SBI Bank Recruitment 2023: ఎస్‌బీఐ బ్యాంకులో 1031 ఉద్యోగాలు, అప్లికేషన్ ఫీజు లేదు, నెలకు రూ.41,000 జీతం

Andaluri Veni

Updated On: April 17, 2023 02:21 pm IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్  (SBI Bank Recruitment 2023) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1031 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
SBI Bank Recruitment 2023: ఎస్‌బీఐ బ్యాంకులో 1031 ఉద్యోగాలు, అప్లికేషన్ ఫీజు లేదు, నెలకు రూ.41,000 జీతంSBI Bank Recruitment 2023: ఎస్‌బీఐ బ్యాంకులో 1031 ఉద్యోగాలు, అప్లికేషన్ ఫీజు లేదు, నెలకు రూ.41,000 జీతం

స్టేట్ బ్యాంకులో 2023 ఉద్యోగాలు (SBI Bank Recruitment 2023): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1031 ఉద్యోగాలను (SBI Bank Recruitment 2023) భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల్లో ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్, సూపర్‌వైజర్, ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్, సపోర్ట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టనున్నారు.  ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాల్లో  తెలుగు రాష్ట్రాల్లో అమరావతి పరిధిలో 69 పోస్టులు, హైదరాబాద్ పరిధిలో 45 పోస్టులున్నాయి.  ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఈ దిగువ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టుల వివరాలు (SBI Bank Vacancy Details 2023)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున చూడండి.
పోస్టు పేరు పోస్టుల సంఖ్య
ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ 821
ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ 172
సూపర్‌వైజర్, 38

స్టేట్ బ్యాంక్ ఆఫ్  ఇండియా ఉద్యోగాలకు ఉండాల్సిన అర్హతలు (SBI Recruitment 2023 Elegibility)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగై ఉండాలి.
  • ఏటీఎం ఆపరేషన్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థికి 01-04-2023 నాటికి కనిష్ట వయస్సు 60 సంవత్సరాలు, గరిష్టంగా 63 సంవత్సరాలు ఉండాలి.
  • ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ సేలరీ వివరాలు (SBI Salary Details)

ఈ పోస్టుల్లో చేరిన వారికి మంచి జీతం ఉంటుంది. జీతభత్యాల వివరాలు ఈ దిగువున తెలిపిన విధంగా ఉంటాయి.
పోస్టు పేరు సేలరీ
ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్ రూ.41,000
ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్ రూ.36,000
సపోర్ట్ ఆఫీసర్ రూ.41,000

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ నెల 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌‌లో https://sbi.co.in/web/careers కి వెళ్లి అప్లై చేసుకోవాలి.

తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్  చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/sbi-bank-recruitment-2023-notification-39271/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!