TS SSC Composite Telugu Guess paper 2025

Prasanthi Boodati

Updated On: March 21, 2025 11:54 AM

For the exam on March 21, find here TS SSC Composite Telugu Guess Paper 2025 to enhance their preparation. The expected questions are provided as per an analysis of previous years' papers.


 
TS SSC Composite Telugu Guess paper 2025TS SSC Composite Telugu Guess paper 2025

TS SSC Composite Telugu Guess Paper 2025: The TS SSC Composite Telugu exam is scheduled for March 21, 2025. In this theoretical test, candidates will be required to answer 40 questions divided into two parts, with additional subsections. The paper will consist of very short (grammar-related) questions, short-answer questions, and long-answer questions. To prepare effectively, it is highly advisable for candidates to use the guess paper, as it will help them familiarize themselves with the exam format, the weightage of different topics, and the distribution of marks across various sections. Given the limited time left, completing the guess paper will be an efficient way to maximize study efforts.

TS SSC Composite Telugu Guess Paper 2025

Check out the TS SSC Composite Telugu section-wise guess paper 2025 here, as follows

పార్ట్ - A : I. అవగాహన - ప్రతిస్పందన

అ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

పెద్దల వ్యవహారం చాలా నిర్మొహమాటంగా ఖచ్చితంగానే నడిచింది. వరుని రేటు పదివేలుగా తేలింది. ఇంకా ఆడపిల్లల లాంఛనాలు, అవీఇవీ… నారాయణరావు ముఖం కొంచెం పాలిపోయింది. ఆయన అయిదువేల నగదూ, ఉంగరం, గడియారం, లాంటి లాంఛనాలైతే తనవల్ల అవుతుందనుకున్నాడు. ఆ మాటే తేల్చి చెబితే ఈ సంబంధం ‘ఇప్పుడే బెడిసికొడుతుందేమోనన్న జంకుతో. “ఆదివారం నేనక్కడికి వస్తాను ! అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం” అన్నాడు. పెళ్ళిచూపుల కార్యక్రమం ముగిసిపోయింది.

ప్రశ్నలు :

1.పెద్దల వ్యవహారం ఎలా నడిచింది ?
2. నారాయణరావు ముఖం ఎందుకు పాలిపోయింది ?

3. ఏ రోజున వస్తానని నారాయణరావు అన్నాడు ?

4. నారాయణరావు ఎటువంటి లాంఛనాలైతే తన వల్ల అవుతుందనుకున్నాడు ?
5. ఏ కార్యక్రమం ముగిసిపోయింది ?

ఆ) కింది పద్యాలలో ఒక పద్యానికి భావం రాయండి.

6. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయబోకుము, కార్యా
లోచనము లొంటి జేయకు
మాచారము విడువబోకు మయ్యకుమారా !

(లేదా)

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రునింట, గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !

ఇ) కింది గద్యాన్ని చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

వరంగల్ నగరంలో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట. దక్షిణ భారతదేశంలో శిల్పకళకు మచ్చుతునక ఈ కోట. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు క్రీ.శ. 1199 సం॥లో కోట నిర్మాణం మొదలు పెట్టాడు. అతని కుమార్తె రాణి రుద్రమదేవి 1261 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ కోట నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలు కలిగి ఉన్నది. చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నవారికి ఈ కోట సందర్శనీయమైనది. రాతిపై చెక్కబడిన సింహాల వంటి జంతువులు మరియు హంసల వంటి పక్షులు ఆనాటి కళాకారుల పనితనానికి నిదర్శనం.

ప్రశ్నలు :

7. దక్షిణ భారతదేశంలో శిల్పకళకు మచ్చుతునకగా నిలిచిన కోట ఏది ?
8. పై పేరాలో ఉన్న తండ్రి కూతురు ఎవరు ?
9. వరంగల్ కోట నిర్మాణం మొదలు పెట్టినవాడు ఎవరు ?
10. కళాకారుల పనితనానికి నిదర్శనమైనవి ఏవి ?

11. కోట నిర్మాణం ఏ సంవత్సరంలో పూర్తి అయినది ?
II. వ్యక్తీకరణ సృజనాత్మకత

అ) కింది ప్రశ్నలకు నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.

12. “కలిసి తినడంలో ఆనందం ఉంటుంది” దీనిని సమర్థించండి.

13. ఆమె నడిచివస్తుంటే వీధులన్నీ మురిసిపోతాయి” అని కనపర్తి అన్నారు కదా ! దీనిపై మీ అభిప్రాయం తెలుపండి.

14. పొడుపు కథల వలన ఉపయోగములేవి ?

15. పెంబర్తి వారిది ‘కళా హృదయం’ అని చెప్పక చెబుతున్న అంశాలేవి ?

ఆ) కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.

16. ‘ప్రపంచ పదులు’ పాఠం ద్వారా మీరే విషయాలు గ్రహించారు ?

(లేదా)

“శతక పద్యాలు మానవునికి దిశానిర్దేశం చేస్తాయి కదా !” వివరించండి.

17. పెంబర్తి శిల్పుల కళానైపుణ్యమును తెలుసుకున్నారు కదా ! మీకు తెలిసిన ఏదైనా ఒక కళ, దాని ప్రత్యేకతను గురించి రాయండి.

(లేదా)

‘ఆంధ్రుల నాగరికతకూ, సంస్కృతికీ పాటలు మూలాధారాలు’ ఎట్లాగో వివరించండి.

ఇ. సృజనాత్మకత (8 మార్కులు)

అ) కింది ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు జవాబు రాయండి

18. వరకట్న దురాచారాన్ని తెలియజేసే ఒక కథను రాయండి.

