TREIRB PGT Result 2024 : తెలంగాణ గురుకులం పీజీటీ ఫలితాలు వచ్చేశాయ్, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

Andaluri Veni

Updated On: February 09, 2024 12:42 pm IST

తెలంగాణ గురుకులం పీజీటీ ఫలితాలు 2024 విడుదలయ్యాయి. సంబంధిత ఫలితాల లింక్‌ను  (TREIRB PGT Result 2024) ఇక్కడ అందజేశాం. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి  డైరక్ట్ ఆ ఫలితాలను చెక్ చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి. 
TREIRB PGT Result 2024 : తెలంగాణ గురుకులం పీజీటీ ఫలితాలు వచ్చేశాయ్, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండిTREIRB PGT Result 2024 : తెలంగాణ గురుకులం పీజీటీ ఫలితాలు వచ్చేశాయ్, ఈ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ గురుకులం పీజీటీ ఫలితాలు 2024 లింక్ (TREIRB PGT Result 2024) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) గురుకుల సొసైటీ పరిధిలోని 2144 పోస్టులకు సంబంధించిన ఫలితాలను (TREIRB PGT Result 2024) 2023-24 ఫిబ్రవరి 08, 2024న అధికారిక వెబ్‌సైట్ www.treirb.telangana.gov.in లో ప్రకటించింది. ఆగస్టు 2023లో జరిగిన TREIRB పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఆప్షన్ల ప్రక్రియ తదుపరి దశకు వారు అర్హత పొందారా లేదా అని చెక్ చేయవచ్చు. ఈ ఆర్టికల్లో అభ్యర్థుల సూచన కోసం TREIRB ఫలితాల PDFని చెక్ చేయడానికి. డౌన్‌లోడ్ చేయడానికి మేము డైరక్ట్ లింక్‌ను ఇక్కడ అందజేశాం.

2144 పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను 1:2 నిష్పత్తిలో ప్రకటించింది.  సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు వీలుగా ఆయా విద్యాలయాల్లో ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌లు కలిపి 868 పోస్టులకు బుధవారం అర్ధరాత్రి ప్రకటించారు. 1,276 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT) పోస్టులకు గురువారం (ఫిబ్రవరి 8) జాబితాలు రిలీజ్ చేయడం జరిగింది.  వీటితోపాటు మిగతా పోస్టులకు కూడా రోజువారీగా, కేటగిరీ వారీగా ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు పూర్తి అయినట్టు తెలుస్తుంది. వారం రోజుల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT) మినహా మిగతా వాటికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అభ్యర్థులు తమ ఫలితాలను ఎప్పటికప్పుడు https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

TREIRB ఫలితాలు 2024 వెబ్‌సైట్ లింక్ (TREIRB Results 2024 Website Download Link)

TREIRB ఫలితాలు 2023 ఫిబ్రవరి 08, 2024న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేయడానికి ఎటువంటి లాగిన్ ఆధారాలు అవసరం లేదు. ఇక్కడ మేము TREIRB ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయడానికి డైరక్ట్ లింక్‌ను అందజేశాం.

తెలంగాణ గురుకులం పీజీటీ ఫలితాలు 2024 లింక్

గురుకులం పోస్టుల ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (Steps to Check TREIRB Results 2023-24)

TREIRB పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ TREIRB అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.  ఈ దిగువ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు,
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) అధికారిక వెబ్‌సైట్‌ను www.treirb.telangana.gov.in సందర్శించాలి.
  • స్టెప్ 2: హోంపేజీలో “UG, ఆర్ట్, క్రాఫ్ట్ & మ్యూజిక్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి” అనే లింక్‌ను గుర్తించి దానిపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: TREIRB గురుకులం ఫలితం 2023-24 ఫలితం PDF డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల రోల్ నెంబర్‌ను జాబితా చేస్తూ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • స్టెప్ 4: ఎంపికైన అభ్యర్థుల జాబితాలోని రోల్ నెంబర్‌ను చెక్ చేయండి.
  • స్టెప్ 5: ఫలితాల PDFలో మీ రోల్ నెంబర్/హాల్ టికెట్ కనిపిస్తే, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌కు అర్హత సాధించారని అర్థం.
  • స్టెప్ 6: భవిష్యత్ రికార్డుల కోసం TREIRB ఫలితాల PDFని డౌన్‌లోడ్ చేయండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/treirb-pgt-results-2024-link-download-49782/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!