AP EAPCET BiPC Counselling Process 2023: ఏపీ ఎంసెట్ 2023 బైపీసీ కౌన్సెలింగ్, ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: June 20, 2023 02:19 PM | AP EAMCET

ఏపీ ఈఏపీసెట్ 2023 (AP EAPCET BiPC Counselling Process 2023) కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో విడుదల కానుంది. APSCHE  ఆధ్వర్యంలో ఏపీ ఈఏపీ‌సెట్ బైపీసీ విభాగానికి సంబంధించిన కౌన్సెలింగ్ జరుగుతుంది. 

AP EAPCET Bi.P.C Counselling Process 2021

ఏపీ ఈఏపీసెట్ బైపీసీ  కౌన్సెలింగ్ 2023  విధానం (AP EAPCET BiPC Counselling Process 2023): ఏపీ ఈఏపీ‌సెట్ బైపీసీకి సంబంధించిన పరీక్షలు మే 15 నుంచి 19 తేదీల్లో జరిగాయి. సంబంధిత ఫలితాలు, ర్యాంక్ కార్డులు  జూన్ 14న, 2023న విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇప్పటికే తమ ర్యాంకులను చెక్ చేసుకున్నారు. ప్రస్తుతం అందరూ కౌన్సెలింగ్ తేదీల గురించి ఎదురు చూస్తున్నారు.

JNTU కాకినాడ BiPC స్ట్రీమ్ కింద స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, సీట్ల కేటాయింపు కోసం AP EAPCET వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. BiPC స్ట్రీమ్ AP EAPCET వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2023 (AP EAPCET BiPC Counselling Process 2023) నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల అవుతుంది. ముందుగా MPC కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. అవి ముగిసిన తర్వాత, APSCHE BiPC కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఏపీ ఎంసెట్‌లో అర్హత మార్కులు ఇవే

ఏపీ ఈఏపీసెట్ లేదా ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ ప్రక్రియను (AP EAPCET BiPC Counselling Process 2023) సాంకేతిక విద్యా శాఖ ఆంధ్రప్రదేశ్, APSCHE కొన్ని ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోరుకునే ర్యాంక్ హోల్డర్ల కోసం నిర్వహిస్తుంది. AP EAPCET Bi.P.C కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా అభ్యర్థులు AP EAMCET భాగస్వామ్య కళాశాలలు అందించే కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు  ఈ దిగువున అందించడం జరిగింది.

  • BE/B.Tech బయోటెక్నాలజీ

  • ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్

  • బీ ఫార్మా

  • ఫార్మ్-డీ

APSCHE వారి అధికారిక వెబ్‌సైట్‌లో AP EAPCET 2023 BI.PC కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించడం జరుగుతుంది. ఈ సంవత్సరం  బైపీసీ స్ట్రీమ్ AP EAPCET వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2023 నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల అవుతుంది.  2023కు సంబంధించిన AP EAMCET Bi.PC కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్‌ని ఇక్కడ అందజేశాం.

ఇది కూడా చదవండి: ఏపీ ఎంసెట్ ఫలితాల డైరక్ట్ లింక్ ఇదే

AP EAPCET Bi.PC కౌన్సెలింగ్ 2023 ముఖ్యాంశాలు (AP EAPCET Bi.P.C Counselling 2023 Highlights)

APSCHE AP EAPCET Bi.PC కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమైన వివరాలను ఈ దిగువన పట్టికలో అందజేశాం.

ప్రక్రియ పేరు

AP EAPCET (EAMCET) Bi.PC కౌన్సెలింగ్ ప్రక్రియ 2023

ప్రయోజనం

AP EAMCET ర్యాంక్ హోల్డర్లకు ఇంజనీరింగ్, ఫార్మసీలో కోర్సుల్లో అడ్మిషన్లు

కండక్టింగ్ బాడీ

APSCHE, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్

కోర్సులు

  • BE/B.Tech బయోటెక్నాలజీ

  • ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్

  • బీఫార్మా

  • ఫార్మ్-డీ

రిజిస్ట్రేషన్లు ప్రారంభం

తెలియాల్సి ఉంది

అడ్మిషన్ ప్రక్రియ ముగుస్తుంది

తెలియాల్సి ఉంది

పాల్గొనే కళాశాలల రకాలు

  • విశ్వవిద్యాలయం & ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద యూనివర్సిటీ & ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలు

AP EAPCET Bi.PC కౌన్సెలింగ్ ప్రక్రియ ముఖ్యమైన తేదీలు 2023 (AP EAPCET Bi.P.C Counselling Process Important Dates 2023)

ఈ సంవత్సరం AP EAPCET (EAMCET) Bi.PC కౌన్సెలింగ్ ప్రక్రియ  వివరణాత్మక షెడ్యూల్ ఈ దిగువున పట్టికలో అందజేయడం జరిగింది.