19. కోపం తగ్గించుకోవడం మంచిది అనే అంశాన్ని బోధిస్తూ మిత్రుడికి లేఖ రాయండి.

20. ఒక సంగీత కళాకారుని ఇంటర్వ్యూ చేయడానికి ‘ప్రశ్నావళి’ని తయారుచేయండి.

పార్ట్ – B: I. భాషాంశాలు

అ) పదజాలం

కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

1. చిత్తశుద్ధి : ………………………
2. అచిరకాలం : ………………………
కింది ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించి (A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లో రాయండి.

3. సంవత్సరానికి పన్నెండు మాసములు ఉంటాయి. (గీత గీసిన పదానికి అర్థం)

A) నెలలు

B) వారములు

C) రోజులు

D) పక్షములు

4. నింగిలో నక్షత్రాలు విలమిలా మెరుస్తున్నాయి. (గీత గీసిన పదానికి అర్థం)

A) ఆకాశం

B) భూమి

C) దిక్కు

D) సాగరం

5. ‘సేకరణ’ అంతే అర్థం

A) దాచుకొనుట

B) పాడుచేయుట

C) పోగు చేయుట

D) దోచుకొనుట

6. థర్మము అనే పదానికి నానార్థాలు

A) ధర్మము, కర్మము

B) అన్యము, విన్యము

C) మర్మము, ఘర్మము

D) పుణ్యము, స్వభావము

7. ‘సత్యము’ – అనే పదానికి వికృతి

A) సత్తెము

B) విత్తము

C) బెత్తము

D) బొత్తము

8. ‘మరణం లేనివారు’ అను పదానికి వ్యుత్పత్యర్ధము

A) అసురులు

B) అరుగులు

C) అతిథులు

D) అమరులు

9. దశరథుని కుమారుడు – వ్యుత్పత్తిగా గల పదం

A) రాజు

B) భూపాలుడు

C) ఇంద్రుడు

D) దాశరథి

10. ‘పద్దెం’ ప్రకృతి పదం [ ]

A) పద్యం

B) పందెం

C) పంతం

D) పంకం

ఆ) వ్యాకరణాంశాలు

కింది వానికి సరైన జవాబును గుర్తించి (A / B / C / D) సంకేతాన్ని బ్రాకెట్లలో రాయండి.

ప్రశ్న 11.

ఇందిర సింహాన్ని చూసింది. (ఈ వాక్యంలో కర్త)

A) ఇందిర

B) సింహాన్ని

C) చూసింది

D) ఏదీకాదు

12. ప్రజ + అభిప్రాయం కలిపి రాయండి.
A) ప్రజభిప్రాయం
B) ప్రజాభిప్రాయం
C) ప్రజఅభిప్రాయం
D) ప్రజాప్రాయం

13. పాప పాలు త్రాగి నిద్రపోయింది. (గీత గీసిన పదం ఏ క్రియ ?)

A) సత్రియ

B) సమాపక క్రియ

C) అసమాపక క్రియ

D) క్రియా విశేషణం

14. రవి ఊరికి వెళ్ళి, మామిడిపండ్లు తెచ్చాడు. ఇది ఏ వాక్యం ?

A) సంక్లిష్ట వాక్యం

B) సంయుక్త వాక్యాలు

C) సామాన్య వాక్యం

D) కర్తరి వాక్యం

15. ‘మనుషులంతా’ పదాన్ని విడదీయండి.
A) మనుషులు + అంతా
B) మనుషులు + లంతా
C) మనుషు + లంతా.
D) మనుషులు + లుంతా

16. చార్మినారు కులీ కుతుబ్షా నిర్మించాడు.. (గీత గీసిన పదం ఏ కాలం?)

A) వర్తమాన కాలం

B) భూతకాలం

C) భవిష్యత్ కాలం

D) తద్ధర్మ కాలం

17. మధు మాట్లాడడు. మధు చేసి చూపిస్తాడు. (ఇవి ఏ వాక్యాలు ?)

A) సంక్లిష్ట వాక్యాలు

B) సంయుక్త వాక్యాలు

C) సామాన్య వాక్యాలు.

D) కర్మణి వాక్యాలు

18. మనిషి జీవితంలో సుఖదుఃఖాలు తప్పనిసరి. (ద్వంద్వ సమాస పదాన్ని గుర్తించండి.)
A) మనిషి
B) జీవితంలో
C) సుఖదుఃఖాలు
D) తప్పనిసరి

19. రాయమ్య ఊరు దాటాడు. రామయ్య అడవిలో ప్రవేశించాడు. (సంక్లిష్ట వాక్యంగా మార్చండి)

A) రామయ్య ఊరు దాటి, అడవిలో ప్రవేశించాడు.

B) రామయ్య అడవిలో ప్రవేశించి, ఊరు దాటాడు.

C) రామయ్య ఊరు దాటుతూ అడవిలో ప్రవేశించాడు.

D) రామయ్య ఊరు దాటడానికి అడవిలో ప్రవేశించాడు.

20. మాధవి శ్రీనివాస్కు బహుమతి ఇచ్చింది. (ఈ వాక్యంలో క్రియ)

A) మాధవి

B) ఇచ్చింది

C) శ్రీనివాస్కు

D) బహుమతి

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ts-ssc-composite-telugu-guess-paper-2025-63811/

Do you have a question? Ask us.

  • Typical response between 24-48 hours

  • Get personalized response

  • Free of Cost

  • Access to community

Recent News

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy