- ఏపీ గ్రామ సచివాలయం 2024 పరీక్ష తేదీలు (AP Grama Sachivalayam 2024 …
- ఏపీ గ్రామ సచివాలయం 2024 అర్హత ప్రమాణాలు (AP Grama Sachivalayam 2024 …
- ఏపీ గ్రామ సచివాలయం అప్లికేషన్ ప్రాసెస్ 2024 (AP Grama Sachivalayam 2024 …
- ఏపీ గ్రామ సచివాలయం 2024 పోస్టుల వివరాలు (AP Grama Sachivalayam 2024 …
- ఏపీ గ్రామ సచివాలయం 2024 హాల్ టికెట్ (AP Grama Sachivalayam 2024 …
- ఏపీ గ్రామ సచివాలయం 2024 ఆన్సర్ కీ (AP Grama Sachivalayam 2024 …
- ఏపీ గ్రామ సచివాలయం 2024 సెలక్షన్ ప్రాసెస్ (AP Grama Sachivalayam 2024 …
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2024 ( AP Grama Sachivalayam Notification 2024 ) : ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయం లో ఉన్న ఖాళీలను మరియు సచివాలయం కు సంబంధించిన ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14,000 కు పైగా పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ( AP Grama Sachivalayam Notification 2024 in Telugu) విడుదల అవుతుంది. గ్రామ సచివాలయం పరీక్ష ప్రతీ సంవత్సరం జరగదు, కేవలం సచివాలయం పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహిస్తుంది. ఏపీ గ్రామ సచివాలయం కు సంబందించిన పరీక్ష తేదీలు (AP Grama Sachivalayam 2024 Exam Dates) సమాచారం కూడా త్వరలో అధికారికంగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2024 నెలలో జాబ్ క్యాలెండర్ తో పాటుగా గ్రామ సచివాలయం నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుండే వారి ప్రిపరేషన్ ను ప్రారంబించడం అవసరం.
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2024 (AP Grama Sachivalayam Notification 2024) కు సంబందించిన ఖాళీలు, పరీక్ష తేదీలు, ఎలిజిబిలిటీ మొదలైన వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి -
ఏపీ గ్రామ సచివాలయం సిలబస్ 2024
ఏపీ గ్రామ సచివాలయం 2024 పరీక్ష తేదీలు (AP Grama Sachivalayam 2024 Exam Dates)
ఏపీ గ్రామ సచివాలయం 2024 కు సంబంధించిన పోస్టుల ఖాళీల వివరాలు మరియు పరీక్ష తేదీలు(AP Grama Sachivalayam 2024 Exam Dates) ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
పోస్ట్ పేరు | అప్లికేషన్ ప్రారంభ తేదీ | అప్లికేషన్ ముగింపు తేదీ | పరీక్ష తేదీ | ఖాళీ సంఖ్య (అంచనా) |
---|---|---|---|---|
పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్ -V ) Panchayat Secretary (Grade-V) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 61 |
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( గ్రేడ్ -II ) Village Revenue Officer (Grade-II) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 246 |
ఏ.ఎన్.ఎం (గ్రేడ్ -III ) ANMs (Grade-III) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 648 |
యానిమల్ హుస్బెండరీ అసిస్టెంట్ Animal Husbandry Assistant | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 6858 |
ఫిషరీస్ అసిస్టెంట్ Fisheries Assistant | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 69 |
హార్టికల్చర్ అసిస్టెంట్ Horticulture Assistant | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 1783 |
అగ్రికల్చర్ అసిస్టెంట్ ( గ్రేడ్ -II ) Agriculture Assistant (Grade-II) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 536 |
సెరికల్చర్ అసిస్టెంట్ Sericulture Assistant | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 43 |
మహిళా పోలీస్ అండ్ వుమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్
వార్డ్ వుమెన్ & వీకెర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ ( ఫీమేల్ ) Ward Women & Weaker Sections Protection Secretary (Female) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 762 |
ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ -II) Engineering Assistant (Grade-II) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 570 |
పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ -VI ) డిజిటల్ అసిస్టెంట్
| తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 1134 |
విలేజ్ సర్వేయర్ ( గ్రేడ్-III) Village Surveyor (Grade-III) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 1255 |
వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ Welfare and Education Assistant | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 97 |
వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ Ward Administrative Secretary | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 105 |
వార్డ్ ఆమెనిటీస్ సెక్రటరీ ( గ్రేడ్ -II ) Ward Amenities Secretary (Grade-II) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 371 |
వార్డ్ శానిటేషన్ & ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్ -II )
Ward Sanitation & Environment Secretary (Grade-II) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 513 |
వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రోసెసింగ్ సెక్రటరీ
Ward Education & Data Processing Secretary | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 100 |
వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ ( గ్రేడ్ -II )
Ward Planning & Regulation Secretary (Grade-II) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 844 |
వార్డ్ వెల్ఫేర్ & డెవెలప్మెంట్ సెక్రటరీ ( గ్రేడ్ - II )
Ward welfare & Development secretary (Grade-II) | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | తెలియాల్సి ఉంది | 213 |
ఏపీ గ్రామ సచివాలయం 2024 అర్హత ప్రమాణాలు (AP Grama Sachivalayam 2024 Eligibility Criteria)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2024 ( AP Grama Sachivalayam Notification 2024 )కు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను కలిగి ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు ఈ అర్హత ప్రమాణాలు కలిగి ఉండకపోతే వారి అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2024 కు కావాల్సిన అర్హత ప్రమాణాలు ఈ క్రింద వివరించబడ్డాయి.
- ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ అధికారికంగా విడుదల అయిన తర్వాత ఎలిజిబిలిటీ కు సంబందించిన పూర్తి వివరాలు మరియు పరీక్ష తేదీలు (AP Grama Sachivalayam 2024 Exam Dates) ఈ ఆర్టికల్ లో అప్డేట్ చేయబడతాయి.
- ఏపీ గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2024 కు అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కచ్చితంగా వారి హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుండి డిగ్రీ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి.
- అభ్యర్థులు అక్టోబర్ 1, 2022 నాటికి కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 సంవత్సరాలు.
ఏపీ గ్రామ సచివాలయం అప్లికేషన్ ప్రాసెస్ 2024 (AP Grama Sachivalayam 2024 Application Process)
ఏపీ గ్రామ సచివాలయం 2024 (AP Grama Sachivalayam 2024 Application Process)కోసం అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. గ్రామ సచివాలయం అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. ఈ క్రింద వివరించిన స్టెప్స్ ద్వారా అభ్యర్థులు ఏపీ గ్రామ సచివాలయం 2024 పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ ' gramawardsachivalayam.ap.gov.in ' ఓపెన్ చేయండి.
- మెనూ లో " Jobs " మీద క్లిక్ చేయండి.
- ' AP Grama Sachivalayam Vacancies 2024 ' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
- జాబితా లో ఉన్న లిస్ట్ నుండి మీకు కావాల్సిన పోస్టు మీద క్లిక్ చేయండి.
