రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (Telangana DSC Notification 2024)

Andaluri Veni

Updated On: February 28, 2024 12:03 pm IST

రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్  (Telangana DSC Notification 2024) రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం 11,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.  పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
 
రెండు రోజుల్లో  తెలంగాణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్  (Telangana DSC Notification 2024)రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ (Telangana DSC Notification 2024)

తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 (Telangana DSC Notification 2024) : తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 (Telangana DSC Notification 2024) ఈ రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.  డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ వారి అధికారిక వెబ్‌సైట్ www.tsdsc.cgg.gov.inలో TS DSC నోటిఫికేషన్ PDFని విడుదల చేయడం జరుగుతుంది. TS పాఠశాల విద్యా శాఖ ఈ నోటిఫికేషన్ ద్వారా 11,060 సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లాంగ్వేజ్ పండిట్ ఖాళీలను భర్తీ చేస్తారు.  అతి త్వరలో విడుదల కాబోయే  TS DSC 2024 నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు ఈ దిగువున అందజేశాం. అభ్యర్థులు తెలుసుకోవచ్చు.

తెలంగాణ డీఎస్సీ ఖాళీల వివరాలు 2024 (TS DSC Vacancies Details 2024)

తెలంగాణలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 11,060 సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లాంగ్వేజ్ పండిట్ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ TS DSC పరీక్ష 2024ని నిర్వహిస్తోంది. పోస్టుల వారీగా, జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి.

పోస్టు పేరు ఖాళీల సంఖ్య
స్కూల్ అసిస్టెంట్ 2,600
సెకండరీ గ్రేడ్ టీచర్ 6,500 కంటే ఎక్కువ
లాంగ్వేజ్ పండిట్ 700
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 190
మొత్తం 11,060

TS DSC 2024 అర్హత ప్రమాణాలు (TS DSC 2024 Eligibility Criteria)

TS DSC రిక్రూట్‌మెంట్ 2024 కోసం అభ్యర్థలకు ఉండాల్సిన అర్హత ప్రమాణాల గురించి ఈ దిగువున అందజేశాం.  కచ్చితంగా అభ్యర్థులు ఆ అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నారో? లేదో? చూడవచ్చు.
  • అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి.
  • అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.
  • స్థానిక / స్థానికేతర స్థితికి అనుగుణంగా ఉండాలి.
  • స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టుల కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి B.Edతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • లాంగ్వేజ్ పండిట్ పోస్టుల కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుంచి B.Edతో డిగ్రీ (తెలుగు / హిందీ / ఉర్దూ / కన్నడ / ఒరియా / తమిళం / సంస్కృతం) పూర్తి చేయాలి.
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. NCTEతో గుర్తించబడిన ఫిజికల్ ఎడ్యుకేషన్ (U.G.D.P.Ed.)లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉండాలి. లేదా NCTEతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, B.P.Ed లేదా M.P.Ed చేసి ఉండాలి.
  • సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) అభ్యర్థులు తప్పనిసరిగా రెండు సంవత్సరాల D.Ed కోర్సుతో వారి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా NCTEతో గుర్తించబడిన దానికి సమానమైన సర్టిఫికెట్‌ను పొంది ఉండాలి.
  • అభ్యర్థి  వయస్సు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అంటే కనీస వయోపరిమితి 18 సంవత్సరాల కంటే తక్కువ కాదు. గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు. అలాగే దరఖాస్తుదారు 01 జూలై 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. 02 జూలై 1979కి ముందు జన్మించి ఉండకూడదు.
టీఎస్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ PDFని అందజేస్తాం. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-dsc-notification-2024-releasing-soon-50347/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!