- AP EAMCET 2024 అప్లికేషన్ తేదీలు (AP EAPCET/ EAMCET 2024 Application …
- AP EAMCET 2024 అర్హత ప్రమాణాలు : ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? (AP …
- AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు (Documents …
- AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఎలా పూర్తి చేయాలి? (How to …
- AP EAMCET 2024 రిజిస్ట్రేషన్ ఫీజు (AP EAMCET 2024 Registration Fee)
- AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? (How to …
- AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో (AP EAMCET 2024 …
- AP EAMCET 2024 హాల్ టికెట్ (AP EAMCET 2024 Hall Ticket)
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ( AP EAMCET 2024 Application Form)
: AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ను జవహార్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యునివర్సిటీ కాకినాడ ( JNTUK) అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in లో విడుదల చేస్తుంది.
AP EAMCET
పేరును ఇప్పుడు అధికారికంగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( EAPCET) గా మార్చారు.
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్
(AP EAMCET 2024 Application Form) ఏప్రిల్, 2024 లో విడుదల చేయబడుతుంది. విద్యార్థులు ఆన్లైన్ లో ఈ అప్లికేషన్ ను పూర్తి చేయవచ్చు. ఈ అప్లికేషన్ కోసం విద్యార్థులు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
ఇది కూడా చదవండి:
ఈరోజే ఏపీ ఎంసెట్ బైపీసీ సీట్ల కేటాయింపు జాబితా రిలీజ్, ఇలా ఒక క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ (AP EAMCET 2024 Application Form) పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు, విద్యార్థుల యొక్క వివరాలు పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవడం మొదలైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనాలు
AP EAMCET 2024 అప్లికేషన్ తేదీలు (AP EAPCET/ EAMCET 2024 Application Form Dates)
AP EAMCET 2024 అప్లికేషన్ త్వరలో విడుదల అవుతుంది. విద్యార్థులు AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ తేదీలను క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
---|---|
AP EAMCET 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం | తెలియాల్సి ఉంది |
AP EAMCET అప్లికేషన్ ఫార్మ్ 2024 చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ . 500 ఆలస్య రుసుముతో | తెలియాల్సి ఉంది |
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ . 1000 ఆలస్య రుసుముతో | తెలియాల్సి ఉంది |
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ . 5000 ఆలస్య రుసుముతో | తెలియాల్సి ఉంది |
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ . 10000 ఆలస్య రుసుముతో | తెలియాల్సి ఉంది |
AP EAMCET హాల్ టికెట్ 2024 విడుదల | తెలియాల్సి ఉంది. |
AP EAMCET 2024 పరీక్ష | తెలియాల్సి ఉంది |
AP EAMCET 2024 అర్హత ప్రమాణాలు : ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? (AP EAMCET 2024 Eligibility Criteria)
AP EAMCET 2024 కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. ఆ అర్హత ప్రమాణాల జాబితా క్రింద ఇవ్వబడింది
- విద్యార్థులు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూ ఉండాలి లేదా ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.
- విద్యార్థుల కనీస వయసు డిసెంబర్ 31, 2023 నాటికి 16 సంవత్సరాలు ఉండాలి
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు (Documents required to fill AP EAMCET 2024 Application Form)