- మీ వ్యక్తిగత సమాచారాన్ని పూర్తి చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ గ్రామ సచివాలయం 2024 పోస్టుల వివరాలు (AP Grama Sachivalayam 2024 Vacancy Details)
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో ఉన్న ఖాళీలు మరియు సంబంధిత పోస్టు కు అప్లై చేసిన వారి విధులు గ్రామ మరియు వార్డు సచివాలయం ప్రకారంగా వివరించబడ్డాయి. అభ్యర్థులు ఈ క్రింద ఉన్న పట్టిక ల నుండి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
వార్డు సచివాలయాలు
పోస్ట్ | శాఖ | విధులు |
---|---|---|
వార్డు పరిపాలన కార్యదర్శి | పురపాలక మరియు పట్టణాభివృద్ధి | సమస్య-పరిష్కారం, సాధారణ పరిపాలన సమన్వయం, మునిసిపల్ పన్ను వసూళ్లు, ప్రజల స్పందన మొదలైనవి. |
వార్డు సౌకర్యాల కార్యదర్శి | పురపాలక మరియు పట్టణాభివృద్ధి | నీటి సరఫరా, రోడ్లు, పౌర సదుపాయాలు, మురుగు కాలువలు, శ్మశానవాటికలు, కల్వర్టులు మొదలైనవి. |
పారిశుధ్యం మరియు పర్యాటక శాఖ కార్యదర్శి | పురపాలక మరియు పట్టణాభివృద్ధి | పర్యావరణ పరిరక్షణ, ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ, జంతు సంరక్షణ మొదలైనవి. |
వార్డు విద్యా కార్యదర్శి | పురపాలక మరియు పట్టణాభివృద్ధి | అమ్మ OD మున్సిపల్, మున్సిపల్ ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ స్కాలర్‌షిప్‌లు, కీలక గణాంకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పండుగలు, సంస్కృతి మరియు ఇతర మున్సిపల్ కార్యకలాపాలు |
సంక్షేమం మరియు అభివృద్ధి కార్యదర్శి | పురపాలక మరియు పట్టణాభివృద్ధి | ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ తదితర, యువత - పట్టణ పేదరిక నిర్మూలన, ఉపాధి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ పెన్షన్, వైఎస్సార్‌సీ. |
ప్రణాళిక మరియు నియంత్రణ కార్యదర్శి | పురపాలక మరియు పట్టణాభివృద్ధి | భూ వినియోగం, పట్టణ మరియు పట్టణ ప్రణాళిక, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఫారెస్ట్రీ, అగ్నిమాపక, నీటి సంరక్షణ |
వార్డు ఆరోగ్య కార్యదర్శి | వైద్య మరియు ఆరోగ్యం | జనన మరణాల నమోదు, ప్రజారోగ్యం, వైఎస్సార్ బీమా, వైఎస్సార్ ఆరోగ్య సంరక్షణ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS) మొదలైనవి. |
వార్డు ఇంధన కార్యదర్శి | ఇంధనం | విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, విద్యుత్ సబ్సిడీ మొదలైనవి. |
వార్డు మహిళలు మరియు బాధితుల పరిరక్షణ కార్యదర్శి | ఇల్లు (పోలీస్) | శాంతి దళం, మహిళలు - బలహీన వర్గాలపై అత్యాచారాల నివారణ, దుర్వినియోగం, మద్యం, సంబంధిత సేవలు మొదలైనవి. |
వార్డు రెవెన్యూ కార్యదర్శి | - | రెవెన్యూ కార్యక్రమాలు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సప్లైస్, సర్టిఫికెట్ల జారీ, డిజిటలైజేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ |
గ్రామ కార్యదర్శుల ఉద్యోగాలు
పోస్ట్ | పర్యవేక్షణ విభాగం | విధులు | కొత్తగా భర్తీ చేయబడిన ఉద్యోగాల సంఖ్య |
---|---|---|---|
పంచాయతీ గ్రామ సెక్రటేరియట్ కార్యదర్శి | పంచాయతీ రాజ్ | పన్ను వసూలు, కన్వీనర్, పారిశుద్ధ్యం మరియు సంక్షేమ కార్యక్రమాలు | తెలియాల్సి ఉంది. |
సర్వే అసిస్టెంట్ | రెవెన్యూ (సర్వే) | భూముల సర్వే | తెలియాల్సి ఉంది. |
వీర్వో | రాబడి | భూమి పర్యవేక్షణ మరియు పౌర సరఫరాలు | తెలియాల్సి ఉంది. |
వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్ | పశుసంవర్ధక | వెటర్నరీ, డెయిరీ మరియు మత్స్య శాఖ కార్యక్రమాలు | తెలియాల్సి ఉంది. |
