TREIRB Gurukulam Results 2024: తెలంగాణ గురుకుల ఉద్యోగ ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే?

Andaluri Veni

Updated On: February 08, 2024 11:17 am IST

తెలంగాణ గురుకుల ఉద్యోగ ఫలితాలు (TREIRB Gurukulam Results 2024)  విడుదలయ్యాయి. TREIRB అధికారిక పోర్టల్లో ఫలితాలతో పాటు మెరిట్ జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఈ ఫలితాలను చెక్ చేసుకునే విధానాన్ని ఇక్కడ అందజేశాం. 
TREIRB Gurukulam Results 2024: తెలంగాణ గురుకుల ఉద్యోగ ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే?TREIRB Gurukulam Results 2024: తెలంగాణ గురుకుల ఉద్యోగ ఫలితాలు విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే?

తెలంగాణ గురుకులం ఫలితాలు 2024 (TREIRB Gurukulam Results 2024): తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) TGT, ఇతర పోస్టుల కోసం పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణ గురుకులం ఫలితాల 2024 లింక్ ఈరోజు అంటే ఫిబ్రవరి 08, 2024 యాక్టివేట్ అయింది.  ఫిబ్రవరి 8న డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం TREIRB ఫలితాలు 2024 ప్రకటించబడ్డాయి.  TGT, ఇతర పోస్టుల కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 23, 2023 వరకు తెలంగాణ TREIRB రాత పరీక్షలను నిర్వహించింది. రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో  treirb.telangana.gov.in వారి లాగిన్ ఆధారాలతో 2024 తెలంగాణ TGT ఫలితాలను చెక్ చేయవచ్చు.

TS TREIRB ఫలితాలు 2024ని చెక్ చేయడానికి ఒకరు వారి హాల్ టికెట్ నెంబర్‌ను ఉపయోగించాలి. పరీక్షా అధికారం ఫలితాలతో పాటు TS గురుకులం మెరిట్ జాబితా 2024ని కూడా విడుదల చేసింది. తెలంగాణ టీచర్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు మొత్తం 6,52,413 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 4,93,727 మంది హాజరయ్యారు.

తెలంగాణ గురుకులం ఫలితాల 2024 లింక్ (TREIRB Gurukulam Results 2024 link)

తెలంగాణ గురుకులం ఫలితాలు 2024ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువ లింక్‌పై క్లిక్ చేసి డైరక్ట్‌గా  ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ గురుకులం ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ గురుకులం ఫలితాలను 2024 ఎలా చెక్ చేసుకోవాలి? (How to check Telangana TREIRB Gurukulam Results 2024?)

తెలంగాణ గురుకులం ఫలితాలను 2024 చెక్ చేసుకునే విధానాన్ని ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు ఆ స్టెప్స్‌ని ఫాలో అవ్వొచ్చు.
  • స్టెప్ 1: TREIRB అధికారిక పోర్టల్‌ని treirb.telangana.gov.in లో సందర్శించాలి.
  • స్టెప్ 2 : హోంపేజీలో తెలంగాణ గురుకులం ఫలితాల లింక్‌ను గుర్తించాలి.
  • స్టెప్  3: తర్వాత ఆ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా TREIRB ఫలితాల పేజీ ఓపెన్ అవుతుంది.
  • స్టెప్  4: రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  • స్టెప్  6: తర్వాత తెలంగాణ గురుకులం TGT ఫలితాలు 2024 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
  • స్టెప్  7: భవిష్యత్తు సూచన కోసం TGT ఫలితాలను డౌన్‌లోడ్ చేసి  ప్రింట్‌ అవుట్‌ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తాజా అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/treirb-gurukulam-results-2024-49690/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!