ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Guttikonda Sai

Updated On: November 27, 2024 11:59 AM

పాఠశాల విద్యాశాఖ ఏపీ మెగా డీఎస్సీ 2024  సిలబస్‌ని (AP DSC 2024 Syllabus) నవంబర్ 27న విడుదల చేసింది. సిలబస్‌ని PDF రూపంలో భ్రదపరించింది. అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
AP DSC 2023 సిలబస్( AP DSC 2023 Syllabus)

AP DSC 2024 సిలబస్ (AP DSC 2024 Syllabus) : ఏపీ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల ఆలస్యమవుతుంది. నోటిఫికేషన్ విడుదల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ లోపల పాఠశాల విద్యాశాఖ ఏపీ డీఎస్సీ 2024 సిలబస్‌ని విడుదల చేసింది. అభ్యర్థులు ఆ సిలబస్‌‌ని డౌన్‌లోడ్ చేసుకుని తమ ప్రిపరేషన్‌ని మొదలుపెట్టవచ్చు. AP DSC 2024 సిలబస్ (AP DSC 2024 Syllabus) పోస్టుల ప్రకారం మారుతూ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ కు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు సిలబస్ భిన్నంగా ఉంటుంది. అలాగే అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టు సిలబస్ తో పాటు మెథడాలజీని కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ను విధిగా ఫాలో అవుతూ ఉండాలి.

ఇది కూడా చదవండి: ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 విడుదల, PDF‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 PDF

ఏపీ మెగా డీఎస్సీ సిలబస్‌ని PDF రూపంలో ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 PDF

AP DSC 2024 సెకండరీ స్కూల్ టీచర్ పరీక్ష విధానం (AP DSC 2024 SGT Exam Pattern)

AP DSC 2024 SGT పరీక్ష విధానం దిగువున ఇచ్చిన పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నల సంఖ్య

మార్కులు

జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్

20

10

విద్యా దృక్పథాలు

20

10

తెలుగు కంటెంట్

18

09

తెలుగు మెథడ్స్

06

03

ఇంగ్లీష్ కంటెంట్

18

09

ఇంగ్లీష్ మెథడ్స్

06

03

మ్యాథ్స్ కంటెంట్

18

09

మ్యాథ్స్ మెథడ్స్

06

03

సైన్స్ కంటెంట్

18

09

సైన్స్ మెథడ్స్

06

03

సోషల్ కంటెంట్

18

09

సోషల్ మెథడ్స్

06

03

మొత్తం

160

80

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పరీక్ష విధానం ( AP DSC 2024 School Assistant Exam Pattern)

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ పరీక్ష విధానం క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.

సబ్జెక్టు

ప్రశ్నల సంఖ్య

మార్కులు

జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్

20

10

విద్యా దృక్పథాలు

10

05

చైల్డ్ డెవలప్మెంట్ & పెడాలజీ , సైకాలజీ లాంగ్వేజ్- 1

20

10

లాంగ్వేజ్ -1 ( ఆప్షనల్ ) తెలుగు/ఉర్దూ/కన్నడ / ఒరియా కంటెంట్

20

10

లాంగ్వేజ్ -1 మెథడాలజీ

10

05

లాంగ్వేజ్ -2 ఇంగ్లీష్ కంటెంట్

20

10

లాంగ్వేజ్ -2 మెథడాలజీ

10

05

గణితం కంటెంట్

20

10

గణితం మెథడాలజీ

10

05

సైన్స్ కంటెంట్

20

10

సైన్స్ మెథడాలజీ

10

05

సోషల్ కంటెంట్

20

10

సోషల్ మెథడాలజీ

10

05

మొత్తం

200

100

సంబంధిత కథనాలు ..
AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ AP DSC 2024 అర్హత ప్రమాణాలు
AP DSC 2024 నోటిఫికేషన్ AP DSC 2024 ఖాళీల జాబితా

AP DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ సిలబస్ ముఖ్యమైన టాపిక్స్ ( AP DSC 2024 SGT Syllabus Important Topics)

