TS EAMCET Second Phase Seat Allotment Date 2023:TS EAMCET రెండొ దశ సీట్ల కేటాయింపు ఫలితాలు ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా?

Andaluri Veni

Updated On: July 28, 2023 11:34 am IST

TSCHE ప్రకటించిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు TS EAMCET రెండో దశ సీట్ల కేటాయింపు 2023ని (TS EAMCET Second Phase Seat Allotment Date 2023)   జూలై 31, 2023న యాక్సెస్ చేయగలరు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు అడ్మిషన్ పూర్తి చేయడానికి ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాలి. 
TS EAMCET Second Phase Seat Allotment Date 2023TS EAMCET Second Phase Seat Allotment Date 2023

TS EAMCET రెండో దశ సీట్ల కేటాయింపు తేదీ 2023  (TS EAMCET Second Phase Seat Allotment Date 2023) : TS EAMCET 2023 రెండో దశ కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్ ప్రక్రియ క్లోజ్ అయింది. అభ్యర్థులు పూరించిన ఆప్షన్ల ఆధారంగా TS EAMCET రెండవ దశ సీట్ల కేటాయింపు 2023 (TS EAMCET Second Phase Seat Allotment Date 2023) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా జూలై 31, 2023న విడుదల చేయబడుతుంది. సీట్ల కేటాయిపుంతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆగస్టు 2, 2023లోపు ఆన్‌లైన్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపుతో కొనసాగాలి. మొదటి సీట్ల కేటాయింపు ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విజయవంతంగా నిర్వహించింది. రెండో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఖాళీగా ఉన్న సీట్ల కోసం మాత్రమే నిర్వహించారు. రెండో సీటు అలాట్‌మెంట్ ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల కోసం చివరి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4, 2023న ప్రారంభమవుతుంది.

రెండో దశ సీటు అలాట్‌మెంట్ ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్న సీట్ల కోసం చివరి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4, 2023న ప్రారంభమవుతుంది. ఇంకా అభ్యర్థులు సాధారణంగా సీట్ల కేటాయింపు కోసం అభ్యర్థుల మొదటి ప్రాధాన్యతలను TSCHE పరిగణిస్తుందని, అయితే అది సాధ్యం కాకపోతే వారికి వారి రెండో  లేదా మూడో ప్రాధాన్యత కేటాయించబడుతుందని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి అభ్యర్థులు తమ ఆప్షన్లను జాగ్రత్తగా పూరించడం. వాటిని సబ్మిట్ చేసే ముందు వాటిని సేవ్ చేయడం చాలా అవసరం. అభ్యర్థుల ఆప్షన్లు సీట్ల కేటాయింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అభ్యర్థులు వాటిని తీవ్రంగా పరిగణించాలి.

TS EAMCET Second Phase 2023 తేదీలు (TS EAMCET Second Phase 2023 Dates)

TS EAMCET రెండో దశ 2023 కౌన్సెలింగ్ కోసం ముఖ్యమైన తేదీలని గమనించండి..
ఈవెంట్స్ తేదీలు
ఆప్షన్ ఫిల్లింగ్, ఆప్షన్స్ ఫ్రీజింగ్ కోసం చివరి తేదీ జూలై 27, 2023
TS EAMCET రెండో దశ సీట్ల కేటాయింపు తేదీ 2023 జూలై 31, 2023
ఆన్‌లైన్ రిపోర్టింగ్, ట్యూషన్ ఫీజు చెల్లింపు జూలై 31 నుంచి ఆగస్టు 2, 2023 వరకు

సీటు అంగీకారం కోసం రిపోర్ట్ చేస్తున్నప్పుడు, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని గమనించాలి. కోర్సు, ఇన్‌స్టిట్యూట్ ట్యూషన్ ఫీజు ప్రకారం, అభ్యర్థులు చెల్లింపు గేట్‌వే లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే, అభ్యర్థికి వ్యతిరేకంగా సీటు బుక్ చేయబడుతుంది.

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID ద్వారా news@collegedekho.com. కూడా మాకు రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-eamcet-second-phase-seat-allotment-date-2023-43491/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!