Telangana NEET UG Counselling 2023: తెలంగాణ NEET UG 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే?

Andaluri Veni

Updated On: July 10, 2023 01:19 pm IST

తెలంగాణ NEET UG 2023 కౌన్సెలింగ్ (Telangana NEET UG Counselling 2023) కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 14, 2023. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి tsmedadm.tsche.inలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 
 
Telangana NEET UG Counselling 2023: తెలంగాణ NEET UG 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే?Telangana NEET UG Counselling 2023: తెలంగాణ NEET UG 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఎప్పుడంటే?

తెలంగాణ నీట్ UG కౌన్సెలింగ్ 2023 (Telangana NEET UG Counselling 2023): తెలంగాణ NEET UG 2023 కౌన్సెలింగ్ (Telangana NEET UG Counselling 2023) కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 14, 2023. కౌన్సెలింగ్ రౌండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు.  2023-2024 విద్యా సంవత్సరానికి MBBS/BDS కోర్సులలో దరఖాస్తుల స్వీకరణకు 14వ తేదీ రిజిస్టర్ చేసుకోవచ్చు.అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి tsmedadm.tsche.in లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 14, 2023. ప్రవేశానికి కనీస అర్హత స్కోర్ జనరల్ కేటగిరీకి కటాఫ్ స్కోర్ 137 , SC/ST/BC & PWD అభ్యర్థులకు SC/ST/BC కేటగిరీలకు కటాఫ్ స్కోర్ 107,  PwD కోసం కటాఫ్ స్కోర్ 121. కౌన్సెలింగ్ రౌండ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థి ఇంటర్మీడియట్ (10+2 ప్యాటర్న్) లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)/ బయోటెక్నాలజీ, ఇంగ్లీష్‌తో సమానమైన పరీక్షలో పాసై ఉండాలి. డిసెంబరు 31, 2023 నాటికి వయోపరిమితి 17 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి.

తెలంగాణ నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్‌కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? (Telangana NEET UG 2023 Counselling: How to Register)

తెలంగాణ నీట్ యూజీ 2023 కౌన్సెలింగ్ కోసం ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • KNR యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధికారిక సైట్‌ని tsmedadm.tsche.in లో సందర్శించండి.
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న తెలంగాణ NEET UG 2023 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి SUBMITపై క్లిక్ చేయాలి.
  • అకౌంట్‌కు లాగిన్ చేసి దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి.
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • SUBMITపై క్లిక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేయాలి.
  • తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోవాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాత్కాలిక మెరిట్ లొకేషన్ NEET UG-2023 ర్యాంక్, స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్ తర్వాత ఇక్కడ తెలియజేయబడిన ఇతర అర్హత ప్రమాణాల ఆధారంగా తయారు చేయబడుతుంది. కాలేజీ అడ్మిషన్ కమిటీ ద్వారా కేటాయించబడిన కాలేజీలో అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ల ఫైనల్ ధ్రువీకరణ నిర్వహించబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/neet-ug-counselling-registration-for-telangana-active-till-jul-14-42847/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!