TS SSC Results 2023 LIVE: పదో తరగతి రిజల్ట్స్ లింక్, టాపర్స్ లిస్ట్ ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: May 10, 2023 01:04 pm IST

TS పదో తరగతి ఫలితాలు 2023 లింక్ (TS SSC Results 2023 Link) ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు యాక్టివేట్ అయింది. తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఉత్తీర్ణత శాతానికి సంబంధించి వివరాలతో పాటు ఫలితాలను విడుదల చేశారు. TS SSC ఫలితాల లింక్ 2023 ఇక్కడ చూడండి. 


 
TS SSC 10th Results 2023 LIVETS SSC 10th Results 2023 LIVE

TS పదో తరగతి ఫలితాలు 2023 లింక్ (TS SSC 10th Results 2023 Link) : బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2023 TS SSC ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ద్వారా విడుదల చేసింది.  ఫలితాల సీడీని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులు తమ TS SSC హాల్ టికెట్ నెంబర్‌ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో  అధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా నిర్మల్ జిల్లా నిలిచింది. రెండో స్థానంలో సిద్ధిపేట నిలిచింది. అత్యల్ప ఉత్తీర్ణత శాతం సంగారెడ్డి జిల్లాలో నమోదైంది. ఈ సంవత్సరం మొత్తం 86.60% ఉత్తీర్ణత నమోదైంది, ఇక్కడ 4,24,370 మంది విద్యార్థులు హాజరుకాగా 4,19,460 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

అదేవిధంగా తెలంగాణ పదో తరగతి 2023 ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. బాలురు రెండో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలదే పై చేయి.2,05,930 మంది అబ్బాయిలు ఉత్తీర్ణులైతే,  2,13,530 మంది అమ్మాయిలు  పాస్ అయ్యారు.  88.53% బాలికలు ఉత్తీర్ణత శాతం మరియు 84.68% బాలురు ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2023ని కాలేజ్ దేఖో, ఈనాడు ప్రతిభ, సాక్షి ఎడ్యుకేషన్, మనబడి ద్వారా చెక్ చేసుకోవచ్చు. సర్వర్ సమస్యలను నివారించడానికి TS SSC ఫలితాల లింక్ బహుళ ప్లాట్‌ఫార్మ్‌లలో  హోస్ట్ చేయబడింది. ఫలితాలతో పాటు, TS SSC 10వ తరగతి ఉత్తీర్ణత శాతం 2023కి సంబంధించిన డీటెయిల్స్, టాప్-పెర్ఫార్మింగ్ జిల్లాలు, జెండర్ వారీగా ఉత్తీర్ణత శాతం, సప్లిమెటరీ పరీక్ష తేదీలు ఇక్కడ అందించడం జరిగింది.  TS SSC ఫలితాలు 2023కి సంబంధించిన అన్ని లేటెస్ట్ సంఘటనలు గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు ఈ దిగువ లైవ్ బ్లాగ్‌‌లో చెక్ చేస్తూనే ఉండవచ్చు.

విద్యార్థులు ఈ దిగువన ఉన్న లింక్‌పై క్లిక్ చేసి ఈ లింక్ ద్వారా తమ ఫలితాలను చేసుకోవచ్చు.

పదో తరగతి ఫలితాల డైరక్ట్ లింక్

2023 Live Updates

  • 12 45 PM IST - 10 May'23

    TS SSC టాపర్స్ జాబితా 2023 విడుదల కాలేదు!

    ఈ ఏడాది అధికారులు TS SSC టాపర్స్ జాబితా 2023ని అధికారికంగా ప్రకటించలేదు.

  • 12 27 PM IST - 10 May'23

    TS SSC ఫలితాలత 2023ని లింక్‌ని యాక్టివేట్ చేసిన Eenadu Pratibha

    TS SSC ఫలితం 2023ని విడుదల చేసిన మొదటి వెబ్‌సైట్ Eenadu Pratibha- TS SSC Result Link 2023 Eenadu ద్వారా యాక్టివేట్ అయింది.