AP DSC 2024 SGT సిలబస్ (AP DSC 2024 SGT Syllabus) లో ముఖ్యమైన టాపిక్స్ ను క్రింది పట్టికలో సబ్జెక్టు ప్రకారంగా వివరంగా తెలుసుకోవచ్చు.
AP DSC 2024 SGT ముఖ్యమైన టాపిక్స్
భారతీయ విద్యారంగ చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత , వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు ప్రజాస్వామ్యము, విద్య, ఆరోగ్య , వ్యాయమ విద్య , సమ్మిళిత విద్య, తరగతి గది నిర్వహణ
సరళీకరణ విద్య, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విద్యా సంబంధ పథకాలు , ప్రాజెక్టులు , ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు,
చట్టాలు , హక్కులు, బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులు జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం, దృక్పధము, అభ్యసనం, జ్ఞానం, పాఠ్యాంశాలు, తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు.
బాలల వికాసము, వికాసము, పెరుగుదల & పరిణతి , భావన & స్వభావము, వికాస నియమాలు, శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, వైయక్తిక బేధాలు, వ్యక్తంతర బేధాలు, అంతర్ వ్యక్తి వైయక్తిక బేధాలు, ప్రజ్ఞ, స్వభావము , సిద్ధాంతాలు
AP DSC 2024 SGT తెలుగు సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
కవి పరిచయాలు, పాత్రలు, ఇతి వృత్తాలు, సందర్భాలు, నేపధ్యాలు, విద్యా ప్రమాణాలు పదజాలం, అర్ధాలు, పర్యాయ పదాలు , నానార్ధాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కధలు
భాషాఅంశాలు , విభక్తి ప్రత్నామ్యాలు, ఔప విభక్తికాలు, పారి భాషిక పదాలు, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు , వాక్యాలు తెలుగు భాష బోధనా, ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, భాష , సమాజమే, సాహిత్య ప్రక్రియలు, మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యత, బోధనా శాస్త్రం పై అవగాహనా, బోధనా పద్ధతులు, ప్రణాళికా రచన
AP DSC 2024 SGT ఇంగ్లీష్ సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
Poets, Essayists, Novelists, Forms of language, Story, Essay, Letter writing, Editorial, Pronunciation, Parts of Speech, Tenses, Types of sentences , Articles  and Prepositions Aspects of English, History, Nature, Importance, Principles, Objectives of Teaching English, Phonetics, Approaches, Metchods, Techniquies, Teaching of Structures and Vocabulary items, Lesson Planning, Evaluation in English language
AP DSC 2024 SGT గణితం సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
అర్దమాటిక్, నిత్య జీవితంలో గణితం, పూర్వ గణిత భావనలు, ద్రవ్యము , కాలము, సార్ధములు, లాభ నష్టాలు, కాలము పని, నిష్పత్తి , అనుపాతము , నిష్పత్తుల ఉపయోగాలు సంఖ్యా వ్యవస్థ, సంఖ్యలు, చతుర్విద ప్రక్రియలు, సంఖ్యలు అమరికలు, హిందూ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం, రౌండింగ్ ఆఫ్ నంబర్స్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు
రేఖా గణితము, ఆకారాలు, అవగాహన, ప్రాథమిక రేఖాగణిత భావనలు, రేఖలు, కోణాలు, సౌష్టవం, 3D , 2D అవగాహన, సరళ రేఖలు, కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు క్షేత్రమితి , పొడవు, వెడల్పు, పరిమాణము, చుట్టుకొలత, వైశాల్యము, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, వృత్తము
బీజ గణితము , సామాన్య సమీకరణాలు, రేఖా సమీకరణాలు, దత్తాంశ నిర్వహణ గణితం - స్వభావము,నిర్వచనాలు, బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, విద్యా ప్రణాళిక, మూల్యాంకనం , నిరంతర సమగ్ర మూల్యాంకనం.
AP DSC 2024 SGT సైన్స్ సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
సజీవ ప్రపంచం, నిర్జీవులు, జీవం , దాని లక్షణాలు, కుటుంబము, కుటుంబంలోని సభ్యులు , కుటుంబ నిర్మాణంలో మార్పు , స్నేహితులు, బంధుత్వాలు, పనులు, ఆటలు పరిశుబ్రత, మన ప్రదేశాలు, మన సంస్కృతులు, సూక్ష్మజీవుల ప్రపంచం, గాలి ప్రాముఖ్యత, సంఘటనము, వాతావరణ పీడనం, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, నివారణ చర్యలు, గాలి కాలుష్యం, కారణాలు, ప్రభావాలు, గ్రీన్ హౌస్ ప్రభావము, నీరు ప్రాముఖ్యత,, వనరులు, చెరువులు, ద్రవాలను కొలవడం, నీటి కాలుష్యం, నివారణ చర్యలు, కరువు, వరదలు, జల చక్రం.
వాతావరణం శీతోష్ణస్థితి, నేల మన జీవనము, వాన, వరదలు, తుఫానులు, విపత్తుల నిర్వహణ, ఆవాసం, జంతువులలో చలనం, జంతువుల నుండి ఆహారోత్పత్తి, మొక్కల నుండి ఆహారోత్పత్తి, వ్యవసాయ పనులు, పంటల నిర్వహణ, మొక్కలకు వచ్చే వ్యాధులు, నియంత్రణ, ఆహార ధాన్యాల పరిరక్షణ, జీవుల వర్గీకరణ, విజ్ఞాన శాస్త్ర విభాగాలు, సంకరీకరణము, ఆవరణ వ్యవస్థలు. జీవ ప్రక్రియలు, కణము, కణజాలం, వృక్ష కణ నిర్మాణం, శరీరంలోని అవయవాలు, అంతర్గత, బాహ్య, అవయవాలు, ఎముకలు, కండరాలు, జ్ఞానేంద్రియాలు, జంతువులలో వివిధ వ్యవస్థలు, మొక్కలలో పోషణ, జంతువులలో పోషణ, విసర్జన, శ్వాసక్రియ, మన ఆహారం, సంతులిత ఆహారం, పోషకాహార లోపం, మధ్యాహ్న భోజనం, గ్రీన్ రివల్యూషన్, ఆహారపు పిరమిడ్, జంక్ ఫుడ్, ప్రథమ చికిత్స
