NEET MDS Postponement 2024 : నీట్ ఎండీఎస్ 2024 వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ, ఏం జరిగిందంటే?

Andaluri Veni

Updated On: February 16, 2024 12:47 pm IST

NEET MDS 2024 వాయిదాపై (NEET MDS Postponement 2024) సుప్రీంకోర్టులో మొదటి విచారణను ఈరోజు, ఫిబ్రవరి 16న చేపట్టింది. కోర్టు విచారణకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూడండి. 
 
NEET MDS Postponement 2024 : నీట్  ఎండీఎస్ 2024 వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ, ఏం జరిగిందంటే?NEET MDS Postponement 2024 : నీట్ ఎండీఎస్ 2024 వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ, ఏం జరిగిందంటే?

నీట్ ఎండీఎస్ వాయిదా 2024 (NEET MDS Postponement 2024): సుప్రీంకోర్టు  NEET MDS 2024 వాయిదాపై (NEET MDS Postponement 2024)  మొదటి విచారణను ఈరోజు, ఫిబ్రవరి 16న చేపట్టింది. జస్టీస్ JB పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ పిటిషన్‌ను విచారించారు. నీట్ MDS 2024 పరీక్షను జూలై వరకు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈ విచారణ జరిగింది. దాదాపు 8,800 NEET MDS 2024 ఆశావహులు పరీక్ష వాయిదాకు మద్దతుగా డిజిటల్ పిటిషన్‌పై సంతకం కూడా చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తర్వాత విచారణను ఫిబ్రవరి 21, 2024కు వాయిదా వేయడం జరిగింది.

NEET MDS 2024 వాయిదాపై SC మొదటి విచారణలో ఏం జరిగింది? (What happened in SC's First Hearing on NEET MDS 2024 Postponement?)

NEET MDS 2024 వాయిదాపై సుప్రీంకోర్టు మొదటి విచారణలో ఏం జరిగిందో ఈ దిగువున అందజేశాం.
  • NEET MDS ఇంటర్న్‌షిప్‌ల కోసం కటాఫ్‌లను నిర్ణయించాలని కోరుతూ చేసిన అభ్యర్థనపై కోర్టు నోటీసు జారీ చేసింది.
  • ఇంటర్న్‌షిప్ కోసం కటాఫ్ తేదీని నిర్ణయించడానికి చట్టపరమైన ఆధారం సమానమని ప్రతివాదులు సూచించారు
  • నీట్ ఎండీఎస్ వ్యవహారంపై కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇంటర్న్‌షిప్ కోసం కటాఫ్ తేదీని నిర్ణయించమని మాత్రమే ప్రతివాదులను కోరింది.
  • తదుపరి విచారణ ఫిబ్రవరి 21, బుధవారం జరుగుతుంది. NEET MDS ఇంటర్న్‌షిప్‌ల కోసం కటాఫ్ తేదీని నిర్ణయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఆర్డర్‌పై NBE, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా స్పందించాలి.

నీట్ ఎండీఎస్ 2024 సుప్రీంకోర్టు హియరింగ్-ముఖ్యమైన వివరాలు (NEET MDS 2024 SC Hearing: Important Details)


నీట్ ఎండీఎస్ 2024కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేశాం.

విశేషాలు వివరాలు
మొదటి హియరింగ్ డేట్ ఫిబ్రవరి 16, 2024
హియరింగ్ టైమ్ 11:30 గంటలకు
NEET MDS విషయం క్రమ సంఖ్య 19
కోర్టు నెంబర్ 1
జడ్జ్ పేరు JB పరిద్వాలా, మనోజ్ మిశ్రా
బెంచ్ అసెంబ్లీ టైమ్ ఉదయం 10:30 గంటలకు
కోర్ట్ హాల్ నెంబర్ 1 కోసం జాబితా చేయబడిన మొత్తం విషయాల సంఖ్య 20

పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది పేరు
సుమంత్ నూకల
ప్రతివాదులు
  • యూనియన్ ఆఫ్ ఇండియా
  • డెంటల్ కౌన్సెలింగ్ ఆఫ్ ఇండియా
  • నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/admin/news-dashboard/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/sc-hearing-on-neet-mds-2024-postponement-49983/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top