India Post GDS Recruitment: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, పోస్టల్ శాఖలో 12,828 పోస్టులు, ఈరోజే లాస్ట్‌డేట్

Andaluri Veni

Updated On: June 23, 2023 03:24 pm IST

పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు పొందే మంచి ఛాన్స్ వచ్చింది. మొత్తం  12,828 ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ (India Post GDS Recruitment) రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది. 
India Post GDS Recruitment: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, పోస్టల్ శాఖలో 12,828 పోస్టులు, ఈరోజే లాస్ట్‌డేట్India Post GDS Recruitment: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, పోస్టల్ శాఖలో 12,828 పోస్టులు, ఈరోజే లాస్ట్‌డేట్

పోస్టాఫీసు GDS రిక్రూట్‌మెంట్ (India Post GDS Recruitment): పదో తరగతి అర్హతతో మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే అవకాశం వచ్చింది. పోస్టల్ శాఖ నుంచి మరో  భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 12,828 ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ (India Post GDS Recruitment) విడుదల చేసింది. కేవలం పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలో ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్  ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో స్పెషల్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ కింద 5,746 పోస్టులు, బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులు ఉన్నాయి.

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ పూర్తి నోటిఫికేషన్-ఇక్కడ క్లిక్ చేయండి


పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 వివరాలు (India Post Office Recruitment 2023 Overview)

పోస్టాఫీస్ రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సంస్థ పోస్ట్ ఆఫీస్ ఇండియా
పోస్టులు 12,828 ఉద్యోగాలు
సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ ఆధారంగా సెలక్షన్
అప్లికేషన్ విధానం ఆన్‌లైన్
అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ (India Post Office Recruitment 2023 Educational Qualification)

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లీష్, లోకల్ లాంగ్వేజ్ ఉండటం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.
  • 11-06-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ సేలరీ వివరాలు (India Post Office Recruitment 2023 Slary Details)

అన్ని అర్హతలు ఉండి. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.29 వేల వరకు జీతం అందుతుంది.

బీపీఎం పోస్టులకు అయితే రూ.12,000 - రూ.29,380ల జీతం
ఏబీపీఎం పోస్టులకు అయితే రూ.10,000 - రూ.24,470 వేతనం .

పోస్టాఫీస్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How To Apply Online For India Post Recruitment 2023)

  • పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ www.indiapost.gov.in ని సందర్శించండి
  • హోంపేజీలో ఎడమ వైపున ఉన్న ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2023 ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి. ఫీజు చెల్లించండి. దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేయండి.
  • ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ ఉపయోగం కోసం దరఖాస్తు ఫార్మ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ ‌ఉమెన్‌లకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మే 22 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 11, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి.

తెలుగులో మరిన్ని రిక్రూట్‌మెంట్, ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/india-post-gds-recruitment-2023-full-details-here-40853/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!