తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, (TS DSC 2024 Notification Out) ఇలా అప్లై చేసుకోండి

Andaluri Veni

Updated On: February 29, 2024 12:18 pm IST

TS DSC 2024 నోటిఫికేషన్ (TS DSC 2024 Notification out) విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 11 వేలకుపైగా పోస్టులకు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. 
 
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, (TS DSC 2024 Notification Out) ఇలా అప్లై చేసుకోండితెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది, (TS DSC 2024 Notification Out) ఇలా అప్లై చేసుకోండి

TS DSC నోటిఫికేషన్ 2024  విడుదల (TS DSC 2024 Notification out): తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.  డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.  11 వేలకుపైగా పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను (TS DSC 2024 Notification out) రిలీజ్ చేయడం జరిగింది.   తెలంగాణ ప్రభుత్వం సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. 11062 ఖాళీగా ఉన్న టీచింగ్ పొజిషన్‌ల కోసం అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఆసక్తిగల అభ్యర్థులందరూ తెలంగాణ DSC కోసం 21 అక్టోబర్ 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ DSC నోటిఫికేషన్, పరీక్ష మరియు దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఈ దిగువున ఇవ్వబడ్డాయి.

తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 వివరాలు  (TS DSC Notification 2024 Details)

తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.
రిక్రూట్‌మెంట్ టీఎస్ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024
నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 29, 2024
అప్లికేషన్ ప్రారంభ తేదీ మార్చి 2, 2024
అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏప్రిల్ 2, 2024
పోస్టుల సంఖ్య అప్‌డేట్ చేయబడుతుంది
అధికారిక వెబ్‌సైట్ అప్‌డేట్ చేయబడుతుంది

TS DSC 2024 కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply Online For TS DSC 2024?)

TS DSC 2023-24 కోసం దరఖాస్తు చేయడానికి దిగువున ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి.
  • స్టెప్ 1- డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.inని సందర్శించాలి.
  • స్టెప్ 2- హోమ్‌పేజీలో "నోటిఫికేషన్" లేదా "రిజిస్ట్రేషన్" లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 3- అప్లికేషన్‌ను కొనసాగించే ముందు సూచనలను, మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవాలి.
  • స్టెప్ 4- దరఖాస్తు ఫార్మ్‌లో వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, పని అనుభవంతో సహా అవసరమైన వివరాలను పూరించాలి.
  • స్టెప్ 5- సూచనలలో పేర్కొన్న నిర్దేశిత ఫార్మాట్, సైజ్ ప్రకారం విద్యా ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు రుజువు, పాస్‌పోర్ట్ ఫోటో వంటి అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. .
  • స్టెప్ 6- దరఖాస్తును సమర్పించే ముందు TS DSC TRT నోటిఫికేషన్ 2023-24లో నమోదు చేసిన మొత్తం సమాచారాన్ని, అప్‌లోడ్ చేసిన పత్రాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి.
  • స్టెప్  7- సబ్మిట్ చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను నోట్ చేసుకోవాలి. భవిష్యత్తు సూచన కోసం అప్లికేషన్ నిర్ధారణ పేజీ ప్రింటవుట్ తీసుకోవాలి.
  • స్టెప్ 8- రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు, నోటిఫికేషన్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్‌ని  చెక్ చేస్తూ ఉండాలి.
  • స్టెప్ 9- మీ రికార్డుల కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫార్మ్, చెల్లింపు రసీదు ప్రింటౌట్ తీసుకోవాలి.

డీఎస్సీ 2024 అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అభ్యర్థులు ఏ డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకోవాలి? (Documents to Keep Ready Before filling up DSC 2024 Application form)

  • ఆధార్ సంఖ్య
  • మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసిన కాపీ.
  • మీ సంతకం స్కాన్ చేసిన కాపీ.
  • బర్త్ సర్టిఫికెట్ / S.S.C
  • స్కూల్ స్టడీ సర్టిఫికెట్
  • విద్యా అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు
  • నిరుద్యోగుల డిక్లరేషన్ (పరీక్ష ఫీజు మినహాయింపు క్లెయిమ్ చేయడానికి)
  • యజమాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎక్కడైనా ఉద్యోగం చేస్తే)
  • స్థానిక షెడ్యూల్డ్ ఏరియా సర్టిఫికెట్ (ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిన అభ్యర్థులు).
  • కుల ధ్రువీకరణ పత్రం అంటే, నమోదు సంఖ్య, జారీ చేసిన తేదీ.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-dsc-2024-notification-released-50387/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!