Indian Navy Agniveer Recruitment 2023: 1365 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?

Andaluri Veni

Updated On: June 07, 2023 12:49 pm IST

ఇండియన్ నేవీ నుంచి  1365 అగ్నివీర్ పోస్టుల భర్తీకి (Indian Navy Agniveer Recruitment 2023) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు జూన్ 15, 2023వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.  
 
Indian Navy Agniveer Recruitment 2023: 1365 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?Indian Navy Agniveer Recruitment 2023: 1365 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?

ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2023 (Indian Navy Agniveer Recruitment 2023): ఇండియన్ నేవీ మొత్తం 1365 పోస్టుల కోసం అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR 02/2023 బ్యాచ్‌లో రిజిస్ట్రేషన్ కోసం అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరడం జరిగింది. ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR రిక్రూట్‌‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ఆన్‌లైన్ లింక్ 29 మే 2023 నుంచి యాక్టివేట్ అయింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 15, 2023వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన వివరణాత్మక అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ అందజేశాం.

ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2023 ఓవర్ వ్యూ (Indian Navy SSR Recruitment 2023 Overview)

ఇండియన్ నేవీ SSR రిక్రూట్‌మెంట్ 2023, 1365 పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందజేయడం జరిగింది.

కండక్టింగ్ బాడీ ఇండియన్ నేవీ
పోస్టులు అగ్నివీర్ పోస్టులు
ఖాళీల సంఖ్య 1365
నోటిఫికేషన్ రిలీజ్ డేట్ మే 19, 2023
అప్లికేషన్ ప్రారంభ తేదీ మే 29, 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 15, 2023
ఏరియా సర్వీస్ ఇండియన్ నేవీ
జీతం మొదటి సంవత్సరం రూ.30,000
రెండో సంవత్సరం   రూ.33,000
మూడో సంవత్సరం రూ.36,500లు
అధికారిక వెబ్‌సైట్ https://indiannavy.nic.in

ఇండియన్ నేవీ SSR అర్హత ప్రమాణాలు 2023  (Indian Navy SSR Eligibility Criteria 2023)

  • మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.
  • అభ్యర్థి  01-11-2002 నుంచి 31-04-2005 మధ్యలో పుట్టి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలో ఐఎన్ఎస్ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్ 2023లో కోర్సు శిక్ష ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు కేటాయిస్తారు.

ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2023 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Indain Navy Recruitment 2023 Computer Based Test)

ఈ పోస్టులకు అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (CBE), రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
  • కంప్యూటర్ పరీక్ష క్వశ్చన్ పేపర్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 100 మల్టిపుల్ ప్రశ్నలుంటాయి. ఒక్కొక్కటి ఒక మార్కు చొప్పున 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్  నాలుగు విభాగాల్లో ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు తీసేస్తారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం,  ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/indian-navy-recruitment-2023-notification-for-1365-posts-41587/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!