HMFW Alluri Sitharama Raju Recruitment 2023: పదో తరగతి, ఇంటర్, ఐటీఐ అర్హతతో 256 ఉద్యోగాలు, నెలకు రూ.54,060ల జీతం, పూర్తి వివరాలివే

Andaluri Veni

Updated On: December 05, 2023 12:38 pm IST

పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. అల్లూరి సీతారామరాజు హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2023 (HMFW Alluri Sitharama Raju Recruitment 2023) ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 
 
HMFW Alluri Sitharama Raju Recruitment 2023: పదో తరగతి, ఇంటర్, ఐటీఐ అర్హతతో 256 ఉద్యోగాలు, నెలకు  రూ.54,060ల జీతం, పూర్తి వివరాలివేHMFW Alluri Sitharama Raju Recruitment 2023: పదో తరగతి, ఇంటర్, ఐటీఐ అర్హతతో 256 ఉద్యోగాలు, నెలకు రూ.54,060ల జీతం, పూర్తి వివరాలివే

అల్లూరి సీతారామరాజు హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2023  (HMFW Alluri Sitharama Raju Recruitment 2023): అల్లూరి సీతారామరాజు హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచి  ఆంధ్రప్రదేశ్ లొకేషన్‌లో  256 ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులు డిసెంబర్ 11, 2023 తేదీలోపు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో  allurisitharamaraju.ap.gov.in చూడవచ్చు.

HMFW అల్లూరి సీతారామరాజు  రిక్రూట్‌మెంట్ 2023 పూర్తి వివరాలు (HMFW Alluri Sitharama Raju Recruitment 2023)

HMFW అల్లూరి సీతారామరాజు  రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
ఆర్గనైజేషన్ పేరు ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ అల్లూరి సీతారామ రాజు (HMFW అల్లూరి సీతారామ రాజు)
పోస్ట్ వివరాలు ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్
మొత్తం పోస్టులు 256
జాబ్ లోకేషన్ అల్లూరి సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్
అప్లై మోడ్ ఆఫ్‌లైన్
అధికారిక వెబ్‌సైట్ allurisitharamaraju.ap.gov.in

HMFW అల్లూరి సీతారామ రాజు ఖాళీల వివరాలు (HMFW Alluri Sitharama Raju Vacancy Details)


HMFW అల్లూరి సీతారామ రాజు ఖాళీల వివరాలను ఈ దిగువున టేబుల్లో  అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 3
స్టోర్ కీపర్ 3
అనస్థిషియా  టెక్నిషియన్ 10
ఆడియో విజువల్ టెక్నిషియన్ 1
ఆడియోమెట్రీ టెక్నీషియన్ 1
బయోమెడికల్ టెక్నిషియన్ 3
కార్డియోలజీ టెక్నిషియన్ 3
చైల్డ్ సైకాలజీ 1
కంప్యూటర్ ప్రోగ్రామర్ 2
డెంటల్ టెక్నిషియన్ 1
ఈసీజీ టెక్నిషియన్ 3
ఎలక్ట్రికల్ హెల్పర్ 2
ఎలక్ట్రిషియన్ జీఆర్ III 4
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ 35
జనరల్ డ్యూటీ అటెండెంట్ 56
జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ 27
ల్యాబ్ అటెండెంట్ 12
ల్యాబ్ టెక్నిషియన్ 19
లైబ్రరీ అసిస్టెంట్ 4
మెడికల్ రికార్డ్ టెక్నిషియన్ 35
మార్చురీ అటెండెంట్ 6
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1
ఆఫీస్ సబార్డినేట్ 28
ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ 5
ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ 1
ఫార్మాసిస్ట్ జీఆర్ II 9
ఫిజియోథెరపిస్ట్ 2
ప్లంబర్ 2
సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 2
Refractionist 1
స్పీచ్ థెరపిస్ట్ 1
స్టోర్ అటెండర్ 4
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్‌కు అర్హత వివరాలు (HMFW Alluri Sitharama Raju Recruitment required eligibility details)

HMFW అల్లూరి సీతారామ రాజు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాల బట్టి అభ్యర్థులు పదో తరగతి, ITI, ఇంటర్, డిప్లొమా, DMLT, D.Pharma, B.Sc, B.Pharma, డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, B.Ed, BE/ B.Tech పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలలో  MA, M.Ed, MCA, MSW, M.Phil,Ph.D పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసి ఉండాలి.
  • ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థి గరిష్ట వయస్సు 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నాలుగేల్లు, పీడబ్లూడీ అభ్యర్థులకు పదేళ్లు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
  • HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫీజు (HMFW Alluri Sitharama Raju Recruitment Application Fee)

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫీజు (HMFW Alluri Sitharama Raju Recruitment Application Fee)

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్‌కు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది.
  • SC, ST, BC, EWS అభ్యర్థులు: రూ. 200/-
  • OC అభ్యర్థులు: రూ. 250/-
  • PH అభ్యర్థులు: Nil
  • చెల్లింపు విధానం: డిమాండ్ డ్రాఫ్ట్

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply for HMFW Alluri Sitharama Raju Recruitment)

HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ 2023 పోస్టులకు దరకాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందించాం.
  • ముందుగా అధికారిక వెబ్‌సైట్  allurisitharamaraju.ap.gov.inని సందర్శించాలి.
  • HMFW అల్లూరి సీతారామ రాజు రిక్రూట్‌మెంట్ లేదా కెరీర్‌ల కోసం చెక్ చేయాలి.
  • అధికారిక వెబ్‌సైట్ లేదా నోటిఫికేషన్ లింక్ నుంచి ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫార్మ్‌ను ప్రారంభించే ముందు చివరి తేదీని చెక్ చేయాలి.
  • ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి.
  • దరఖాస్తు ఫీజును (వర్తిస్తే) చెల్లించి, చివరి తేదీ (11-డిసెంబర్-2023) లోపు స్వీయ-ధ్రువీకరణతో అవసరమైన పత్రాలతో పాటు దిగువున తెలిపిన చిరునామాకు దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయండి.
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ నంబర్/కొరియర్ రసీదు సంఖ్యను క్యాప్చర్ చేయండి.

HMFW అల్లూరి సీతారామరాజు జీతాల వివరాలు (HMFW Alluri Sitharama Raju Salary Details)

HMFW అల్లూరి సీతారామరాజు జీతాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి. నెలకు రూ.18,500 నుంచి రూ.54,060ల వరకు జీతం అందించడం జరిగింది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/hmfw-alluri-sitarama-raju-recruitment-2023-notification-47884/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!