NESTS Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త, 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు, పూర్తి వివరాలివే

Andaluri Veni

Updated On: July 21, 2023 01:40 pm IST

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (NESTS Recruitment 2023) విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
NESTS Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త, 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు, పూర్తి వివరాలివేNESTS Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త, 6,329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులు, పూర్తి వివరాలివే

NESTS రిక్రూట్‌మెంట్ 2023 (NESTS Recruitment 2023): దేశంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఆరు వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) నుంచి నోటిఫికేషన్ (NESTS Recruitment 2023) రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులను డైరక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 6,329 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు, హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి.   ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆగస్టు 18, 2023 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.

NESTS రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్- ఇక్కడ క్లిక్ చేయండి

NESTS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు (NESTS Recruitment 2023 Vacancy Details)

NESTS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలకు సంబంధించిన వివరాలను ఈ దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

పోస్టు పేరు ఖాళీలు
టీజీటీ 5660
హాస్టల్ వార్డెన్ పోస్టులు (మగవాళ్లు) 335
హాస్టల్ వార్డెన్ (ఆడవాళ్లు) 334

NESTS రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు (NESTS Recruitment 2023 Eligibility)

NESTS రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు ఉండాలి.
  • టీజీటీ ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతోపాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ, టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ పాసై ఉండాలి.
  • ఇక అభ్యర్థుల వయస్సు 18.8.2023 నాటికి 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాలు మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి ప్రకారం వయస్సులో మినహాయింపు ఉంటుంది.

NESTS రిక్రూట్‌మెంట్ 2023 అప్లికేషన్ ఫీజు  (NESTS Recruitment 2023  Application Fee)

NESTS రిక్రూట్‌మెంట్ 2023 అప్లికేషన్ ఫీజు వివరాలు ఈ కింద పట్టికలో అందజేశాం. ఫీజును అభ్యర్థులు ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

పోస్టు పేరు జీతం
టీజీటీ పోస్టులు రూ.1500
హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.1000

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్ష ఓఎంఆర్ ఆధారిత విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్‌కు 30 మార్కులు కేటాయించడం జరిగింది. హాస్టల్ వార్డెన్ రాత పరీక్షకు 120 మార్కులు కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

టీజీటీ పోస్టులకు ఎంపికై జాయిన్ అయిన అభ్యర్థులు నెలకు రూ.44900ల  నుంచి రూ.1,42400లు, హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.29200ల నుంచి రూ.92300ల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://emrs.tribal.gov.in వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి చూడవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/nests-non-teaching-and-teaching-recruitment-2023-43358/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!