  • 12 25 PM IST - 10 May'23

    TS SSC Result 2023: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఛాన్స్

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు వారి సంబంధిత పాఠశాల నుంచి ఈరోజు సాయంత్రం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

  • 12 22 PM IST - 10 May'23

    TS SSC 2023 Results: ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్

    అభ్యర్థులు తమ పదో తరగతి ఫలితాలను ఈ అధికారిక వెబ్‌సైట్‌లో  wwww.results.bse.telanagana.gov.in‌, www.results.bse.telangana.gov.in  చెక్ చేసుకోవచ్చు. 

  • 12 19 PM IST - 10 May'23

    TS SSC Results 2023 హైలెట్స్

    TS SSC ఫలితాలు 2023 కోసం విద్యార్థులు అత్యుత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలు, వారి ఉత్తీర్ణత శాతాలను ఇక్కడ చూడొచ్చు.

    • నిర్మల్ - 99% ఉత్తీర్ణత
    • సిద్దిపేట - 98.65% ఉత్తీర్ణత
    • సంగారెడ్డి - 97.98%

  • 12 17 PM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023 ముఖ్యాంశాలు

    రికార్డుల ప్రకారం, పరీక్షల్లో పాల్గొన్న అన్ని పాఠశాలల్లో 2,793 పాఠశాలలు 100% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి. అలాగే 3 ఎయిడెడ్ పాఠశాలలు 0% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయగా 13 ప్రైవేట్ పాఠశాలలు 0% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి.

  • 12 16 PM IST - 10 May'23

    TS పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2023

    పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన అభ్యర్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 14, 2023న ప్రారంభమవుతాయి. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • 12 14 PM IST - 10 May'23

    TS SSC Results 2023: అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా

    ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో  అధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా నిర్మల్ నిలిచింది. అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైన జిల్లా సంగారెడ్డి.

  • 12 12 PM IST - 10 May'23

    TS SSC Results 2023: అమ్మాయిలదే పైచేయి

    ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలదే పై చేయి.2,05,930 మంది అబ్బాయిలు ఉత్తీర్ణులైతే,  2,13,530 మంది అమ్మాయిలు  పాస్ అయ్యారు.
     

  • 12 11 PM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023 ముఖ్యాంశాలు: అప్డేట్ 3

    TS SSC ఫలితం 2023లో లింగం వారీగా ఉత్తీర్ణత శాతం ఇక్కడ అందుబాటులో ఉంది-

    • బాలికలు - 2,13,530 మంది ఉత్తీర్ణులయ్యారు
    • 88.53% ఉత్తీర్ణత సాధించిన బాలికలు
    • బాలురు - 2,05,930 మంది ఉత్తీర్ణులయ్యారు
    • 84.68% బాలురు ఉత్తీర్ణులయ్యారు

  • 12 10 PM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023 ముఖ్యాంశాలు: అప్డేట్ 2

    2023 TS SSC రిజల్ట్ హైలైట్‌లలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:

    • 4,19,460 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు
    • 86.60% ఉత్తీర్ణత సాధించారు
    • 6,163 మంది విద్యార్థులు 10/10 GPA సాధించారు
    • 9 నుండి 9.8 GPA - 91,000 మంది విద్యార్థులు

  • 12 10 PM IST - 10 May'23

    TS SSC Results 2023: పాసైన అభ్యర్థుల సంఖ్య

    ఈ ఏడాది తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో 4,19,460 మంది అభ్యర్థులు పాసయ్యారు. మొత్తం 86.60% మంది ఉత్తీర్ణులయ్యారు. 

  • 12 08 PM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023ని చెక్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్

    TS SSC ఫలితాలు 2023ని చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇప్పుడు యాక్టివేట్ చేయబడింది.

  • 12 06 PM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023 ముఖ్యాంశాలు

    ప్రెస్ మీట్‌లో అధికారులు ప్రకటించిన TS SSC ఫలితాల ముఖ్యాంశాలు 2023 ఇక్కడ చూడండి.