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి ఈ క్రింద పట్టిక లో ఉన్న డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
క్రమసంఖ్య. | డీటైల్స్ | అవసరమైన డాక్యుమెంట్లు |
---|---|---|
1 | AP ఆన్‌లైన్/ TS ఆన్‌లైన్ ఐడి (లావాదేవీ ఆన్‌లైన్ మోడ్ ద్వారా జరిగితే) | AP ఆన్‌లైన్/ TS ఆన్‌లైన్ రసీదు ఫారమ్ |
2 | అర్హత పరీక్ష యొక్క హాల్ టికెట్ నంబర్ | మార్కులు మెమో లేదా ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్ |
3 | స్ట్రీమ్ దరఖాస్తు (ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్) | AP EAMCET 2024 లో అర్హత ప్రమాణాలను బట్టి |
4 | పుట్టిన రాష్ట్రం మరియు అభ్యర్థి పుట్టిన జిల్లాతో పాటు పుట్టిన తేదీ | జనన ధృవీకరణ పత్రం, SSC లేదా ఏదైనా ఇతర సమానమైన సర్టిఫికేట్ |
5 | SSC యొక్క హాల్ టిక్కెట్ నంబర్ లేదా తత్సమాన పరీక్ష సర్టిఫికేట్ | SSC లేదా తత్సమాన సర్టిఫికేట్ |
6 | అభ్యర్థి యొక్క స్థానిక సర్టిఫికేట్ (OU/AU/SVU/నాన్-లోకల్) | సంబంధిత అధికారి లేదా MRO ద్వారా జారీ చేయబడిన స్థానిక ప్రమాణపత్రం. |
7 | తల్లిదండ్రుల ఆదాయం | సంబంధిత అధికారి ద్వారా జారీ చేయబడిన ఆదాయ ధృవీకరణ పత్రం |
8 | విద్యార్థి స్టడీ డీటైల్స్ | 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు |
9 | అభ్యర్థి కుల ధృవీకరణ పత్రం యొక్క వర్గం మరియు దరఖాస్తు సంఖ్య | సంబంధిత అధికారి జారే చేసిన కుల ధృవీకరణ పత్రం |
10 | అభ్యర్థి స్పోర్ట్స్ లేదా NCC, PH, CAP మొదలైన ప్రత్యేక వర్గానికి చెందిన వారైతే | సంబంధిత అధికారి జారే చేసిన ధ్రువీకరణ పత్రం |
11 | ఆధార్ కార్డ్ డీటెయిల్స్ | ఆధార్ కార్డు |
12 | రేషన్ కార్డ్ డీటెయిల్స్ | రేషన్ కార్డు |
13 | ఆర్థికంగా బలహీన వర్గాల సర్టిఫికెట్ డీటెయిల్స్ | ఆర్థికంగా బలహీన వర్గాల సర్టిఫికెట్ |
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ఎలా పూర్తి చేయాలి? (How to fill AP EAMCET 2024 Application Form ?)
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తారు, విద్యార్థులు ఆన్లైన్ లో మాత్రమే ఈ అప్లికేషన్ ను పూర్తి చేయగలరు. AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ ను పూర్తి చేయడానికి విద్యార్థులు ఈ క్రింది స్టెప్స్ ను అనుసరించాలి.
స్టెప్ 1 : AP EAMCET అధికారిక వెబ్సైట్ sche.ap.gov.in ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2 : AP EAMCET అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
స్టెప్ 3 : అప్లికేషన్ ఫార్మ్ లో విద్యార్థి పేరు, వ్యక్తిగత వివరాలు పూర్తి చేయాలి.
స్టెప్ 4 : ఈ క్రింది వివరాలను అప్లికేషన్ ఫార్మ్ లో పూర్తి చేయండి.
- విద్యార్థి పేరు
- తండ్రి పేరు
- తల్లి పేరు
- జెండర్
- డేట్ ఆఫ్ బర్త్
- రాష్ట్రము
- జిల్లా
- ఆధార్ కార్డు నెంబర్
- తల్లి తండ్రుల వార్షిక ఆదాయం
- విద్యార్థి కేటగిరీ
- విద్యార్థి బ్యాంక్ అకౌంట్ డీటైల్స్
- చిరునామా
- ఫోన్ నెంబర్
- ఈమెయిల్ ఐడి
అర్హత పొందిన పరీక్ష వివరాలు : AP EAMCET 2024 పరీక్ష కు అప్లై చేసే విద్యార్థులు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు చదివిన సంవత్సరం, కళాశాల, మీడియం మొదలైన వివరాలు పూర్తి చేయాలి
CET డీటైల్స్ : విద్యార్థి ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి మరియు విద్యార్థికి కావాల్సిన ఎగ్జామ్ సెంటర్ జిల్లా ను ఇక్కడ ఎంచుకోవచ్చు.
గమనిక : విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కోసం ఏవైనా రెండు జిల్లాలను ఎంచుకోవచ్చు.
ఫోటో మరియు సంతకం స్పెసిఫికేషన్స్
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి అప్లోడ్ చేయవలసిన ఫోటో మరియు సంతకం స్పెసిఫికేషన్ క్రింద పట్టిక లో తెలుసుకోవచ్చు.
