SSC Constable Posts 2023: పదో తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, మొత్తం 75,768 పోస్టులు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: November 21, 2023 12:10 pm IST

అభ్యర్థులు గుడ్‌న్యూస్. కేవలం 10వ తరగతి విద్యార్హతతో 75 వేలకుపైగా ఉద్యోగాల (SSC Constable Posts 2023)  భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 24వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మరిన్ని వివరాలను ఈ ఆర్టికల్లో అందజేశాం. 
 
SSC Constable Posts 2023: పదో తరగతి విద్యార్హతతో  ప్రభుత్వ ఉద్యోగాలు, మొత్తం 75,768 పోస్టులు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండిSSC Constable Posts 2023: పదో తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు, మొత్తం 75,768 పోస్టులు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

SSC కానిస్టేబుల్ పోస్టులు 2023 (SSC Constable Posts 2023): నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి విద్యార్హతతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (SSC GD Constable) ఉద్యోగాలను (SSC Constable Posts 2023) భర్తీ చేయనున్నారు. మొత్తం 75,768  పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 24న ప్రారంభమవుతుంది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 28, 2023 లాస్ట్‌డేట్. సంబంధిత నోటిఫికేషన్ కోసం ఈ దిగువున ఉన్న టేబుల్లో క్లిక్ చేయండి.

SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్

SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మొత్తం పోస్టులు (SSC GD Constable Recruitment 2023 Total Posts)

SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ మొత్తం పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

BSF 27,875
సీఆర్‌పీఎఫ్ 25,427
సీఐఎస్ఎఫ్ 8598
ఐటీబీపీ 3006
ఎస్‌ఎస్‌బీ 5278
ఎస్ఎస్‌ఎఫ్ 583
అసోం రైఫిల్స్ 4776
ఎన్‌ఐఏఫ్ 225

SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ముఖ్యమైన తేదీలు  (SSC GD Constable Recruitment 2023 Dates)

SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందజేశాం. అభ్యర్థులు ఫాలో అవ్వొచ్చు.

ఎస్ఎస్‌సీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఈవెంట్స్ ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం నవంబర్ 24, 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 28, 2023
CBE రాత పరీక్ష తేదీ ఫిబ్రవరి 2024

SSC జీడీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు (SSC GD Constable Recruitment 2023 Eligibility)

SSC జీడీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందించడం జరిగింది.
  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
  • ఆగస్ట్ 1, 2023 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
  • కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • జనరల్ అభ్యర్థులు రూ.100ల వరకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్ మెన్, మహిళలు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు ఎలా అప్లై చేసుకోవాలంటే? (SSC Constable Recruitment Exam 2023: How to apply)

అభ్యర్థులు SSC కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం   ఈ దిగువున తెలిపిన విధానం దరఖాస్తు చేసుకోవాలి.
  • ssc.nic.inలో SSC అధికారిక సైట్‌ని సందర్శించండి.
  • హోమ్‌పేజీలో, "ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్-2023లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మగవాళ్లు, మహిళలు నోటీసు"పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, Subumtపై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు ఫార్మ్‌ను పూరించండి. దరఖాస్తు ఫీజు చెల్లించండి.
  • పూర్తైన తర్వాత, డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయండి.
  • తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ఉంచండి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకూ జీతం ఉంటుంది. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేయడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ssc-gd-recruitment-2023-notification-pdf-47432/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!