేజ్ 5: దరఖాస్తు ఫార్మ్, లావాదేవీ రసీదుని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
CTET సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది; జనవరి 21న జనవరి పరీక్ష జరిగింది. CTET జనవరి 2024 పరీక్షకు మొత్తం 26,93,526 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 84 శాతం మంది దరఖాస్తుదారులు పరీక్షకు హాజరయ్యారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ctet-2024-correction-window-activated-58809/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top