మెనెమ్ | వైద్య ఆరోగ్యం | గ్రామంలోని ప్రజల ఆరోగ్యం మరియు బాధ్యతను పర్యవేక్షించడం | తెలియాల్సి ఉంది. |
ఇంజినీరింగ్ అసిస్టెంట్ | పంచాయతీ రాజ్ | నీటి సరఫరా మరియు అన్ని ఇతర రకాల ఇంజనీరింగ్ పనులు | తెలియాల్సి ఉంది. |
మహిళల రక్షణ | స్త్రీ మరియు శిశు సంక్షేమం | మహిళా పోలీసు, మహిళా మరియు శిశు సంక్షేమ ఉద్యోగి కౌన్సెలింగ్ మరియు మహిళా రక్షణ | తెలియాల్సి ఉంది. |
మత్స్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ MPEA (అవసరమైన చోట) | సీఫుడ్ | ఫిషరీస్ వంటి కార్యకలాపాలలో సహాయకుడిగా పనిచేయడం | తెలియాల్సి ఉంది. |
వెల్పర్ అసిస్టెంట్ | సాంఘిక సంక్షేమం, గిరిజన | పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాలు, ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల నిర్మాణం | తెలియాల్సి ఉంది. |
డిజిటల్ అసిస్టెంట్ | పంచాయతీ రాజ్ | గ్రామ సచివాలయంలో సింగిల్ విండో సిస్టమ్ మానిటరింగ్ | తెలియాల్సి ఉంది. |
అగ్రి, హార్టికల్చర్ ఎంపీఈవోలు | హార్టికల్చర్ | వ్యవసాయ ఉత్పత్తి మరియు మార్కెటింగ్‌తో సహా వ్యవసాయంలో సూచనలు | తెలియాల్సి ఉంది. |
ఎలక్ట్రికల్ అసిస్టెంట్ | పంచాయతీ రాజ్ | విద్యుత్ సరఫరా, వీధి దీపాల పర్యవేక్షణ మరియు విద్యుత్ సరఫరా | తెలియాల్సి ఉంది. |
ఏపీ గ్రామ సచివాలయం 2024 హాల్ టికెట్ (AP Grama Sachivalayam 2024 Hall Ticket)
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2024 హాల్ టికెట్లు ఏప్రిల్ లేదా మే 2024 లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి వారి హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ క్రింద స్టెప్స్ అనుసరించి వారి హాల్ టికెట్ (AP Grama Sachivalayam 2024 Hall Ticket)ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ ' gramawardsachivalayam.ap.gov.in ' ను ఓపెన్ చేయండి.
- ' AP Grama Sachivalayam Hall Ticket 2024 ' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
- మీ హాల్ టికెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ గ్రామ సచివాలయం 2024 ఆన్సర్ కీ (AP Grama Sachivalayam 2024 Answer Key)
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2024 పరీక్షలు పూర్తి అయిన తర్వాత సంబంధిత పోస్టులకు ఆన్సర్ కీ రిలీజ్ అవుతుంది. అభ్యర్థులు ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఏపీ గ్రామ సచివాలయం 2024 ఆన్సర్ కీ (AP Grama Sachivalayam 2024 Answer Key)డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ గ్రామ సచివాలయం 2024 సెలక్షన్ ప్రాసెస్ (AP Grama Sachivalayam 2024 Selection Process)
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం పరీక్ష వ్రాసిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి కనీస మార్కులు OBC కు 40% , SC, ST PH అభ్యర్థులకు 30% , BC అభ్యర్థులకు 35% . అయితే అభ్యర్థులు అర్హత మార్కులు సాధించిన అంత మాత్రాన ఉద్యోగం లభించదు. ఇద్దరు అభ్యర్థులకు ఓకే మార్కులు వస్తే వారి ఇద్దరి వయసు, వారి విద్యార్హత, గ్రాడ్యుయేషన్ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ నిర్ణయిస్తారు.
ఏపీ గ్రామ సచివాలయం అప్లికేషన్ ప్రాసెస్, పరీక్ష తేదీల గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
ఏపీ మెగా డీఎస్సీ సిలబస్ 2024 రిలీజ్ (AP DSC 2024 Syllabus), పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి