School Assembly News Headlines for 11 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: July 10, 2023 06:02 pm IST

స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాల కోసం ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను  (School Assembly News Headlines for 11 July 2023) ఇక్కడ అందజేయడం జరిగింది.
 
School Assembly News Headlines for 11 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండిSchool Assembly News Headlines for 11 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు ఇక్కడ తెలుసుకోండి

జూలై 11 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 11 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.

11 జూలై 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 11 Juay 2023)

ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)

  • కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీవ్ పార్క్ రాజీవ్ మార్గ్ రహదారిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కడపలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.
  • విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలకు దిగారు.
  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ ఆయన చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ కోరింది.
  • తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకటేశ్వరస్వామి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఉచిత సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

తెలంగాణ న్యూస్ (Telangana News)

  • తెలంగాణలో పెండింగ్ బిల్లుల అంశంపై రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని గవర్ననర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. గతంలోనే మూడు బిల్లులను ఆమోదించిట్టు తెలిపారు.
  • బోనాల సందర్బంగా నగరంలో వివిధ ఆలయాలకు మంజూరైన 2.1 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులను ఆయా దేవాలయాల కమిటీ సభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు.
  • తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఆగస్ట్ నెల నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలో పాదయాత్రలు చేయాలని బీజేపీ నాయకులు  నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ వార్తలు (National News)

  • గుజరాత్‌లోని  సూరత్ విమానాశ్రయంలో DRI సుమారు రూ.25 కోట్ల విలువైన 48 కిలోల బంగారు ముద్దను స్వాధీనం చేసుకుంది.
  • బీజేపీ అధ్యక్షుడు దక్షిణాది రాష్ట్రాల పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు.
  • జూలై 10 ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
  • ఉత్తర భారతదేశంలో భారీ వర్షాల కారణంగా కొండచరియల విరిగిపడి 16 మంది మరణించారు.
  • ప్రస్తుతం మణిపూర్‌లో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి AFSPA కల్పించే చట్టపరమైన రక్షణ లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
  • విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
  • జమ్మూకశ్మీర్ పూంచ్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడులో సైనికుడు గాయపడ్డాడు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/school-assembly-news-headlines-july-11-2023-42870/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!