అభ్యర్థులకు అలర్ట్, ఆరోజే TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్ష (TS Group 1 Prelims Exam Date 2024)

Andaluri Veni

Updated On: February 27, 2024 04:12 pm IST

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష (TS Group 1 Prelims Exam Date 2024) ఎప్పుడు జరుగుతుందో తెలుసా? TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్ష తేదీని వెల్లడించింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
అభ్యర్థులకు అలర్ట్, ఆరోజే TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్ష (TS Group 1 Prelims Exam Date 2024)అభ్యర్థులకు అలర్ట్, ఆరోజే TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్ష (TS Group 1 Prelims Exam Date 2024)

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ 2024 (TS Group 1 Prelims Exam Date 2024): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పరీక్ష తేదీని (TS Group 1 Prelims Exam Date 2024) ప్రకటించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో అధికారిక ప్రకటనను చూడవచ్చు.  అధికారిక నోటీసు ప్రకారం, గ్రూప్-I సర్వీసెస్ జనరల్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ టెస్ట్ జూన్ 9, 2024న నిర్వహించబడుతుంది. దరఖాస్తుదారులు ప్రిలిమినరీ టెస్ట్ కోసం పూర్వ జిల్లాల నుంచి జిల్లా కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలి. ఒకసారి ఎంపిక చేసిన జిల్లా కేంద్రాలే ఫైనల్ అవుతుంది.

ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్)లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హులవుతారు.  ప్రిలిమినరీ పరీక్ష ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహించబడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభించబడింది. మార్చి 14, 2024న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గ్రూప్-I సర్వీసెస్ జనరల్ రిక్రూట్‌మెంట్ కింద వివిధ విభాగాల్లోని 563 ఖాళీలను భర్తీ చేస్తుంది.


TSPSC గ్రూప్ 1 ముఖ్యమైన తేదీలు 2024  (TSPSC Group 1 Important Dates 2024)

TSPSC గ్రూప్ 1 ముఖ్యమైన తేదీలు 2024 ఈ దిగువున టేబుల్లో అందజేశాం.

ఈవెంట్ తేదీలు
TSPSC గ్రూప్ 1 2024 నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 19, 2024
TSPSC గ్రూప్ 1 2024  దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి 29, 2024
TSPSC గ్రూప్ 1 2024  దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ మార్చి 14, 2024
అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్లు మార్చి 23 నుంచి మార్చి 27, 2024
TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ 2024 జూన్ 09, 2024
TSPSC గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ డేట్ 2024 సెప్టెంబర్, అక్టోబర్ 2024

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024: ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (TSPSC Group 1 Prelims 2024: How to apply)

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను tspsc.gov.in సందర్శించాలి.
  • హోంపేజీలో "కొత్త రిజిస్ట్రేషన్ OTR’పై క్లిక్ చేసి, అభ్యర్థి నమోదును పూర్తి చేయాలి.
  • నమోదు చేసిన తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది ఆ దరఖాస్తులో అభ్యర్థులు తమ వివరాలను పూరించాలి.
  • అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • అనంతరం దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
  • ఫార్మ్‌ను సబ్మిట్ చేసి భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ తీసుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-group-1-prelims-exam-date-2024-details-in-telugu-50209/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!