SBI Clerk Mains Exam Date 2024: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ 2024 పరీక్షా తేదీలపై కీలక అప్‌డేట్

Andaluri Veni

Updated On: February 15, 2024 06:30 pm IST

SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష 2024 ఫిబ్రవరి 25, మార్చి 4న (SBI Clerk Mains Exam Date 2024) జరగనుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. దీనికి సంబంధించిన ఫలితాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. SBI మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 15 నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. 
SBI Clerk Mains Exam Date 2024: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ 2024 పరీక్షా తేదీలపై కీలక అప్‌డేట్SBI Clerk Mains Exam Date 2024: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ 2024 పరీక్షా తేదీలపై కీలక అప్‌డేట్

SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీ 2024 (SBI Clerk Mains Exam Date 2024): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లర్క్ మెయిన్స్ 2024 పరీక్ష తేదీని ( SBI Clerk Mains Exam Date 2024) ప్రకటించింది. అధికారిక అప్‌డేట్ ప్రకారం,  పరీక్ష ఫిబ్రవరి 25,  మార్చి 4 న వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది. క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 2024లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ తదుపరి రౌండ్‌లో పాల్గొనవచ్చు. అధికారిక ప్రకటన ఇలా ఉంది, 'మెయిన్ ఎగ్జామ్ ఫిబ్రవరి 25, మార్చి 4 న నిర్వహించబడుతుంది. ప్రాథమిక పరీక్ష ఫలితాలు, ప్రధాన పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్ త్వరలో విడుదల చేయబడతాయి. SBI మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 15 నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.

SBI క్లర్క్ మెయిన్ పరీక్ష తేదీలు 2024ని ఎలా చెక్ చేయాలి? (How to Check SBI Clerk Main Exam Dates 2024)

అభ్యర్థులు ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ పరీక్షా తేదీలను ఈ దిగువున  తెలిపిన విధంగా అర్థం చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌‌సైట్‌ని bank.sbi సందర్శించాలి.
  • హోంపేజీలో "కెరీర్ సెక్షన్‌కి" వెళ్లాలి.
  • అందులో లేటెస్ట్ అనౌన్స్‌మెంట్ సెక్షన్‌లో SBI Clerk Junior Associates Recruitment 2023 లింక్‌ను గుర్తించి క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో SBI మెయిన్ ఎగ్జామ్ తేదీలను చెక్ చేయాలి.
  • అవసరమైతే ఆ తేదీలను స్క్రీన్ షాట్‌ తీసుకుని సేవ్ చేసుకోవాలి.

SBI క్లర్క్ మెయిన్స్ 2024 పరీక్షా విధానం (SBI Clerk Mains 2024 Exam Pattern)

SBI క్లర్క్ మెయిన్స్ 2024 పరీక్ష మొత్తం 200 మార్కులకు రెండు గంటల 40 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నపత్రంలో సాధారణ లేదా ఆర్థిక అవగాహనపై 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్‌పై 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌పై 50, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు సహా 190 ప్రశ్నలు ఉంటాయి. సంస్థలో జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం 8,283 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ డ్రైవ్ నిర్వహించబడుతోంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

త్వరలో SBI క్లర్క్ 2024 ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదల (SBI Clerk Prelims Result 2024 Releasing Soon)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రిలిమినరీ పరీక్ష కోసం SBI క్లర్క్ ఫలితాలు 2024ని ప్రకటించనుంది. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండాలని అధికారులు సూచించారు. అలాగే  బ్యాంకు దేశవ్యాప్తంగా జనవరి 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఫలితాలు వచ్చిన తర్వాత, అభ్యర్థులు లాగిన్ పేజీలోని రోల్ నెంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాల వంటి వారి ఆధారాలను ఉపయోగించి వారి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విడుదల చేసిన తర్వాత డైరక్ట్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులతో షేర్ చేయబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్‌లను చూడండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/sbi-clerk-main-exam-dates-2024-announced-49917/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!