    • ఈ పరీక్షలకు మొత్తం  4,24,370 మంది విద్యార్థులు హాజరయ్యారు. 
    • 2,621 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించడం జరిగింది. 
    • 30,000 మంది ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు
    • 35,000 మంది ఉపాధ్యాయులు వాల్యుయేషన్‌లో పాల్గొన్నారు

  • 12 01 PM IST - 10 May'23

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

    తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

  • 12 00 PM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023 ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభం!

    TS SSC ఫలితాలు 2023ని ప్రకటించడానికి విలేకరుల సమావేశం ప్రారంభమైంది! ఇప్పుడు ఫలితాలు ప్రకటించారు.

  • 11 58 AM IST - 10 May'23

    TS SSC Results 2023 విడుదల

    విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ పదో తరగతి ఫలితాల 2023ని విడుదల చేశారు.

  • 11 57 AM IST - 10 May'23

    ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌కి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

    పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు చేరుకున్నారు. 

  • 11 54 AM IST - 10 May'23

    కాసేపట్లో పదో తరగతి ఫలితాలు వెల్లడి

    మరి కాసేపట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబిత్రా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నారు. 

  • 11 45 AM IST - 10 May'23

    TS SSC Results 2023: 15 నిమిషాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభం

    TS SSC ఫలితాలు 2023 ప్రకటించడానికి మరో  15 నిమిషాలల్లో విలేకరుల సమావేశం ప్రారంభమవుతుంది.

  • 11 41 AM IST - 10 May'23

    TS SSC Results 2023: రీవాల్యుయేషన్ ప్రక్రియ

    TS SSC Results 2023 విడుదలైన తర్వాత విద్యార్థులు కనీస ఛార్జీతో  మార్కుల రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ కోసం ఫైల్ చేసుకోవడానికి విండో తెరవబడుతుంది.

  • 11 37 AM IST - 10 May'23

    TS SSC Results 2023: మార్క్ షీట్‌లో ఉండే వివరాలు ఇవే

    కాసేపట్లో తెలంగాణ పదో తరగతి 2023 ఫలితాలు విడుదలకానున్నాయి. విద్యార్థుల ఆన్‌లైన్ మార్క్ షీట్‌లో ఉండే వివరాలివే

    • విద్యార్థి పేరు
    • పరీక్ష రోల్ నెంబర్
    • ప్రతి సబ్జెక్టులో మార్కులు
    • మొత్తం మార్కులు
    • ఉత్తీర్ణత స్థితి

  • 11 30 AM IST - 10 May'23

    TS SSC Results 2023: SMS ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా?

    ఒకవేళ అధికారిక వెబ్‌సైట్ పని చేయకపోతే అభ్యర్థులు SMS ద్వారా కూడా తమ పదో తరగతి ఫలితాలను పొందవచ్చు. 

    • ఫోన్‌లో మెసెజ్ ఆప్షన్ ఎంచుకోవాలి
    • మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్‌తో TSGEN1 లేదా TSGEN2 అని టైప్ చేసి 56263కి  పంపించాలి
    • దాంతో అదే ఫోన్ నెంబర్‌కు అభ్యర్థుల ఫలితాలు వస్తాయి. 

  • 11 21 AM IST - 10 May'23

    TS 10th Results 2023: పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య

    ఈ ఏడాది తెలంగాణలో పదో తరగతి  పరీక్షలకు  4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా 4,84,384 మంది హాజరయ్యారు.  1,809 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేదు. 

  • 11 13 AM IST - 10 May'23

    TS 10th Results 2023: ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులు

    TS SSC Results  2023 ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఒక గంట మాత్రమే మిగిలి ఉన్నందున, విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగగా  ఎదురుచూస్తున్నారు. 

  • 11 08 AM IST - 10 May'23

    కాసేపట్లో 10th Results, విద్యార్థుల్లో టెన్షన్

    కాసేపట్లో తెలంగాణలో పదో తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. తమ మార్కుల కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్నారు. 

