School Assembly News Headlines for 29 June 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: June 28, 2023 04:35 pm IST

స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాల కోసం ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను  (School Assembly News Headlines for 29 June 2023) ఇక్కడ అందజేయడం జరిగింది.
School Assembly News Headlines for 29 June 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండిSchool Assembly News Headlines for 29 June 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండి

జూన్ 29 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 29 June 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.

29 జూన్ 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 29 June 2023)

ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు (Andhra Pradesh News)
  • ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజులు వర్షాలు కురువనున్నాయి.  నైరుతు రుతు పవనాలు జోరుగా కదలడంతో పాటు ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో  రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు పడనున్నాయి.
  • ఏపీలో  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం, గురువారం వారాహి యాత్రకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం పవన్ భీమవరంలో  విశ్రాంతి తీసుకుంటున్నారు.
  • ఏపీ ప్రభుత్వం ఉద్యోగాలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ సమయంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.  దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.
  • తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన కవి, రచయిత, పండితుడు, వ్యాఖ్యాతగా పేరుగాచింని ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకు కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కారం దక్కింది. 2021 సంవత్సరానికి గానూ దక్షిణ భారతదేశం నుంచి ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేయడం జరిగింది.

తెలంగాణ ప్రధాన వార్తలు (Telangana News)
  • తెలంగాణలోని హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా జూలై 16న హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో (Old City) జరుగనున్న బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్‌జంగ్‌ మ్యూజియంలో అధికారులు, స్థానిక ప్రజాప్రనిథులతో మంత్రి తలసాని రివ్యూ చేశారు.
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్  తమిళిసై సౌందరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రి పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతుందని ఆమె అన్నారు. త్వరలో కొత్త భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
  • మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా బుధవారం కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు హైదరాబాద్‌‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న పీవీ జ్ఒనబూమి దగ్గర నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను గుర్తు చేసుకున్నారు.
  • మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. కష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ అని పీవీ నరసింహారావు అని కేసీఆర్ అన్నారు. పీవీ  నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు.

జాతీయ వార్తలు (National News)
  • పూరీలో జగన్నాథుని రథయాత్ర వేడుకలు విజయవంతంగా ముగిశాయి. బుధవారం జగన్నాథుని బహుడా  యాత్రని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు  పాల్గొన్నారు.
  • TAPAS 201 UAV యూజర్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉందని DRDO తెలిపింది.
  • ఉద్యోగాల కుంభకోణంలో టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షురాలు సయోనీ ఘోష్‌కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది.
  • మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు.
  • బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం చెన్నై నుంచి తిరునల్వేలికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రాత్రి 11.15 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/school-assembly-news-headlines-june-29-2023-42430/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!