TS Set Application Correction Last Date: తెలంగాణ సెట్ అప్లికేషన్‌లో తప్పులు దిద్దుబాటుకు రేపే లాస్ట్‌ డేట్

Andaluri Veni

Updated On: September 26, 2023 12:38 pm IST

తెలంగాణ సెట్ అప్లికేషన్‌ పూరించేటప్పుడు (TS Set Application Correction Last Date) ఏమైనా పొరపాట్లు జరిగాయా? అయితే వాటిని సరి చేసేందుకు కరెక్షన్ విండో సెప్టెంబర్ 26 ఓపెన్ అయింది. 
 
TS Set Application Correction Last Date: తెలంగాణ సెట్ అప్లికేషన్‌లో తప్పులు దిద్దుబాటుకు రేపే లాస్ట్‌ డేట్TS Set Application Correction Last Date: తెలంగాణ సెట్ అప్లికేషన్‌లో తప్పులు దిద్దుబాటుకు రేపే లాస్ట్‌ డేట్

తెలంగాణ సెట్ అప్లికేషన్ కరెక్షన్ చివరి తేదీ 2023 (TS Set Application Correction Last Date): TS SET 2023 దరఖాస్తు దిద్దుబాటు ప్రక్రియ (TS Set Application Correction Last Date) ఈరోజు నుంచి అంటే 26 సెప్టెంబర్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం డిగ్రీ కళాశాలలు/విశ్వవిద్యాలయాల్లో లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయడానికి తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TS SET)ని నిర్వహిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే  దరఖాస్తులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు రెండు రోజుల పాటు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. TS SET 2023 కరెక్షన్ విండో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 27 రెండు రోజులపాటు ఓపెన్ అయి ఉంటుంది. TS SET 2023కు సంబంధించి పూర్తి వివరాలు దిగువున అందజేయడం జరిగింది.

టీఎస్ సెట్ ముఖ్యమైన వివరాలు 2023 (TS SET Important Information 2023)

TS SET 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందజేయడం జరిగిది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

పరీక్ష పేరు TS  SET
ఫుల్ ఫార్మ్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఎగ్జామ్ టైప్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఎగ్జామ్ లెవల్ రాష్ట్ర స్థాయి
కండక్టింగ్ బాడీ ఉస్మానియా యూనివర్సిటీ
అప్లికేషన్ మోడ్ ఆన్‌లైన్ మోడ్
ఎగ్జామ్ మోడ్ ఆఫ్‌లైన్ మోడ్
ఎగ్జామ్ డ్యురేషన్ మూడు గంటలు
అధికారిక వెబ్‌సైట్ www.telanganaset.org

టీఎస్ సెట్ అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యమైన తేదీలు (TS SET Application Form 2023 Inportant Dates)

ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న ముఖ్యమైన తేదీలను తప్పక చెక్ చేయాలి.

ఈవెంట్స్ తేదీలు
TS SET 2023 నోటిఫికేషన్ రిలీజ్ జూలై 30, 2023
TS SET అప్లికేషన్ ఫార్మ్ ప్రారంభం తేదీ ఆగస్ట్ 05, 2023
TS SET ఆలస్య ఫీజు లేకుండా టీఎస్ సెట్ అప్లికేషన్ సబ్మిషన్ సెప్టెంబర్ 4, 2023
రూ.1500 లేట్ ఫీజుతో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్‌డేట్ సెప్టెంబర్ 10, 2023
రూ.2000 లేట్ ఫీజుతో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18, 2023
రూ.3000 లేట్ ఫీజుతో అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్‌డేట్ సెప్టెంబర్ 24, 2023
TS SET అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్  తేదీలు సెప్టెంబర్ 26, 27, 2023
TS SET హాల్ టికెట్ విడుదల తేదీ అక్టోబర్ 20, 2023
TS SET ఎగ్జామ్ డేట్ అక్టోబర్ 28, 29, 30, 2023

తెలంగాణ సెట్‌ రీక్షలు అక్టోబర్ 28 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఈ లోపే అభ్యర్థులు తమ అప్లికేషన్ దిద్దుబాటు ప్రక్రియను పూర్తి చేసి విజయవంతంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 27, 2023 తర్వాత మళ్లీ ఆ అవకాశం ఉండదు.

తెలుగులో ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్‌ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-set-application-correction-last-date-2023-45510/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!