TSGENCO Recruitment 2023: తెలంగాణలో 339 ఉద్యోగాలు, నెలకు రూ.65,600 జీతం, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

Andaluri Veni

Updated On: October 10, 2023 01:46 pm IST

ఏఈ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO Recruitment 2023) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.  మొత్తం 339 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.  
 
TSGENCO Recruitment 2023: తెలంగాణలో 339 ఉద్యోగాలు, నెలకు రూ.65,600 జీతం, పూర్తి వివరాలు ఇక్కడ చూడండిTSGENCO Recruitment 2023: తెలంగాణలో 339 ఉద్యోగాలు, నెలకు రూ.65,600 జీతం, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

TSGENCO రిక్రూట్‌మెంట్ 2023 (TSGENCO Recruitment 2023): తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO) అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 339 ఏఈ పోస్టులకు భర్తీ చేయనున్నారు. డైరక్ట్ రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేయనున్నారు.  అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీలోగా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది.  రాష్ట్రంలో యాదాద్రి, భద్రాతి విద్యుత్  కేంద్రాలకు, ఇతర పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం కూడా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు TSGENCO తెలిపింది. ఈ (TSGENCO Recruitment 2023) రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

TSGENCO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ - ఇక్కడ క్లిక్ చేయండి
TSGENCO పోస్టుల కోసం దరఖాస్తు ఫార్మ్ - ఇక్కడ క్లిక్ చేయండి

TSGENCO రిక్రూట్‌మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు (TSGENCO Recruitment 2023 Important Dates)

TSGENCO రిక్రూట్‌మెంట్ 2023‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున చూడండి.

TSGENCO రిక్రూట్‌మెంట్ పోస్టులు తేదీలు
ఆన్‌లైన్ పేమంట్ ఫీజు ప్రారంభ తేదీ 07-10-2023
ఆన్‌లైన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29-10-2023
పేమంట్ ఫీజు లాస్ట్‌డేట్ 29-10-2023
డౌన్‌లోడింగ్ అడ్మిట్‌కార్డు తేదీ పరీక్షకు ఏడు రోజుల ముందు
TSGENCO పరీక్ష తేదీ 03-12-2023


TSGENCO Recruitment 2023 Total Assistant Engineer Vacancies (TSGENCO రిక్రూట్‌మెంట్ మొత్తం అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు)

TSGENCO రిక్రూట్‌మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు మొత్తం 339 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు ఇక్కడ చూడండి.

పోస్టుల పేరు ఖాళీల సంఖ్య
ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులు 187
ఏఈ (మెకానికల్) పోస్టులు 77
ఏఈ(ఎలక్ట్రానిక్స్) పోస్టులు 25
ఏఈ (సివిల్) పోస్టులు 50

TSGENCO రిక్రూట్‌మెంట్ 2023 అర్హత ప్రమాణాలు (TSGENCO Recruitment 2023 Qualification)

  • TSGENCOలో ఏఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల వయస్సులో మినహాయింపు ఉంటుంది.
  • అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ (సంబంధిత ఇంజనీరింగ్ విభాగం) కలిగి ఉండాలి. అంటే  బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కంట్రోల్ ఇంజనీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజనీరింగ్) పాసై ఉండాలి.
  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా దరఖాస్తు ఫీజుగా రూ.400లు చెల్లించాలి.

ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  అభ్యర్థులను రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు  నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220 వరకు చెల్లించడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో https://tsgenco.co.in/ ‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.


తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు,  ఆర్టికల్స్‌ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/tsgenco-ae-recruitment-2023-online-application-46095/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!