  • 10 59 AM IST - 10 May'23

    TS SSC Rsults 2023: ఉత్తమ MEC కళాశాలలు

    TS SSC ఫలితాలు 2023 విడుదలైన తర్వాత విద్యార్థులు దరఖాస్తు చేసుకోగల MEC కోర్సులు అందించే కొన్ని ఉత్తమ కళాశాలల జాబితా:

    • సెయింట్ మేరీ కళాశాల
    • లయోలా జూనియర్ కళాశాల
    • షాదన్ జూనియర్ కళాశాల

  • 10 52 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఉత్తమ HEC కాలేజీలు

    TS SSC Results 2023: HEC కోర్సును అందించే రాష్ట్రంలోని కొన్ని ఉత్తమమైన కళాశాలలు:

    • లయోలా జూనియర్ కళాశాల
    • మహబూబియా జూనియర్ కళాశాల
    • శ్రీ రామ భద్ర జూనియర్ కళాశాల

  • 10 42 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఇంటర్ అడ్మిషన్ మోడ్

    TS SSC ఫలితాలు 2023 ఈరోజు ప్రకటించబడతాయి. దీని ఆధారంగా TS ఇంటర్ అడ్మిషన్లు ఆఫ్‌లైన్‌లో నిర్వహించబడతాయి. ఆన్‌లైన్ ఫార్మ్‌లు ఏవీ అందుబాటులో ఉండవు.  విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. 

  • 10 39 AM IST - 10 May'23

    TS SSC Results 2023: పరీక్షా తేదీలు

    TS SSC 2023 పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి  13, 2023 వరకు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా జరిగాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
     

  • 10 20 AM IST - 10 May'23

    TS 10th Results 2023: తెలంగాణలోని ఉత్తమ ITI కళాశాలలు

    ఈరోజు TS SSC Results 2023 ప్రకటించిన తర్వాత ఆసక్తిగల విద్యార్థులు అడ్మిషన్‌ను పొందే కొన్ని ఉత్తమ ITI కాలేజీలు ఇక్కడ ఉన్నాయి:
    • బాదం వెంకటయ్య పారిశ్రామిక శిక్షణ కేంద్రం- BVITC, ఖమ్మం-తెలంగాణ
    • డాల్ఫిన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ -DTIC, మహబూబాబాద్
    • ఆదిలాబాద్ ప్రైవేట్ ITI - APITI, దస్నాపూర్ , ఆదిలాబాద్-తెలంగాణ

  • 10 09 AM IST - 10 May'23

    TS 10th Results 2023ని ఎవరు విడుదల చేస్తారు?

    తెలంగాణ విద్యాశాఖ మంత్రి, సబితా ఇంద్రా రెడ్డి ఈరోజు విలేకరుల సమావేశంలో TS SSC ఫలితాలు 2023ని ప్రకటిస్తారు, ఆ తర్వాత ఫలితాలను చెక్ చేసుకోవడానికి లింక్‌లు యాక్టివేట్ అవుతాయి.

  • 10 00 AM IST - 10 May'23

    మరో రెండు గంటల్లో TS 10th Results 2023

    TS SSC ఫలితాలు 2023ని ప్రకటించడానికి విలేకరుల సమావేశం మధ్యాహ్నం 12:00 గంటలకు షెడ్యూల్ చేయబడింది. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించడానికి మరో రెండు గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

  • 09 50 AM IST - 10 May'23

    TS 10th Results 2023 లింక్ యాక్టివేషన్ సమయం

    విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో చూసుకోవడానికి TS 10th Results 2023 లింక్ bseresults.telangana.gov.in ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

  • 09 43 AM IST - 10 May'23

    TS 10th Results 2023: గత ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం

    2022లో నమోదైన ఉత్తీర్ణత శాతం 90%. ఈ ఉత్తీర్ణత శాతం TS SSC ఫలితాల 2023లో పెరుగుతుందని భావిస్తున్నారు.

