TS Multipurpose Health Assistant Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణలో 1520 ఉద్యోగాలు, అర్హతలు ఇవే

Andaluri Veni

Updated On: July 27, 2023 01:14 pm IST

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు  గుడ్ న్యూస్. ప్రభుత్వం నుంచి 1500లకు పైగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి (TS Multipurpose Health Assistant Jobs 2023) నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
TS Multipurpose Health Assistant Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణలో 1520 ఉద్యోగాలు, అర్హతలు ఇవేTS Multipurpose Health Assistant Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణలో 1520 ఉద్యోగాలు, అర్హతలు ఇవే

టీఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ జాబ్స్ 2023 (TS Multipurpose Health Assistant Jobs 2023): తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. 1500లకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది.  ఇందులో భాగంగా  ప్రభుత్వం బుధవారం 1,520 మల్టీ పర్సస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) ఉద్యోగాల భర్తీకి  (TS Multipurpose Health Assistant Jobs 2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయి జాయిన్ అయిన వారికి నెలకు రూ. 31,040 నుంచి రూ. 92,050 వరకు జీతం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను  MPHA (మహిళలు) అభ్యర్థులు 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయబడతారు. అందులో 80 పాయింట్లు రాత పరీక్ష, మిగిలిన 20 పాయింట్లు కాంట్రాక్ట్, అవుట్  సోర్సింగ్ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు/సంస్థలు/ ప్రోగ్రామ్‌లలో సేవలకు అందించబడతాయి. కాగా ఈ ఉద్యోగాలకు  ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 25 ఉదయం 10.30 నుంచి ప్రారంభించబడతాయి. (https://mhsrb.telangana.gov.in) దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19.

TS మల్టీ పర్సస్ హెల్త్  అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్

టీఎస్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ వివరాలు (TS multi purpose health assistant Recruitment Details)

టీఎస్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది.

రీక్రూట్‌మెంట్ పేరు టీఎస్ ఎంపీహెచ్‌ఏ రిక్రూట్‌మెంట్ 2023
టైటిల్ TS MPHA నోటిఫికేషన్ 2023
సబ్జెక్ట్ TS MPHA రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023
కేటగిరి రిక్రూట్‌మెంట్
వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in/
రిజిస్ట్రేషన్ 25-08-2023 to 19-09-2023

జోన్‌ల వారీగా పోస్టులు ( Zone wise posts)

జోన్‌ల వారీగా పోస్టుల వివరాలు ఈ దిగువున పట్టికలో అందజేశాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పరిశీలించవచ్చు.
జోన్ 1 కాళేశ్వరం 169
జోన్ 2 బాసర 225
జోన్ 3 రాజన్న 263
జోన్ 4 భద్రాద్రి 237
జోన్ 5 యాదాద్రి 241
జోన్ 6 చార్మినార్ 189
జోన్ 7 జోగులాంబ 196

టీఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2023 అర్హత వివరాలు (TS Multipurpose Health Assistant Jobs 2023)

  • టీఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
  • ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో పాసై ఉండాలి. అభ్యర్థులు మల్టీ పర్సస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి.
  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి ప్రకారం అభ్యర్థుల వయస్సులో మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి  రూ.500లు ఫీజు చెల్లించాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 19, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి  https://mhsrb.telangana.gov.in వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-multi-purpose-health-assistant-recruitment-2023-43451/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!