IB ACIO Recruitment 2024: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే లాస్ట్‌డేట్

Andaluri Veni

Updated On: January 12, 2024 11:29 am IST

ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 ఉద్యోగాల భర్తీకి (IB ACIO Recruitment 2024) దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ. దరఖాస్తు చేసుకునే విధానం గురించి అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు.  
 
IB ACIO Recruitment 2024: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే లాస్ట్‌డేట్IB ACIO Recruitment 2024: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే లాస్ట్‌డేట్

IB ACIO రిక్రూట్‌మెంట్ 2024 (IB ACIO Recruitment 2024) : న్యూఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (IB ACIO Recruitment 2024)  ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (AICO) పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ అయింది. మొత్తం ఈ 226  పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈరోజే (జనవరి 12) లాస్ట్‌డేట్. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

IB ACIO పోస్టులకు అప్లై చేసుకోవడానికి డైరక్ట్ లింక్

IB ACIO రిక్రూట్‌మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు (IB ACIO Recruitment 2024: Important Dates)

ఈ ప్రధాన రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనసాగుతోంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించిన తర్వాత మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. IB ACIO రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

IB ACIO రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ డిసెంబర్ 23, 2023
IB ACIO రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ లాస్ట్‌డేట్ జనవరి 12, 2024
IB ACIO రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫీజు SBI చలాన్ చెల్లించడానికి చివరి తేదీ జనవరి 16, 2024


IB ACIO ఉద్యోగాలు 2024 రిక్రూట్‌మెంట్ అర్హత (IB ACIO Jobs 2024 Recruitment Eligibility)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అవసరమైన విద్యార్హత, వయోపరిమితిని కలిగి ఉండాలి. మీరు అర్హత, వయోపరిమితి వివరాలను ఇక్కడ చెక్ చేయవచ్చు.
  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సబ్జెక్టులతో కంప్యూటర్ సైన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్పెషలిస్ట్ కలిగి ఉండాలి.
  • GATE 2021, 2022, 2023లో క్వాలిఫైయింగ్ కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు ACIO గ్రేడ్-II/టెక్ స్థానానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుదారులు 18 నుంచి 27 సంవత్సరాల వయస్సులోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరిలకు సడలింపు ఉండే అవకాశం ఉంది.

IB ACIO రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు చేసుకునే విధానం (IB ACIO Recruitment 2024: Steps to Apply)

ఈ  దిగువున ఇవ్వబడిన స్టెప్లను అనుసరించిన తర్వాత మీరు ఈ పోస్ట్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టెప్ 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను mha.gov.in సందర్శించాలి.
స్టెప్ 2: హోంపేజీలో అందించిన దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మీరు కొత్త యూజర్ అయితే మీరే రిజిస్టర్ చేసుకోవాల్సిన కొత్త వెబ్‌పేజీ కనిపిస్తుంది.
స్టెప్ 4: మీ ఈ మెయిల్ IDలో మీరు అందుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
స్టెప్ 5: దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 6: ఫైనల్ సమర్పణకు వెళ్లే ముందు దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
స్టెప్ 7: దీన్ని డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ib-acio-recruitment-2024-registration-closes-today-48839/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!