SBI Clerk Notification 2023: 8000లకుపైగా బ్యాంకు ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే?

Andaluri Veni

Updated On: November 17, 2023 12:35 pm IST

బ్యాంకు ఉద్యోగాలను కోరకునే అభ్యర్థులకు శుభవార్త. SBI నుంచి ఏకంగా 8000లకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ (SBI Clerk Notification 2023) విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. 
SBI Clerk Notification 2023: 8000లకుపైగా బ్యాంకు ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే?SBI Clerk Notification 2023: 8000లకుపైగా బ్యాంకు ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే?

ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ 2023 (SBI Clerk Notification 2023): బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే అభ్యర్థులు మంచి ఛాన్స్ వచ్చింది. SBI నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం  8000లకుపైగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. SBI అర్హులైన అభ్యర్థుల నుంచి 8773 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల కోసం SBI క్లర్క్ నోటిఫికేషన్  (SBI Clerk Notification 2023) 2023ని విడుదల చేసింది.  ఈ మేరకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.inలో SBI క్లర్క్ అప్లై ఆన్‌లైన్ 2023 ప్రక్రియ ఈరోజు నుంచి అంటే నవంబర్ 17, 2023 నుంచి మొదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, SBI క్లర్క్ దరఖాస్తు ఫీజు, SBI క్లర్క్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ అందజేశాం.

SBI క్లర్క్ 2023 నోటిఫికేషన్ PDF (SBI Clerk 2023 Notification PDF)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్లర్క్ 2023 నోటిఫికేషన్ PDFని 16 నవంబర్ 2023న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) కోసం SBI క్లర్క్ నోటిఫికేషన్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ దిగువన షేర్ చేయయడం జరిగింది. ఆసక్తి, అర్మత ఉన్న అభ్యర్థులు SBI క్లర్క్ నోటిఫికేషన్ PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్లర్క్ 2023 నోటిఫికేషన్ PDF

SBI క్లర్క్ 2023 పూర్తి వివరాలు (SBI Clerk 2023 Full Details)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 8773 జూనియర్ అసోసియేట్ పోస్ట్‌ల (క్లెరికల్ క్యాడర్) భర్తీకి దరఖాస్తులు కోరింది. రిజిస్ట్రేషన్ పోర్టల్ ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అయింది. SBI రిక్రూట్‌మెంట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున చూడండి.

ఆర్గనైజేషన్ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టుల పేరు జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
SBI క్లర్క్ 2023 వైకేన్సీ 8773
SBI క్లర్క్ అప్లికేషన్ డేట్స్ 2023 17 నవంబర్ 2023  నుంచి 7 డిసెంబర్ 2023
ఫ్రీకెన్సీ ఎగ్జామ్ ఏడాదికోసారి
సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్
కేటగిరి బ్యాంకు ఉద్యోగాలు
ఎగ్జామ్ మోడ్ ఆన్‌లైన్
జీతం రూ.26,000 నుంచి రూ.29,000
జాబ్ లోకేషన్ దేశం మొత్తం
అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in/careers


SBI క్లర్క్ 2023 అర్హత ప్రమాణాలు (SBI Clerk 2023 Eligibility Criteria)

వివిధ పోస్టుల కోసం SBI క్లర్క్ 2023కి అవసరమైన అన్ని అర్హత ప్రమాణాలను అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వయోపరిమితి, విద్యార్హత మొదలైన అర్హత ప్రమాణాలు క్రింద వివరించబడ్డాయి.... ఇక్కడ మరింత చదవండి:

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు కనీసం 20 ఏళ్లు ఉండాలి. 28 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరి అభ్యర్థులు వయస్సులో మినహాయింపు ఉంటుంది.
  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి.
  • అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.


SBI క్లర్క్ 2023 ముఖ్యమైన తేదీలు (SBI Clerk 2023 Important Dates)

SBI క్లర్క్ 2023  ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవాలి.   SBI క్లర్క్ 2023 షెడ్యూల్ ప్రకారం, SBI క్లర్క్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు 17 నవంబర్ 2023 నుంచి ప్రారంభమవుతున్నాయి. సంబంధిత ముఖ్యమైన తేదీలను ఇక్కడ అందజేశాం.

SBI Clerk 2023 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు
SBI Clerk ఆన్‌లైన్ దరఖాస్తు  ప్రారంభం 17  నవంబర్ 2023
SBI Clerk పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ 7 డిసెంబర్ 2023
SBI క్లర్క్ PET కాల్ లెటర్ తెలియాల్సి ఉంది
SBI క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు 2023 తెలియాల్సి ఉంది
SBI క్లర్క్ ఎగ్జామ్ డేట్ 2023 తెలియాల్సి ఉంది
SBI మెయిన్స్ క్లర్క్ అడ్మిట్ కార్డు 2023 తెలియాల్సి ఉంది
SBI క్లర్క్ ఎగ్జామ్ డేట్ 2023 (మెయిన్స్) తెలియాల్సి ఉంది

నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ SBI క్లర్క్ ఖాళీలు ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉద్యోగాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 575 బ్యాంకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. తెలంగాణలో 525, ఆంధ్రప్రదేశ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి.   SBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసకోవడానికి  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750లు చెల్లించాల్సి ఉంటుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/sbi-clerk-recruitment-2023-last-date-to-apply-47322/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!