గాంధీ జీవిత చరిత్ర (Gandhi Life Story in Telugu): అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి. ఆ రోజున జాతీయ సెలవుదినంగా పాటించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 02న దేశ ప్రజలు మహాత్మునికి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకుంటుంటారు. బ్రిటీష్ వలస పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం అందించడానికి గాంధీజీ చేసిన కృషికి గుర్తు చేసుకుంటారు. గాంధీ జయంతి రోజున పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు, ప్రత్యేక సమావేశాలు, విద్యా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి తెలుసుకోవలసిన మహాత్మా గాంధీ జీవిత పాఠాలు (Gandhi Life Story in Telugu) ఇక్కడ అందజేశాం.
ఇది కూడా చదవండి | మహాత్మా గాంధీ గురించి ఈ నిజాలు తెలుసా?
గాంధీ జయంతి 2023: మహాత్మా గాంధీ జీవిత పాఠాలు (Gandhi Jayanti 2023: Life Lessons of Mahatma Gandhi)
మహాత్మా గాంధీ జీవితం నుంచివిద్యార్థులు నేర్చుకోగల కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ దిగువున అందజేశాం.
ఆత్మ విశ్వాసం: మనల్ని మనం నమ్మాలి. సమాజం మొత్తం మనకు వ్యతిరేకంగా నిలబడినా, మనం చేసే పనిని నమ్మాలి. దానిని అనుసరించాలి. మనం సరైన దారిలో ఉంటే సమాజం చేతులు కలుపుతుంది. ఇదే విషయాన్ని గాంధీజి 'మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు, తర్వాత వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు, ఆపై వారు మీతో పోరాడతారు. అనే ఒక్క మాటతో చెప్పారు.
సమాన గౌరవం: గాంధీజి నుంచి నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం అందరినీ గౌరవించడం. గాంధీజీ ఎప్పుడూ సమానత్వాన్ని నమ్మేవారు. దక్షిణాఫ్రికాలో, అతను పక్షపాతాన్ని ఎదుర్కొన్నారు. అందువల్ల అసమానతను ఎదురించారు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులని ఆయన తెలియజేశారు.
అహింస: మహాత్మా గాంధీ అహింస బోధకులు. భారతదేశ స్వతంత్రం కోసం ఆయన చేసిన ఉద్యమాలన్నీ బహిష్కరణలు, శాసనోల్లంఘనలు, అహింసాయుత నిరసనలు మాత్రమే. గాంధీజీ నుంచి మనకు వ్యతిరేకంగా జరిగే ఏదైనా విషయంలో అహింసాత్మక విధానాన్ని అనుసరించడం నేర్చుకోవాలి.
నిజాయితీ: మహాత్మా గాంధీ నుంచి మనం నేర్చుకునే మరో పాఠం ఏమిటంటే ఎల్లప్పుడూ నిజాయితీ మార్గాన్ని అనుసరించడం. అతని ప్రకారం, సత్యం ద్వారా మాత్రమే మనం నైతిక, ఆధ్యాత్మిక వృద్ధిని సాధించగలం.
సరళత: గాంధీజీ మనకు బోధించే చివరి జీవిత పాఠం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ సామాన్య జీవితాన్ని గడపాలి. మనం భౌతిక ఆనందాన్ని వెతకకూడదు. బదులుగా కొద్దిపాటి జీవనశైలికి విలువనివ్వాలి.
తాజా Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా WhatsApp Channel ని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.