ఈవెంట్

ముఖ్యమైన తేదీలు

రిజిస్ట్రేషన్ ప్రారంభం, ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు, ఆన్‌లైన్  సర్టిఫికెట్ వెరిఫికేషన్

జూలై, 2023 (అంచనా)

నోటిఫైడ్ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల ఆన్‌లైన్ వెరిఫికేషన్

తెలియాల్సి ఉంది

అర్హత కలిగిన నమోదిత అభ్యర్థులచే వెబ్ ఎంపికలు

తెలియాల్సి ఉంది

అభ్యర్థుల ఎంపికలో మార్పు

తెలియాల్సి ఉంది

సీటు కేటాయింపు

ఆగస్ట్, 2023 (అంచనా)

కళాశాలలో స్వీయ రిపోర్టింగ్

తెలియాల్సి ఉంది

AP EAPCET Bi.PC కౌన్సెలింగ్ అర్హత ప్రమాణాలు 2023 (AP EAPCET Bi.P.C Counselling Eligibility Criteria 2021)

AP EAPCET Bi.PC కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం అర్హత ప్రమాణాలు ఈ దిగువున తెలియజేయడం జరిగింది.

కార్యక్రమం

అర్హత షరతులు

B.Tech Biotechnology

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ ప్రభుత్వం నుంచి 10+2 అర్హత కలిగి ఉండాలి

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్వాలిఫైయింగ్ పరీక్ష స్థాయిలో తప్పనిసరిగా చదివి ఉండాలి

  • దరఖాస్తుదారులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

B.Pharm

  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ నుంచి 10+2 అర్హత కలిగి ఉండాలి

  • అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని క్వాలిఫైయింగ్ పరీక్ష స్థాయిలో ఐచ్ఛికంగా చదివి ఉండాలి

  • అడ్మిషన్ ప్రారంభమయ్యే తేదీ నాటికి దరఖాస్తుదారులు కనీసం 16 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి

Pharm.D

  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ నుంచి 10+2 అర్హత కలిగి ఉండాలి లేదా తత్సమానం లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫార్మసీలో డిప్లొమా కలిగి ఉండాలి

  • దరఖాస్తుదారులు పైన పేర్కొన్న సబ్జెక్టులలో మొత్తంగా కనీసం 45% పొంది ఉండాలి

  • అడ్మిషన్ సమయానికి దరఖాస్తుదారులు సంవత్సరం డిసెంబర్ 31 నాటికి కనీసం 17 సంవత్సరాల వయస్సు ఉండాలి.

AP EAPCET Bi.PC కౌన్సెలింగ్ ప్రాసెస్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply for AP EAPCET Bi.P.C Counselling Process 2023)

AP EAPCET (EAMCET) 2021 Bi.PC కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులను ఈ దిగువున అందజేయడం జరిగింది.

  1. ఏపీ ఎంసెట్‌లో  Bi.PC అడ్మిషన్ కోసం సాంకేతిక విద్యా శాఖ, అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.

  2. వెబ్‌సైట్ హోంపేజీలో అభ్యర్థి నమోదు - అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.

  3. మీ EAPCET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి

  4. తర్వాత  అభ్యర్తులు ధ్రువీకరించిన అన్ని ఆధారాలతో కూడిన మీ EAPCET రిజిస్ట్రేషన్ ఫార్మ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది

  5. మీ AP EAPCET రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఇచ్చిన మొత్తం వివరాలను ధ్రువీకరించాలి.

  6. తర్వాత “సెల్ఫ్ డిక్లరేషన్” బాక్స్‌పై క్లిక్ చేయాలి

  7. ఫీజు పేమెంట్ గేట్ వే పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది. అక్కడ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి

  8. మళ్లీ “సెల్ఫ్ డిక్లరేషన్” బాక్స్‌పై క్లిక్ చేయాలి

  9. భవిష్యత్తు సూచన కోసం ఫీజు సబ్మిట్ రసీదు ప్రింటవుట్ తీసుకోవాలి.

