SSC Selection Post 2024 Notification: 6000లకు పైగా ఉద్యోగాల భర్తీకి ఈరోజే నోటిఫికేషన్ విడుదల, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లకు ఛాన్స్

Andaluri Veni

Updated On: February 02, 2024 11:13 am IST

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 కింద వివిధ పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయనుంది. సంబంధిత నోటిఫికేషన్ (SSC Selection Post 2024 Notification), రిజిస్ట్రేషన్ లింక్, అర్హత, ఎంపిక ప్రక్రియ, పరీక్ష తేదీ, జీతం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో చూడండి. 
SSC Selection Post 2024 Notification: 6000లకు పైగా ఉద్యోగాల భర్తీకి ఈరోజే నోటిఫికేషన్ విడుదల, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లకు ఛాన్స్SSC Selection Post 2024 Notification: 6000లకు పైగా ఉద్యోగాల భర్తీకి ఈరోజే నోటిఫికేషన్ విడుదల, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన వాళ్లకు ఛాన్స్

SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 నోటిఫికేషన్ 2024 (SSC Selection Post 2024 Notification): స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అర్హతలతో సహా వివిధ సెలక్షన్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమవుతుంది. అంటే  ఫిబ్రవరి  01 ఫిబ్రవరి 2024న మొదలవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. ఆసక్తిగల, అర్హత ఉన్న విద్యార్థులందరూ తమ దరఖాస్తులను 28 ఫిబ్రవరి 2024లోగా లేదా అంతకు ముందు సబ్మిట్ చేయవచ్చు.  ఈ వివరాలు SSC వార్షిక క్యాలెండర్‌లో ఉన్నాయి.

SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 నోటిఫికేషన్ తేదీలు (SSC Selection Post Phase 12 Notification 2024 Dates)

SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 నోటిఫికేషన్‌కు సంబంధించిన తేదీలను ఈ దిగువున అందజేశాం.

సంస్థ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్
మొత్తం ఖాళీలు 6000పైగా
నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 01, 2024
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది ఫిబ్రవరి 28, 2024
ఎగ్జామ్ డేట్ మే 6 నుంచి 8, 2024
ఎగ్జామ్ మోడ్ ఆన్‌లైన్
అర్హత ప్రమాణాలు పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్

SSC ఎంపిక పోస్ట్ ఫేజ్ 12 ఎంపిక ప్రక్రియ  2024 (SSC Selection Post Phase 12 Selection Process 2024)


SSC సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 సెలక్షన్ ప్రాసెస్ 2024లో ఆన్‌లైన్ రాత  పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.  కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో విజయవంతమైన అభ్యర్థులు తదుపరి దశకు వెళ్తారు.
  • రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత): అభ్యర్థులు తదుపరి ఎంపిక దశలకు వెళ్లడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)లో అర్హత సాధించాలి.
  • టైపింగ్/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్: డేటా ఎంట్రీ, కంప్యూటర్ స్కిల్ టెస్ట్‌లు కూడా ఉంటాయి.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: CBTలో అర్హత సాధించిన తర్వాత, అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.
  • ఫైనల్ మెరిట్ జాబితా కంప్యూటర్ ఆధారిత మోడ్ పరీక్షలో అభ్యర్థుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది.
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను నిర్దిష్ట నిష్పత్తిలో పిలవడం జరుగుతుంది.
  • (ఏ) ఏదైనా కేటగిరీ పోస్ట్‌లలో గరిష్టంగా 5 ఖాళీల కోసం 1:20.
  • (బీ) కనీసం 100 మంది అభ్యర్థులతో ఏదైనా కేటగిరీ పోస్ట్‌లలో 5 కంటే ఎక్కువ ఖాళీలకు 1:10
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ssc-selection-post-2024-notification-will-be-released-today-49396/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!