AP DSC నోటిఫికేషన్ 2024 (AP DSC Notification 2024) విడుదల అయ్యింది , ముఖ్యమైన సమాచారం ఇక్కడ చూడండి

Guttikonda Sai

Updated On: February 07, 2024 05:04 pm IST

AP DSC నోటిఫికేషన్ 2024 విడుదల అయ్యింది, DSC పోస్టుల ఖాళీల వివరాలు, ముఖ్యమైన తేదీలు, మొదలైన సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
AP DSC నోటిఫికేషన్ 2024 త్వరలో విడుదల కానున్నది, ముఖ్యమైన సమాచారం ఇక్కడ చూడండి

AP DSC నోటిఫికేషన్ 2024 : ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. AP DSC నోటిఫికేషన్ 07, ఫిబ్రవరి 2024 తేదీన విడుదల అయ్యింది. AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. SGT, స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల ఖాళీల సంఖ్య 6100 గా ఉంది. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్

AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification 2024 Important Highlights)

AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

AP DSC నోటిఫికేషన్ 2024

వివరాలు

నోటిఫికేషన్ పేరు

AP DSC నోటిఫికేషన్ 2024

నిర్వహణ సంస్థ

కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్

పోస్టులు

SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్

ఖాళీల సంఖ్య

6100

దరఖాస్తు ప్రారంభం

12 ఫిబ్రవరి 2024

అధికారిక వెబ్సైటు

cse.ap.gov.in/apdsc.apcfss.in

AP DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( AP DSC Notification 2024 Eligibility Criteria)

AP DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు.

AP DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత ప్రమాణాలు

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్
  • D.ED లేదా D.El.ED లో డిప్లొమా లేదా
  • B.ED గ్రాడ్యుయేషన్

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు

  • సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ లేదా
  • బ్యాచిలర్ డిగ్రీ లేదా
  • BCA/BBM/ B.ED

AP DSC 2024 మ్యూజిక్ టీచర్ అర్హత ప్రమాణాలు

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్
  • మ్యూజిక్ లో 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు

AP DSC 2024 వయో పరిమితి

AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, గరిష్ట వయసు 44 సంవత్సరాలు. SC/ST/BC  అభ్యర్థులకు గరిష్ట వయసు 49 సంవత్సరాల వరకు ఉండవచ్చు, వికలాంగులకు గరిష్ట వయసు 54 సంవత్సరాలు ఉండవచ్చు.

AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన తేదీలు (AP DSC Notification 2024 Important Dates)

AP DSC నోటిఫికేషన్ 2024 కు సంబందించిన ముఖ్యమైన తేదీలను విద్యార్థులు క్రింది టేబుల్ నుండి తెలుసుకోవచ్చు.
ఏపీ డీఎస్సీ 2024 ఈవెంట్లు ఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 07, 2024
AP DSC 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం ఫిబ్రవరి 12, 2024
AP DSC 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 22, 2024
AP DSC 2024 పరీక్ష తేదీలు మార్చి 15 నుంచి మార్చి 30, 2024
ఏపీ డీఎస్సీ 2024 హాల్ టికెట్లు మార్చి 05, 2024
AP DSC 2024 ఫైనల్ కీ విడుదల ఏప్రిల్ 02, 2024
AP DSC 2024 ఫలితాలు ఏప్రిల్ 07, 2024

AP DSC 2024 అప్లికేషన్ ఫీజు (AP DSC Application Fee 2024)

AP DSC 2024 అప్లికేషన్ ఫీజు కేటగిరీ ప్రకారంగా క్రింది టేబుల్ నుండి తెలుసుకోవచ్చు.

కేటగిరీ

AP DSC 2024 అప్లికేషన్ ఫీజు

జనరల్

500/-

BC

500/-

SC/ST

500/-

AP DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలు (AP DSC 2024 Previous Year Question Papers)

AP DSC 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం వారికి మంచి స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. అభ్యర్థులు క్రింది టేబుల్ నుండి AP DSC 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలను PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP DSC 2024 పేపర్

PDF ఫైల్ (డైరెక్ట్ లింక్ )

AP DSC 2024  SGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024  మ్యూజిక్ టీచర్ పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024  TGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024  PGT పేపర్

PDF ఫైల్ (యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC ఎంపిక ప్రక్రియ 2024 (AP DSC Selection Process 2024)

AP DSC నోటిఫికేషన్ 2024కి దరఖాస్తును సమర్పించడానికి సిద్ధంగా ఉన్న దరఖాస్తుదారులందరూ మొదట ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఏపీ డీఎస్సీలో క్వాలిఫై అయ్యేందుకు అభ్యర్థులు రెండు దశలను దాటాలి. ముందుగా అభ్యర్థులు రాత పరీక్ష పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవబడతారు.

1.రాత పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

AP DSC పరీక్షా విధానం 2024 (AP DSC Exam Pattern 2024)

AP DSC పరీక్షా విధానం 2024 గురించి ఈ దిగువున పట్టికలో అందజేశాం.
సబ్జెక్టులు ప్రశ్నలు మార్కులు
జనరల్ నాలెడ్జ్ 20 10
ఎడ్యుకేషన్ పర్సపెక్టివ్స్ 20 10
లాంగ్వేజ్-I (భారతీయ భాషలు), లాంగ్వేజ్ -II (ఇంగ్లీష్)లో సీనియర్ సెకండరీ స్థాయి (ఇంటర్మీడియట్ స్థాయి) వరకు భాషా నైపుణ్యం, భాషా అంశాలు, కమ్యూనికేషన్, గ్రహణ సామర్థ్యాలు 36 18
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సిలబస్ I నుంచి VIII వరకు క్లాస్ X స్థాయి వరకు కష్టతరమైన స్టాండర్డ్ 54 27
U.G ప్రకారం టీచింగ్ మెథడాలజీ (స్ట్రాటజీ పేపర్స్). డి.పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడ్ సిలబస్ 30 15
మొత్తం 160 80

AP DSC 2024 నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ap-dsc-notification/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!