AP EAPCET Bi.PC కౌన్సెలింగ్ అప్లికేషన్/ప్రాసెసింగ్ ఫీజు 2023 (AP EAPCET Bi.P.C Counselling Application/Processing Fee 2023)

AP EAPCET (EAMCET) Bi.PC కౌన్సెలింగ్ ప్రాసెస్ దరఖాస్తుదారుల కోసం అప్లికేషన్ లేదా ప్రాసెసింగ్ ఫీజు జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులకు రూ.1200లు,. SC, ST వంటి ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు అదే రూ. 600లు.

AP EAPCET Bi.PC వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ 2023 కోసం అవసరమైన పత్రాలు (Documents Required for AP EAPCET Bi.P.C Web Counselling Process 2023)

AP EAPCET Bi.PC వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు అభ్యర్థులు ఈ దిగువున తెలియజేసిన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.

  • AP EAPCET 2023 ర్యాంక్ కార్డ్

  • AP EAPCET 2023 హాల్ టికెట్

  • మార్కులు మెమోరాండమ్ (ఇంటర్మీడియట్ లేదా తత్సమానం)

  • బర్త్ సర్టిఫికెట్  (పదో తరగతి మార్క్స్ షీట్, DOB సర్టిఫికెట్)

  • బదిలీ సర్టిఫికెట్

  • స్టడీ సర్టిఫికెట్ క్లాస్ VIth నుంచి  క్లాస్ XIIth వరకు

  • EWS సర్టిఫికెట్ (వర్తిస్తే)

  • తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)

  • స్థానిక స్థితి ప్రమాణపత్రం (వర్తిస్తే)

  • ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ (BC/SC/ST - వర్తిస్తే)

  • క్వాలిఫైయింగ్ పరీక్షకు ముందు ఏడు సంవత్సరాలకు నివాస ధ్రువీకరిణ పత్రం అంటే ఇంటర్ లేదా ప్రైవేట్ అభ్యర్థులకు సమానమైనది

  • స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి తహశీల్దార్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెలుపల ఉద్యోగ కాలాన్ని మినహాయించి 10 సంవత్సరాల కాలానికి తండ్రి/తల్లి యొక్క ఆంధ్రప్రదేశ్ నివాస ధ్రువీకరణ పత్రం

ఏపీ ఈఏపీసెట్ బైపీసీ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ ఫిల్లింగ్ ప్రాసెస్ 2023 (AP EAPCET Bi.P.C Counselling Web Option Filling Process 2023)

AP EAPCET Bi.PC వెబ్ ఎంపికలను పూరించే విధానాన్ని ఈ దిగువున అందజేయడం జరిగింది.

  1. అభ్యర్థులు AP EAPCET అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  2. AP EAPCET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి

  3. మీ మొబైల్ నెంబర్‌ని నమోదు చేయాలి. తర్వాత  మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది దానిని నమోదు చేయాలి.

  4. తర్వాత ఫార్మ్‌లో అందుబాటులో ఉన్న జిల్లాల జాబితా నుంచి మీ ఛాయిస్  జిల్లాను ఎంచుకోవాలి

  5. అందుబాటులో ఉన్న కాలేజీల జాబితా నుంచి మీ ఛాయిస్ కాలేజీలను ఎంచుకోవాలి.

  6. మీ ఎంపికలను నమోదు చేసిన తర్వాత 'సేవ్' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తమ కాలేజీాల ఎంపికల గురించి కచ్చితంగా తెలియని అభ్యర్థులకు 'ఫ్రీజ్' ఎంపిక కూడా అందుబాటులో ఉంది

  7. భవిష్యత్ అవసరాల నిమిత్తం సేవ్ చేసిన వెబ్ ఎంపికల ప్రింట్‌అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

AP EAPCET Bi.PC సీట్ల కేటాయింపు ప్రక్రియ 2023 (AP EAPCET Bi.P.C Seat Allotment Process 2023)

APSCHE రెండు రౌండ్ల AP EAPCET Bi.PC సీట్ల కేటాయింపు ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు వారి సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయించబడతాయి.  AP EAPCET Bi.PC అడ్మిషన్ల సీట్ల కేటాయింపు ప్రక్రియను ఈ కింద తెలిపిన విధంగా వర్గీకరించవచ్చు -

  1. సీట్ల కేటాయింపు జాబితా విడుదల

  2. అడ్మిషన్ ఫీజు చెల్లింపు

  3. అభ్యర్థులు సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేయడం

  4. అభ్యర్థులు వారి సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయడం

  5. ధ్రువీకరణ కోసం అన్ని ఒరిజినల్ పత్రాలు సబ్మిట్ చేయడం


మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం College Dekho ని ఫాలో అవ్వండి

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/ap-eapcet-eamcet-bipc-counselling/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Pharmacy Colleges in India

View All
Top