School Assembly News Headlines for 24 June 2023 in Telugu: ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ టాప్ స్టోరీలు

Andaluri Veni

Updated On: June 23, 2023 03:12 pm IST

స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాల కోసం ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను  (School Assembly News Headlines for 24 June 2023 in Telugu)  ఇక్కడ తెలుసుకోండి. 
School Assembly News Headlines for 24 June 2023 in Telugu: ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ టాప్ స్టోరీలుSchool Assembly News Headlines for 24 June 2023 in Telugu: ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ టాప్ స్టోరీలు

జూన్ 24 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 24 June 2023 in Telugu)   ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.

24 జూన్ 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 24 June 2023 in Telugu)

పాఠశాల అసెంబ్లీలో చెప్పేందుకు వివిధ రంగాలకు సంబంధించిన వార్తలను ఇక్కడ తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ వార్తలు (జూన్ 24, 2023)

  • ఆంధ్రప్రదేశ్‌లో "జగనన్న సురక్ష" అనే కార్యక్రమం మొదలైంది. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో  కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ప్రారంభించారు
  • ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కొన్ని జిల్లాలో  శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
  • కడపలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి వైసీపీ నేతను హత్య చేశారు.
  • టీటీడీ తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది. దళారీ వ్యవస్థను కూల్చడానికి  శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు మొత్తం 70మంది దళారులను పట్టుకున్నామని, మరో 214 కేసులు నమోదు చేశామని చెప్పారు.
  • తిరుమల నడకమార్గంలో శుక్రవారం ఉదయం నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయపడిన బాలుడిని టీటీడీ చైర్మన్ పరామర్శించారు.
తెలంగాణ వార్తలు (జూన్ 24, 2023)
  • మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
  • తెలంగాణ నాయకులు బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ  మునిగిపోయే నావలోకి  బీజేపీ నేతలు ఎవరూ వెళ్లరన్నారు.
  • ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ప్రాణాలు తీసుకుంది. తమ కుమార్తెకు క్యాన్సర్ ఉందని తెలిసి, కూతురుతో పాటు తల్లిదండ్రులు ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
  • తెలంగాణకు  చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. నర్సింగ్ వృత్తిలో విశేషమైన సేవలు అందించినందుకు ఈ అవార్డును అందించడం జరిగింది.
జాతీయ వార్తలు (జూన్ 24, 2023)
  • 15 ప్రతిపక్ష పార్టీలు పాట్నాలో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా తాము బీహార్‌లో  గెలిస్తే, దేశం మొత్తాన్ని గెలుస్తామని అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
  • 2050 నాటికి గ్లోబల్ డయాబెటిస్ కేసులు 1.3 బిలియన్లకు పెరుగుతాయని లాన్సెట్ మెడికల్ జర్నల్ వెల్లడించింది.  భారతదేశంలో అత్యధికంగా 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు.
  • ఐదు కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్‌లోకి తరలిస్తున్న ఐదుగురిని ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని బ్యాంకాక్ మీదుగా అక్రమంగా తరలించారని ఢిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
  • పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశంపై బీజేపీ ఎంపీ రవి కిషన్ విమర్శులు గుప్పించారు. సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు సమావేశమయ్యాయని ఆయన అన్నారు. వారంతా ఎసీ రూమ్‌లో పుట్టడంతో ప్రధాని మోదీ ఎదుట నిలువలేకపోతున్నారని ఎద్దేవ చేశారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు,  ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/school-assembly-news-headlines-june-24-2023-42352/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top