సహజ దృగ్విషయాలు, పదార్ధాలను వేరు చేయుట, వాతావరణ పీడనం, పదార్ధాలు, వస్తువులు, ద్రవాలను కొలవడం, ప్లాస్టిక్, లోహాలు , లోహాలు, పదార్ధము, ఆమ్లాలు, క్షారాలు, చలనము, కాలం, శక్తి, శక్తి రూపాలు, శక్తి వనరులు ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రతను కొలవడం, విద్యుత్ ప్రవాహం, విద్యుత్ వలయాలు, కరెంట్ , దాని ప్రభావాలు, ధ్వని, కాంతి పరివర్తనం, నీడలు, అయస్కాంతాలతో ఆటలు, ఘర్షణ, బలము, వేగము, వాడి, దహనము, ఇంధనాలు మాన్తా, వస్తువులను ఎలా కొలవాలి, నేలబొగ్గు, పెట్రోలియం, పెట్రోలియం ఉత్పన్నాలు
మన పర్యావరణం, జీవ వైవిద్యం, మొక్కలలో జీవ వైవిద్యం, జంతువులలో వైవిద్యం, మొక్కలు, చెట్లు, అంతరించిపోతున్న జాతులు, అడవులు, ఆటవిక జాతులు, వారి జీవన విధానం, అడవులలో వైవిద్యం, వివిధ ఆవరణ వ్యవస్థలు, ఏకాలజీ, బయోమాస్, జీవిక, నిర్జీవిక ప్రభావాలు, గ్లోబల్ వార్మింగ్, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణత, నక్షత్రాలు , సౌర కుటుంబం, నదులు, జీవ ప్రపంచం, గాలి, పవనము , భద్రతా చర్యలు విజ్ఞాన శాస్త్ర భావన, స్వభావము, పరిధి , విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి, విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలు , స్పష్టీకరణలు, విజ్ఞానశాస్త్రంలో విద్యా ప్రమాణాలు, విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతులు, వ్యూహాలు, బోధనా అభ్యస పరికరాలు, విజ్ఞాన శాస్త్ర ప్రణాళిక, పాఠ్య పుస్తకము, అంచనా , మూల్యాంకనం, సైన్సు ప్రయోగ శాలలు , సైన్స్ ఫెయిర్, సైన్స్ క్లబ్, క్షేత్ర పర్యటనలు , మ్యూజియాలు
AP DSC 2024 SGT సోషల్ స్టడీస్ సబ్జెక్టు ముఖ్యమైన టాపిక్స్
భూమి, వైవిధ్యం, మాన చిత్రాల అధ్యయనం, తయారీ, వివిధ రకాల పాఠాలను అర్ధం చేసుకోవడం, గ్లోబు, భూమికి ఒక నమూనా , ఆంధ్రప్రదేశ్ ప్రధాన భూ స్వరూపాలు, కృష్ణ డెల్టాలోని ఒక గ్రామము, కొండల మీద ఉన్న గిరిజన గ్రామాలు, వర్షము, నదులు, చెరువులు, భూగర్భ జలాలు, మహాసముద్రాలు, చేపలు పట్టడం, యూరప్, ఆఫ్రికా, సూర్యుడు శక్తి వనరు, భూమి, భూ చలానాలు , ఖనిజాలు, అడవులు వినియోగం, గనుల త్రవ్వకం, సూర్యుడు , గ్రహాలు ఉత్పత్తి, వినిమయం, ప్రాచీన మానవులు, ఆహారాన్వేషణ, వ్యవసాయం, నేటి వ్యయవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు, పారిశ్రామిక విప్లవం, ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగితపు పరిశ్రమ, రవాణా వ్యవస్థ ప్రాధాన్యత, భద్రతా చర్యలు, ద్రవ్యము, బ్యాంకింగ్, జీవనోపాధులు, సాంకేతిక విజ్ఞాన ప్రభావం, ప్రజారోగ్యం, ప్రభుత్వం.
రాజకీయ వ్యవస్థలు, పరిపాలన, తెగలు, సామజిక నిర్ణయ అధికారం, సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, మొదటి సామ్రాజ్యాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వం, గ్రామ పంచాయితీ, పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన, కొత్త రాజ్యాలు, రాజులు, ప్రాతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు, విజయనగర రాజులు, మొఘల్ సామ్రాజ్యమ్, బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన, బ్రిటీష్, నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు, జాతీయోద్యమం తొలిదశ, జాతీయోద్యమం మలిదశ, హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం,భారత రాజ్యాంగం, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభలో చట్టాల తయారీ, జిలాల్లో చట్టాల అమలు, చట్టము , న్యాయము.
సామజిక వ్యవస్తీకరణ,అసమానతలు, సమాజాల్లో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం, కుల వివక్ష, జీవనాధారం, జమీందారీ వ్యవస్థ రద్దు, పేదరికం అవగాహన, హక్కులు, అభివృద్ధి మతం, సమాజం, ప్రాచీన కాలంలో మతం, దేవుని యందు ప్రేమ, భక్తి, జానపదులు, దైవసంబంధ భక్తి మార్గాలు, సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, లౌకికత్వం, అవగాహన.
సంస్కృతి, సమాచారం, భాష , లిపి, గొప్ప గ్రంధాలు, శిల్పం, కట్టడాలు, రాజులు, కట్టడాలు, ఆధునిక కాలంలో కళలు, కళాకారులు, సినిమా, ముద్రణా మాధ్యమాలు, క్రీడలు, జాతీయత, వాణిజ్యం, చారిత్రాత్మక ప్రదేశాలు, కోటలు , మన దేశము, ప్రపంచము, మన రాజ్యాంగము, బాలల హక్కులు, భారతదేశ చరిత్ర , సంస్కృతి సాంఘీక శాస్త్ర స్వభావము, పరిధి, చరిత్ర , అభివృద్ధి, సాంఘికా శాస్త్ర బోధనా లక్ష్యాలు , స్పష్టీకరణలు, సాంఘీక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు, సాంఘీక శాస్త్ర బోధనా పద్ధతులు, వ్యూహాలు, బోధనా అభ్యాస పరికరాలు, ఆధునీకరించబడిన బోధనా పరికరాలు, సాంఘీక శాస్త్రం విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకము, అంచనా , మూల్యాంకనం, సాంఘీక శాస్త్ర ప్రయోగశాలలు, సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయ్యుడు , సాంఘీక శాస్త్ర ఫెయిర్లు, క్షేత్ర పర్యటనలు, మ్యూజియాలు.