  • 09 35 AM IST - 10 May'23

    TS 10th Results 2023: ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం కోర్సులు

    TS SSC ఫలితాలు 2023 ప్రకటించిన తర్వాత రాష్ట్రం అందించే ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవాలనుకునే విద్యార్థులు అందుబాటులో ఉన్న కోర్సుల జాబితాను గమనించాలి:

    • MPC- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
    • Bi.PC- జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం
    • MEC- మ్యాథ్స్, ఆర్థిక శాస్త్రం,  వాణిజ్యం
    • CEC- సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్
    • HEC- చరిత్ర, ఎకనామిక్స్, సివిల్స్

  • 09 18 AM IST - 10 May'23

    TS 10th Results 2023: ఉత్తమ పాలిటెక్నిక్ కాలేజీల జాబితా

    TS SSC Results 2023 ప్రకటించిన తర్వాత విద్యార్థులు రాష్ట్రంలోని కొన్ని ఉత్తమ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్ పొందవచ్చు.

    • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిజామాబాద్
    • JN ప్రభుత్వ పాలిటెక్నిక్, హైదరాబాద్
    • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మండలం
    • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్
    • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మహబూబ్‌నగర్

  • 09 15 AM IST - 10 May'23

    TS 10th Results 2023: ఇంటర్ అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

    TS 10వ తరగతి ఫలితాలు 2023 ఈరోజు ప్రకటిస్తే, జూన్ 2023 నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
     

  • 09 00 AM IST - 10 May'23

    TS SSC Results 2023: గత ఏడాది టాప్‌లో నిలిచిన జిల్లా ఏదంటే?

    గత సంవత్సరం (2022) టీఎస్ ఇంటర్ ఫలితాల్లో 79% ఉత్తీర్ణతతో అత్యల్ప పనితీరు కనబరిచిన జిల్లాగా హైదరాబాద్, 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట టాప్‌లో నిలిచాయి.

  • 08 51 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఇంటర్మీడియట్ ఫలితాల 2023 లింక్

    TSBIE మొదటి, రెండో  సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాల 2023  లింక్‌ను మే 9, 2023న విడుదల చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • 08 39 AM IST - 10 May'23

    TS SSC Results 2023: గత ఏడాది బాలికల ఉత్తీర్ణత శాతం

    2022 పదో తరగతి ఫలితాల్లో 92.45% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు మెరుగైన పనితీరు కనబరిచారు.

  • 08 31 AM IST - 10 May'23

    TS SSC Results 2023ని చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌‌లు

    ఇతర హోస్టింగ్ వెబ్‌సైట్‌లు కాకుండా TS SSC ఫలితాలు 2023ని చెక్ చేసుకోవడానికి ఈ దిగువ తెలిపిన అధికారిక వెబ్‌సైట్‌లను చూాడండి.

    • bse.telangana.gov.in
    • bseresults.telangana.gov.in.

  • 08 28 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఉత్తీర్ణత మార్కులు

    పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35% స్కోర్ చేయాలి. అలాగే అన్ని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులు సాధిస్తే విద్యార్థులు పాసైనట్టే. 

  • 08 09 AM IST - 10 May'23

    మరో 4 గంటల్లో TS SSC Results 2023

    TS SSC Results 2023 ప్రకటనకు నాలుగు గంటలు మిగిలి ఉన్నాయి. విలేకరుల సమావేశం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

  • 08 08 AM IST - 10 May'23

    TS SSC Results 2023 చెక్ చేసుకోవడానికి కావాల్సిన వివరాలు

    విద్యార్థులు వారి TS SSC 2023 ఫలితాలు చెక్ చేసుకోవడానికి వారి TS SSC హాల్ టిక్కెట్‌లను తమ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఫలితాలను చెక్ చేసుకోవడానికి హాల్ టికెట్‌లో పేర్కొన్న విధంగా ఈ కింది వివరాలను కచ్చితంగా అవసరం అవుతుంది.

