TS POLYCET Final Phase Seat Allotment: TS POLYCET 2023 చివరి దశ సీట్ల కేటాయింపు వాయిదా, కొత్త తేదీని ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: July 07, 2023 09:33 am IST

2023లో తేదీ విడుదలయ్యే TS పాలిసెట్ చివరి దశ సీట్ల కేటాయింపు (TS POLYCET Final Phase Seat Allotment) వాయిదా పడింది. కొత్త షెడ్యూల్ ప్రకారం అధికార యంత్రాంగం రేపటి నుంచి టీఎస్ పాలిసెట్ చివరి దశ నమోదు ప్రక్రియతో ఫైనల్ దశ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది.
TS POLYCET Final Phase Seat Allotment 2023 PostponedTS POLYCET Final Phase Seat Allotment 2023 Postponed

టీఎస్ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ (TS POLYCET Final Phase Seat Allotment): డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్  TS POLYCET 2023 ఫైనల్ దశ సీట్ల కేటాయింపు ఫలితాలను ఈరోజు విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే అధికార యంత్రాంగం మళ్లీ రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనుంది. అప్‌డేట్ చేసిన షెడ్యూల్ ప్రకారం చివరి దశ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ  జూలై 8, 2023న ప్రారంభించబడుతుంది.

ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే TS పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్ కోసం అధికారులు 11 కొత్త కాలేజీలు, 1170 కొత్త సీట్లను జోడించారు. మరోవైపు జూలై 7న తెలంగాన పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. కాబట్టి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తాజాగా TS పాలిసెట్ చివరి దశ 2023కి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత ప్రత్యేకంగా ఇంతకు ముందు TS POLYCET కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని tspolycetd.nic.in సందర్శించడం ద్వారా ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. TS POLYCET చివరి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చివరి తేదీ జూలై 9, 2023.

TS POLYCET చివరి దశ సీట్ల కేటాయింపు 2023: ముఖ్యమైన తేదీలు (TS POLYCET Final Phase Seat Allotment 2023: Important Dates)

TS POLYCET 2023 చివరి దశ సీట్ల కేటాయింపు 2023 రివైజ్డ్ తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.

ఈవెంట్స్

తేదీలు

TS పాలీసెట్ చివరి దశ నమోదు

జూలై 8 నుంచి 9, 2023

ఇప్పటికే బుక్ చేసిన స్లాట్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్

జూలై 10, 2023

వెబ్‌ ఆప్షన్స్ ఎక్సర్‌సైజ్

జూలై 8 నుంచి 11, 2023 వరకు

ఆప్షన్స్ ఫ్రీజ్ చేయడం

జూలై 11, 2023

ప్రొవిజనల్ సీటు కేటాయింపు

జూలై 14, 2023

వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, స్వీయ-నివేదన

జూలై 14 నుంచి 16, 2023 వరకు

కాలేజీల్లో రిపోర్టింగ్

జూలై 14 నుంచి 17, 2023 వరకు

వివరాల్లో చేరిన అభ్యర్థులను అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ

జూలై 18, 2023

అకడమిక్ సెషన్ ప్రారంభం

జూలై 21, 2023

TS పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్ తర్వాత అధికార యంత్రాంగం జూలై 14, 2023 నుంచి సంస్థలలో స్పాట్ అడ్మిషన్‌లను ప్రారంభిస్తుంది.

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-polycet-final-phase-seat-allotment-2023-postponed-check-new-date-42894/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!