AP DSC 2024 ప్రిపరేషన్ టిప్స్ ( AP DSC 2024 Preparation Tips)

AP DSC 2024 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ క్రింది టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.
  • కరెంట్ అఫైర్స్ నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి.
  • జనరల్ నాలెడ్జ్ అంశాల మీద పట్టు కలిగి ఉండాలి, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి.
  • AP DSC 2024 సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
  • ప్రతీ సబ్జెక్టు యొక్క మెథడాలజీ కూడా ఖచ్చితంగా చదవాలి.

AP DSC 2024 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

FAQs

AP DSC 2023 స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ కు సిలబస్ ఒకటేనా?

లేదు, AP DSC 2023 సిలబస్ స్కూల్ అసిస్టెంట్ కు సెకండరీ గ్రేడ్ టీచర్ కు భిన్నంగా ఉంటుంది.

AP DSC 2023 సిలబస్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు?

AP DSC 2023 సిలబస్ ను ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్టర్ లింక్ ద్వారా PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP DSC సిలబస్ సెకండరీ గ్రేడ్ టీచర్ మరియు స్కూల్ అసిస్టెంట్ కు ఒకటేనా?

లేదు, AP DSC సిలబస్ సెకండరీ గ్రేడ్ టీచర్ కు మరియు స్కూల్ అసిస్టెంట్ కు భిన్నంగా ఉంటుంది.

AP DSC సిలబస్ ను నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు?

AP DSC 2023 సిలబస్ ను ఈ ఆర్టికల్ లో ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP DSC నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?

AP DSC 2023 నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

/articles/ap-dsc-syllabus/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All
Top