ఫైల్ | పరిమాణం | ఫైల్ ఫార్మాట్ |
---|---|---|
అభ్యర్థి ఫోటో | 30 KB కంటే తక్కువ | JPG |
అభ్యర్థి సంతకం | 15 KB కంటే తక్కువ | JPG |
ఈ మొత్తం వివరాలను విద్యార్థులు పూర్తి చేసిన తర్వాత ' Submit' మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు విద్యార్థులకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ ను విద్యార్థులు డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
AP EAMCET 2024 రిజిస్ట్రేషన్ ఫీజు (AP EAMCET 2024 Registration Fee)
AP EAMCET 2024 రిజిస్ట్రేషన్ ఫీజు వివిధ కేటగిరీ విద్యార్థులకు వివిధ రకాలుగా ఉంది. విద్యార్థులు వారి కేటగిరీ ప్రకారంగా క్రింది పట్టిక లో ఫీజు వివరాలను తెలుసుకోవచ్చు.
స్ట్రీమ్ | ఓపెన్ కేటగిరీ (OC) | ఇతర వెనుకబడిన తరగతులు (OBC) | షెడ్యూల్డ్ కులం (SC) / షెడ్యూల్డ్ తెగలు (ST) |
---|---|---|---|
ఇంజనీరింగ్ | రూ. 600 | రూ. 550 | రూ. 500 |
అగ్రికల్చర్ | రూ. 600 | రూ. 550 | రూ. 500 |
రెండు | రూ. 1200 | రూ. 1100 | రూ. 1000 |
గమనిక : విద్యార్థులు ఫీజు చెల్లించిన రిశిప్ట్ ను ప్రింట్ అవుట్ తీసి జాగ్రత్త చేసుకోవాలి.
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? (How to check AP EAMCET 2024 Application Form status?)
విద్యార్థులు AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేసిన 72 గంటల తర్వాత ట్రాకింగ్ సిస్టం అప్డేట్ చేయబడుతుంది. AP EAMCET అధికారిక వెబ్సైట్ లో " Track Application Status" మీద క్లిక్ చేసి విద్యార్థులు వారి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
విద్యార్థులు వారి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో (AP EAMCET 2024 Application Form Correction Window )
విద్యార్థులు AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో ఏవైనా తప్పు వివరాలు ఇచ్చి ఉంటే , అధికారులు కరెక్షన్ విండో ఓపెన్ చేసిన సమయంలో ఆ తప్పులను సరి చేసుకోవచ్చు. AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ను అనుసరించాలి.
- AP EAMCET 2024 కరెక్షన్ విండో ఓపెన్ చేయండి.
- అప్లికేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు ఓపెన్ అయిన మీ అప్లికేషన్ ఫార్మ్ లో ఉన్న తప్పులను సరి చేసుకోండి.
- తర్వాత ' Submit ' మీద క్లిక్ చేయండి.
AP EAMCET 2024 హాల్ టికెట్ (AP EAMCET 2024 Hall Ticket)
AP EAMCET 2024 హాల్ టికెట్ మే 2024 లో విడుదల చేయబడుతుంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి వారి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. AP EAMCET 2024 పరీక్షకు హాజరు అవ్వాలి అంటే హాల్ టికెట్ తప్పని సరిగా తీసుకుని వెళ్ళాలి.
ఇది కూడా చదవండి
AP EAMCET 2024 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
VITEEE 2025 పరీక్ష రోజు పాటించవలసిన సూచనలు (VITEEE Exam Day Instructions) ముఖ్యమైన నిబంధనలు ఏమిటో చూడండి.
VITEEE 2025 ముఖ్యమైన అంశాలు (VITEEE 2025 Important Topics in Telugu) మంచి పుస్తకాల జాబితా, స్కాలర్షిప్ డీటెయిల్స్ , ప్లేస్మెంట్ ట్రెండ్లు
AP ECET మెకానికల్ ఇంజనీరింగ్ 2025 సిలబస్ (AP ECET Mechanical Engineering Syllabus 2025) వెయిటేజీ, మాక్ టెస్ట్, ప్రశ్నపత్రం, ఆన్సర్ కీ
JEE మెయిన్ 2025 అడ్మిట్ కార్డులో (JEE Main 2025 Admit Card) తప్పులని సరి చేసుకునే విధానం
JEE మెయిన్ 2025 రివిజన్ టిప్స్ (JEE Main 2025 Revision Tips) నోట్స్, ప్రిపరేషన్ ప్లాన్, మంచి స్ట్రాటజీ
JEE మెయిన్ 2024 హెల్ప్‌లైన్ నంబర్ (JEE Main 2024 Helpline Number) - కేంద్రం, ఫోన్ నంబర్, చిరునామా