Telangana Inter supplementary Results 2023: ఈరోజే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్

Andaluri Veni

Updated On: July 05, 2023 01:15 pm IST

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 (Telangana Inter supplementary Results 2023) ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో
  •  
Telangana Inter supplementary Results 2023: ఈరోజే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్Telangana Inter supplementary Results 2023: ఈరోజే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 (Telangana Inter Supplementary Results 2023): తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు (Telangana Inter supplementary Results 2023) ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఉదయం షిఫ్ట్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వ‌హించారు.ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్‌కి 2,70,583 మంది, రెండో సంవత్సరం  1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అధికారిక వెబ్‌సైట్ www.tsbie.cgg.gov.in లో ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. విద్యార్థులు తమ TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలో ఈ ఆర్టికల్ తెలుసుకోండి.

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (How to check TS Inter Supply Results 2023?)

తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టీఎస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి. ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. లేదా  అధికారిక వెబ్‌సైట్ www.tsbie.cgg.gov.in‌కి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌కి www.tsbie.cgg.gov.inకి వెళ్లాలి.
  • హోంపేజీలో "ఫలితాలు" క్లిక్ చేయాలి. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ పేజీలో విద్యార్థులు “TS ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు 2023” కోసం లింక్‌పై క్లిక్ చేయాలి. రెండో సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా “TS ఇంటర్ రెండో సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు 2023”పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో  ఫలితాల సంవత్సరం, హాల్ టికెట్ నెంబర్ వంటి సంబంధిత వివరాలు ఇవ్వాలి. సంవత్సరం, కేటగిరి, పరీక్ష రకాన్ని ఎంచుకోవాలి.
  • అనంతరం 'Get Memo' బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఉండే వివరాలు (Details mentioned on Telangana Inter 1st and 2nd Year Results 2023)

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 ఆన్‌లైన్ మార్క్ షీట్ తాత్కాలికమైనది. సంబంధిత పాఠశాలలు అందించే ఒరిజినల్ మార్క్‌షీట్‌లను అందిస్తాయి. అందులో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • విద్యార్థి పేరు
  • హాల్ టికెట్ నెంబర్
  • విద్యార్థి జిల్లా
  • వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థి సాధించిన మార్కులు
  • ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌లో సాధించిన మార్కులు
  • మొత్తం మార్కులు
  • సబ్జెక్టులో క్వాలిఫైయింగ్ స్టేటస్
  • ఓవరాల్ క్వాలిఫైయింగ్ స్టేటస్
  • పొందిన గ్రేడ్ లేదా పాయింట్లు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-inter-supplementary-results-2023-released-likely-today-42635/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!