గాంధీ జయంతి 2023 (Gandhi Jayanti 2023): మన దేశ చరిత్రలో విశేషమైన పాత్రను పోషించిన మహాత్మా గాంధీ అక్టోబర్ 2న జన్మించారు. ఈ ఏడాది గాంధీజీ 154వ జయంతిని (Gandhi Jayanti 2023) దేశం జరుపుకోనుంది. గాంధీజి అహింస, సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. స్థిరమైన నిబద్ధతతో దేశ స్వతంత్రం కోసం పోరాడారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రజల కోసం, దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. గాంధీ (లేదా బాపూజీ) ఆలోచనలు, సూత్రాలను మరొకసారి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ప్రతి విద్యార్థి మన జాతిపిత అయిన మహాత్ముడి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. కాగా గాంధీజి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, సంస్థలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఇది కూడా చదవండి | గాంధీజీ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే
గాంధీ జయంతి 2023: మహాత్మా గాంధీ గురించి తెలియని, ఆసక్తికరమైన విషయాలు (Gandhi Jayanti 2023 Unknown and Interesting facts about Mahatma Gandhi)
భారతీయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరు మహాత్మా గాంధీ. గాంధీ గురించిన కొన్ని తెలియని, ఆసక్తికరమైన విషయాలను విద్యార్థులు దిగువన తెలుసుకోవచ్చు.
- మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అతను అక్టోబర్ 2, 1869 న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు.
- ప్రజలు ఆయనను బాపూజీ అని పిలిచేవారు. అతను లండన్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. భారతదేశానికి తిరిగి రావడానికి ముందు దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
- ఐదుసార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినప్పటికీ అతను ఎప్పుడూ అవార్డును అందుకోలేదు.
- మహాత్మా గాంధీ తన సత్యాగ్రహ తత్వానికి ప్రసిద్ధి చెందారు. సత్యాగ్రహ తత్వం అంటే శాంతియుత ప్రతిఘటన, సత్యాన్ని అనుసరించడం.
- 1930 భారతదేశంలో బ్రిటిష్ ఉప్పు గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా బాపూజీ ప్రసిద్ధ దండి ఉప్పు సత్యాగ్రహ ర్యాలీకి నాయకత్వం వహించారు..
- మహాత్మా గాంధీని జనవరి 30, 1948న నాథూరామ్ గాడ్సే హత్య చేశాడు.
- అనంతరం గాంధీ అస్థికలను విభజించి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు. కొన్ని నదులు, మహాసముద్రాలలో కలిపారు.
- గాంధీజి సాధారణ జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. శాకాహారం మాత్రమే తీసుకునే వారు. అత్యంత సామాన్యులుగా జీవించేవారు.
- గాంధీజీ స్వతంత్ర ఉద్యమ సమయంలో మహిళల సాధికారత కోసం కీలక పాత్ర పోషించారు.
- మహాత్మా గాంధీ ఎంతో మంది నాయకులపై ప్రభావం వేశారు.
అంతగా తెలియని ఈ వాస్తవాలు గాంధీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. గాంధీ జయంతి 2023 మరింత న్యాయమైన, శాంతియుత, సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించే దిశగా ఆయన వారసత్వాన్ని గౌరవించే సందర్భం.
తాజా Education News కోసం, కాలేజ్ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా WhatsApp Channel ని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.