    • హాల్ టికెట్ నెంబర్/ పరీక్ష హాల్ టికెట్ నెంబర్
    • పుట్టిన తేదీ

  • 07 58 AM IST - 10 May'23

    TS SSC Results 2023 మార్కుల మెమో

    TS SSC Results 2023 చిన్న మార్కులు మెమో ఫలితాల ప్రకటన తర్వాత కొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈరోజు సాయంత్రంలోగా ఆన్‌లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఫలితాల ప్రకటన సమయంలో అధికారిక నిర్ధారణ చేయబడుతుంది.

  • 07 53 AM IST - 10 May'23

    TSBSE SSC Results 2023: గత సంవత్సరం బాలుర ఉత్తీర్ణత శాతం

    TSBSE SSC ఫలితాల్లో మునుపటి సంవత్సరం బాలురు ఉత్తీర్ణత శాతం 90%.

  • 07 43 AM IST - 10 May'23

    TS SSC Results 2023: మునుపటి సంవత్సరాల ముఖ్యాంశాలు

    TS SSC Results 2023 మునుపటి సంవత్సరాల ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి -

    • బాలురు - 2,23,779 మంది ఉత్తీర్ణులయ్యారు
    • బాలికలు - 2,29,422 మంది ఉత్తీర్ణులయ్యారు

  • 07 35 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఈ సంవత్సరం 6 పేపర్లు మాత్రమే

    ఈ సంవత్సరం TS SSC 2023 పరీక్షల్లో 11 పేపర్‌లకు బదులుగా 6 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఫిజిక్స్, బయాలజీ పేపర్‌లు ఒకే పేపర్‌గా మార్చబడ్డాయి.

  • 07 26 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఫలితాల గురించి ఆత్రుతగా ఉన్న విద్యార్థులు

    TS  SSC Results 2023 ప్రకటనకు దాదాపు 4 గంటలు మిగిలి ఉన్నందున విద్యార్థులు తమ మార్కుల గురించి తెలుసుకునేందుకు ఆత్రుతగా ఉన్నారు. అనవసరమైన ఒత్తిళ్లకు దూరంగా ఉండాలంటే ఫలితం వెలువడే వరకు ప్రశాంతంగా ఉండడం మంచిది.

  • 07 18 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఎలా చెక్ చేసుకోవాలంటే?

    TS SSC ఫలితాల  2023ని చెక్ చేసుకునే విధానం ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 

    • ఫలితాల ప్రకటన తర్వాత ఈ పేజీలో అందుబాటులో ఉండే డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
    • ఫలితం ట్యాబ్ ఓపెన్ అవుతుంది
    • TS SSC హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి, 'Submit'పై క్లిక్ చేయాలి
    • తర్వాత రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి. 

     

  • 07 10 AM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023: సప్లిమెంటరీ పరీక్ష తేదీల ప్రకటన ఎప్పుడంటే?

    TS SSC Results 2023 ప్రకటన తర్వాత బీఎస్ఈ తెలంగాణ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను విడుదల చేస్తుంది. సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

  • 07 01 AM IST - 10 May'23

    TS SSC Results 2023: ఇంటర్‌లో అడ్మిషన్ ఎలా పొందాలి?

    TS SSC పరీక్షల 2023లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు నేరుగా సంబంధిత కళాశాలను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కాలేజ్ నిర్దేశించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
     

  • 06 49 AM IST - 10 May'23

    TS SSC Results 2023 తర్వాత కెరీర్ ఆప్షన్ల జాబితా

    TS SSC ఫలితాలు 2023 తర్వాత అందుబాటులో ఉన్న కెరీర్ ఆప్షన్ల జాబితా ఇక్కడ ఉంది -

    • ఇంటర్మీడియట్
    • పాలిటెక్నిక్
    • ITI

  • 06 47 AM IST - 10 May'23

    TS SSC Results 2023: టాపర్ల జాబితా

    TS SSC Rsults 2023 ప్రకటన తర్వాత BSE తెలంగాణ ఎలాంటి అధికారిక టాపర్ల జాబితాను విడుదల చేయదు. టాపర్లను విడుదల చేసే కార్యాచరణను బోర్డు నిలిపివేసింది. అయితే విద్యార్థులు కాలేజీదేఖో ద్వారా 'బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టూడెంట్స్ లిస్ట్'ని చూడొచ్చు. ఈ జాబితాలో TS SSC 2023 పరీక్షల్లో 500+ మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు ఉంటాయి.

