TS PGECET 2023 Application Date: టీఎస్ పీజీఈసెట్ 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?

Andaluri Veni

Updated On: May 01, 2023 12:19 pm IST

TS PGECET 2023కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీఎస్ పీజీఈసెట్‌కు 2023 (TS PGECET 2023 Application Date) దరఖాస్తు చేసుకునేందుకు మే 5వ తేదీ వరకు గడువును పొడిగించడం జరిగింది. 
TS PGECET 2023 Application Date: టీఎస్ పీజీఈసెట్ 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?TS PGECET 2023 Application Date: టీఎస్ పీజీఈసెట్ 2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే?

టీఎస్ పీజీఈసెట్ 2023 అప్లికేషన్ డేట్ (TS PGECET 2023 Application Date): తెలంగాణలో పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS PGECET 2023)కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీఎస్ పీజీఈసెట్‌ 2023కు దరఖాస్తు గడువు (TS PGECET 2023 Application Date) మే 5 వరకు పొడిగించారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 30తో ముగియడంతో జేఎన్‌టీయూ-హైదరాబాద్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించింది. దీంతో అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా ఆన్‌లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ pgecet.tsche.ac.in కు వెళ్లి మే 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మళ్లీ పొడిగించే అవకాశం ఉండదు. అందుకే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది.

TS PGECET 2023ని 2023-24 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించడం  జరుగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జెఎన్‌టీయూ, హైదరాబాద్  పీజీ ఈసెట్ 2023కు  ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తొలుత మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు ఆహ్వానించింది. తాజాగా ఈ గడువును మళ్లీ పెంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం TS PGECET 2023 పరీక్ష మే 29 నుంచి జూన్ 1 వరకు జరగనుంది. ఈ పరీక్ష సీబీటీ విధానంలో జరుగుతుంది.

టీఎస్ పీజీఈసెట్ 2023 దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు (TS PGECET 2023 Application Dates)

టీఎస్ పీజీఈసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది.
ఈవెంట్ ముఖ్యమైన తేదీలు
TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ డేట్ మార్చి 03, 2023
TS PGECET 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 05, 2023
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు లాస్ట్‌డేట్ మే 24, 2023
TS PGECET 2023 ప్రవేశ పరీక్ష తేదీలు మే 29, 30, జూన్ 01, 2023

TS PGECET 2023 పరీక్ష విధానం (TS PGECET 2023 Exam Pattern)

TS PGECET 2023 పరీక్ష పూర్తిగా కంప్యూటర్ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఎటువంటి నెగెటింగ్ మార్కింగ్ ఉండదు. అభ్యర్థులు అన్ని ప్రశ్నలు ప్రయత్నించవచ్చు. పరీక్ష మొత్తం 2 గంటల వ్యవధిలో జరుగుతుంది. కాగా TS PGECET 2023కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు జనరల్ అభ్యర్థులైతే రూ.1100లు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే రూ.600లు చెల్లించాల్సి ఉంటుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-pgecet-2023-application-date-extended-till-may-5-39803/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!