Telangana Inter Results 2023 Date: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్‌డేట్, రిజల్ట్స్ విడుదలయ్యేది ఎప్పుడంటే?

Andaluri Veni

Updated On: May 04, 2023 10:41 am IST

తెలంగాణ ఇంటర్ 2023 ఫలితాల (Telangana Inter Results 2023 Date) కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మే 10, 2023లోపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ ఫలితాలపై మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడ చూడండి. 
Telangana Inter Results 2023 Date: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్‌డేట్, రిజల్ట్స్ విడుదలయ్యేది ఎప్పుడంటే?Telangana Inter Results 2023 Date: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై కీలక అప్‌డేట్, రిజల్ట్స్ విడుదలయ్యేది ఎప్పుడంటే?

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 డేట్ (Telangana Inter Results 2023 Date): తెలంగాణ ఇంటర్మీడియట్ 2023 పరీక్షా (Telangana Inter Results 2023 Date) ఫలితాలపై  ఉత్కంఠ నెలకొంది. పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ఇంటర్ ఫలితాలు త్వరలో విడుదల అవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఇంటర్ రిజల్ట్ 2023ని మే 10, 2023లోపు విడుదల చేసే అవకాశం ఉంది. రిజల్ట్స్ విడుదలైన తర్వాత  తెలంగాణ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను TSBIE అధికారిక సైట్ tsbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. TS ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు,  ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకే షిప్టులో పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షా ఫలితాలకు సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ విడుదల కాలేదు.

టీఎస్ ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 విడుదల తేదీ, సమయం  (TS Inter Results 2023 Date and Time)

TS ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2023 తేదీని బోర్డు అధికారులు ఇంకా ప్రకటించ లేదు. పరీక్షలు ఏప్రిల్ 4, 2023న ముగిసినందున మే 10, 2023లోపు బోర్డు ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ని ఇక్కడ అందజేయడం జరుగుతుంది.


టీఎస్ ఇంటర్మీడియట్ పరీక్షలు 2023 చెక్ చేసుకునేదెలా? (How to check TS Inter Results?)

ఇంటర్మీడియట్ ఫలితాలు 2023 విడుదలైన తర్వాత అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి.  రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
  • ముందుగా అభ్యర్థులు tsbie.cgg.gov.in, results.cgg.gov.in లేదా examresults.ts.nic.inకి వెళ్లాలి.
  • IPE మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం ఫలితాల లింక్‌‌ని గుర్తించాలి
  • అనంతరం ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో  మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి
  • తర్వాత మీ ఇంటర్ ఫలితాలు కనిపిస్తాయి.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌ను దగ్గరే ఉంచుకోవాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/admin/news-dashboard/ ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-inter-results-2023-to-be-released-this-week-39929/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!