APPSC Group 2 Prelims 2024 Preparation Plan: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024కి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి... విజయం మీదే

Andaluri Veni

Updated On: February 24, 2024 09:43 am IST

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని టిప్స్‌ని (APPSC Group 2 Prelims 2024 Preparation Plan) ఇక్కడ అందజేశాం. ఈ నెల 25న ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. దీనికోసం అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు.  
 
APPSC Group 2 Prelims 2024 Preparation Plan: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024కి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి... విజయం మీదేAPPSC Group 2 Prelims 2024 Preparation Plan: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024కి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి... విజయం మీదే

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టిప్స్, ట్రిక్స్ (APPSC Group 2 Prelims 2024 Preparation Plan ): ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష త్వరలో జరగనుంది. ఫిబ్రవరి 14న హాల్ టికెట్లు కూడా విడుదల కానున్నాయి. ఈ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యేందుకు చాలామంది సిద్దమవుతున్నారు. ఇంత తక్కువ టైమ్‌లో ప్రిపేర్ అవ్వడం సాధ్యమేనా? ఇది సులభమైన పనేనా? వంటి సందేహాలు అభ్యర్థులను వేధిస్తాయి. అయితే ఈ పరిమిత వ్యవధిని సరిగ్గా ఉపయోగించుకుంటే కచ్చితంగా ప్రిలిమ్స్‌లో అర్హతను సాధించవచ్చు. దానికోసం మంచి స్ట్రాటజీ ఉండాలి.   అభ్యర్థుల సాధన క్రమపద్ధతిలో ఉంటే, ఏదైనా పోటీ పరీక్షలను అధిగమించడం సాధ్యమవుతుంది. అభ్యర్థుల కోసం కొన్ని టిప్స్, ట్రిక్స్‌ని (APPSC Group 2 Prelims 2024 Preparation Plan) ఇక్కడ అందిస్తున్నాం.

APPSC గ్రూప్-2 ప్రిపరేషన్ స్ట్రాటజీ (APPSC Group-2 Preparation Strategy)

APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన  స్ట్రాటజీని సరిగ్గా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. ఏ మాత్రం భయపడకుండా ఈ దిగువున తెలిపిన టిప్స్‌ని పాటిస్తూ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్‌లో మంచి  మార్కులను పొందడం సులభం అవుతుంది.
  • APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్‌కి సిద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా సిలబస్‌, పరీక్షా విధానం గురించి పూర్తి తెలుసుకోవాలి
  • APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్‌ సిలబస్‌ మొత్తాన్ని చూడాలి.
  • సిలబస్‌, పరీక్షా విధానాన్ని బట్టి స్టడీ ప్లాన్ చేసుకోవాలి.
  • APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్‌‌ పేపర్‌లో ప్రతి సెక్షన్‌కు తగినంత సమయం కేటాయించుకోవాలి.
  • అన్ని సబ్జెక్టుల్లో ముఖ్యమైన అంశాలు కవర్ అయ్యేటట్టు టైమ్ టేబుల్‌ను ప్రిపేర్ చేసుకోవాలి.
  • క్వశ్చన్ బ్యాంకు కలిగి ఉన్న మంచి పుస్తకాలు ఎంచుకోవాలి.
  • మంచి వీడియో కోచింగ్ క్లాసులు, ఆడియో క్లాసులను కూడా ఉపయోగించుకోవచ్చు.
  • సిలబస్‌లోని క్లిష్టమైన  అంశాలను గుర్తించాలి.
  • అధ్యయనం చేయడానికి చిన్నపాటి నోట్స్ తయారు చేసుకోవాలి.
  • కష్టతరమైన, సులభమైన అంశాలను కూడా గుర్తించి, కష్టంగా ఉన్న  విషయాలకు, అంశాలకు  ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి.
  • కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉండేలా ప్రతిరోజు వార్తాపత్రిక చదవాలి.
  • ముందు రోజు అంశాలను తర్వాత రోజు కచ్చితంగా రివైజ్ చేసుకోవాలి.
  • అధ్యయనంతో పాటు ప్రాక్టీస్ కూడా చాలా ముఖ్యం. అందుకే  రోజూ మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయాలి.
  • ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ కోసం సమయాన్ని కేటాయించుకోవాలి.
  • APPSC గ్రూప్ 2 మునుపటి పేపర్‌లను సాధన చేయాలి.
  • సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు  కరెంట్ అఫైర్స్ & జనరల్ అవేర్నేస్ కోసం మ్యాగజైన్స్ కూడా జర్నల్స్ కూడా చదవాలి.
  • చదివే క్రమంలో పూర్తి చేసిన అంశాలపై మీకు మీరు పరీక్ష పెట్టుకుని మీ స్థాయిని గమనించండి.

అభ్యర్థులు పరీక్ష రోజున కూడా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. పరీక్షకు హాజరవుతున్నప్పుడు అభ్యర్థి చాలా భయాందోళనకు గురైతే, వారు చదివిన వాటిని మరచిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ప్రశాంతంగా ఉంటూ పాజిటివ్ దృక్పథంతో పరీక్షకు హాజరుకావడం చాలా అవసరం.

చివరగా APPSC గ్రూప్ 2 పరీక్ష మీ జీవితంలో ఒక అంశం మాత్రమేనని, మీ విలువ మీ పరీక్ష స్కోర్‌పై ఆధారపడి ఉండదని గుర్తుంచుకోండి. పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే  మంచి ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/last-minute-tips-for-appsc-group-2-prelims-exam-2024-49830/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!