  • 06 39 AM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023: ITI అడ్మిషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

    తెలంగాణలో ఐటీఐ అడ్మిషన్లు మే చివరి వారంలో ప్రారంభం అవుతాయి.  iti.telangana.gov.inలో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. TS SSC పరీక్షలు 2023లో ఉత్తీర్ణులై ITI అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • 06 39 AM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023: ప్రెస్ కాన్ఫరెన్స్ వివరాలు

    బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు విలేకరుల సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాస్‌వర్డ్‌తో పాటు ఫలితాల సీడీని విడుదల చేస్తారు. హోస్టింగ్ వెబ్‌సైట్‌లు ఫలితాల డేటాను తమ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఫలితాలను చూసుకోగలరు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11:50 గంటలకు విలేకరుల సమావేశ హాల్‌కి చేరుకుంటారు.

  • 06 30 AM IST - 10 May'23

    TS 10వ తరగతి ఫలితాలు 2023: ఉత్తీర్ణత సర్టిఫికెట్‌కు సంబంధించిన వివరాలు

    తెలంగాణ పదో తరగతి 2023  పరీక్షా ఫలితాల తర్వాత ఒక నెలలోపు పాస్ సర్టిఫికెట్‌ని  సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జారీ చేస్తారు. BSE TS ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్‌లను సంబంధిత పాఠశాలలకు పంపుతుంది. విద్యార్థులు తమ పాఠశాల ప్రిన్సిపాల్ నుంచి వాటిని తీసుకోవాలి. పాస్ సర్టిఫికెట్ పొందడానికి అదనపు రుసుము ఏమిలేదు.

  • 06 24 AM IST - 10 May'23

    తెలంగాణ SSC ఫలితాలు 2023: ఎంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు?

    TS SSC 2023 పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 4,94,620. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు దాదాపు 95% హాజరు నమోదైంది. 
     

  • 06 14 AM IST - 10 May'23

    TS SSC 10వ ఫలితాలు 2023: TS POLYCET మే 17న

    TS POLYCET 2023 కోసం దాదాపు ఒక  లక్ష మంది TS SSC విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ  ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించబడుతోంది. TS POLYCET 2023 హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

  • 06 13 AM IST - 10 May'23

    TS SSC ఫలితాలు 2023: చెక్ చేయవలసిన వెబ్‌సైట్‌ల జాబితా

    TS SSC ఫలితాలు 2023 ఈ కింది వెబ్‌సైట్‌ల ద్వారా చెక్ చేయవచ్చు -

    • BSE TS
    • కాలేజ్ దేఖో
    • మనబడి
    • ఈనాడు ప్రతిభ
    • సాక్షి ఎడ్యుకేషన్

  • 06 06 AM IST - 10 May'23

    TS SSC ఫలితం 2023 టైమ్

    TS SSC ఫలితాలు 2023 ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదలవుతాయి. రిజల్ట్స్ CD విడుదలైన తర్వాత 12:10 PMకి ఫలితం లింక్ యాక్టివేట్ చేయబడుతుంది.

  • 06 03 AM IST - 10 May'23

    ఫలితాలు చెక్ చేసుకోవడానికి అవసరమైన వివరాలు

    ఫలితాలను చెక్ చేసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ తప్పనిసరి. కాబట్టి విద్యార్థులు తమ TS SSC హాల్ టిక్కెట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ts-ssc-10th-results-2023-live-updates-manabadi-result-link-toppers-list/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!