ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 10వ తరగతి తర్వాత అత్యుత్తమ పాలిటెక్నీక్ కోర్సులు మరియు కళాశాలల జాబితా (Best Polytechnic Courses in Andhra Pradesh after AP SSC)

Guttikonda Sai

Updated On: November 01, 2023 01:39 am IST

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 10వ తరగతి తర్వాత అత్యుత్తమ పాలిటెక్నీక్ కోర్సులు మరియు కళాశాలల జాబితా (Best Polytechnic Courses in Andhra Pradesh) ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 10వ తరగతి తర్వాత అత్యుత్తమ పాలిటెక్నీక్ కోర్సులు మరియు కళాశాలల జాబితా (Best Polytechnic Courses in Andhra Pradesh after AP SSC Result 2023)

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 10వ తరగతి అత్యుత్తమ పాలిటెక్నిక్ కోర్సులు (Best Polytechnic Courses in Andhra Pradesh after AP SSC ) : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 10 వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లేదా డిప్లొమా కోర్సుల గురించి ఆలోచిస్తుంటే అది మంచి నిర్ణయమే అవుతుంది. 10వ తరగతి తర్వాత అనేక కోర్సులు ఉన్నాయి, అయితే పాలిటెక్నిక్ ఎంచుకోవడం మాత్రం విద్యార్థులకు రెండు విధాలుగా లాభాన్ని చేకూరుస్తుంది. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు సంబంధిత కంపెనీలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు లేదా ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 148 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఈ కళాశాలలో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నారు. ఈ కళాశాలల్లో అడ్మిషన్ పొందాలి అంటే విద్యార్థులు ఏపీ పాలిసెట్ 2024 పరీక్షలో అర్హత సాధించాలి.

ఇది కూడా చదవండి - ఏపీ పాలీసెట్ 2024 అర్హత ప్రమాణాలు

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో అత్యుత్తమ కోర్సులు ( Best Polytechnic Courses after 10th Class)

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థులు వారికి కావాల్సిన బ్రాంచ్ ను ఎంచుకోవాలి. ఈ ఎంపిక విద్యార్థుల భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ లో అత్యుత్తమ కోర్సుల వివరాలు క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్య

బ్రాంచ్

పూర్తి పేరు

1

CSE

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

2

ECE

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

3

EEE

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

4

Mechanical

మెకానికల్ ఇంజనీరింగ్

5

Civil

సివిల్ ఇంజనీరింగ్

6

IT

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ



ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో పైన వివరించిన కోర్సులు మాత్రమే కాకుండా కళాశాలను బట్టి మరికొన్ని కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సంబంధిత కాలేజీ వెబ్సైట్ నుండి ఈ సమాచారాన్ని పొందవచ్చు.

10వ తరగతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలల జాబితా  ( List of Polytechnic Colleges in AndhraPradesh)

10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సులో జాయిన్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో అత్యుత్తమ పాలిటెక్నిక్ కళాశాలల జాబితా తెలుసుకోవచ్చు.

క్రమ సంఖ్య కళాశాల పేరు ప్రదేశం
1 గవర్నమెంట్ పాలిటెక్నీక్ కళాశాల అనంతపూర్
2 బిట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనంతపూర్
3 తాడిపత్రి పాలిటెక్నీక్ కళాశాల తాడిపత్రి
4 Aries పాలిటెక్నిక్ కళాశాల చిత్తూరు
5 కుప్పం పాలిటెక్నిక్ కళాశాల కుప్పం
6 SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల తిరుపతి
7 ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల కాకినాడ
8 B.A రామయ్య పాలిటెక్నిక్ కళాశాల రాజమండ్రి
9 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రంపచోడవరం
10 MBTS పాలిటెక్నిక్ కళాశాల గుంటూరు
11 బాపట్ల పాలిటెక్నిక్ కలశాల బాపట్ల
12 చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు
13 AVN పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ
14 ఉషారమ పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ
15 నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల నూజివీడు
16 VKR & VNB పాలిటెక్నిక్ కళాశాల గుడివాడ
17 శ్రీ జి. పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కర్నూల్
18 వాసవి పాలిటెక్నిక్ కళాశాల కర్నూల్
19 ESC ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కర్నూల్
20 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నెల్లూరు
21 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కావలి
22 DA గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల దామచర్ల
23 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల టెక్కలి
24 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల సీతంపేట
25 TBR పాలిటెక్నిక్ కళాశాల సొండిపూడి
26 అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం
27 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విశాఖపట్నం
28 సాయి కృష్ణ పాలిటెక్నిక్ కళాశాల విజయనగరం
29 శ్రీ చైత్రన్య పాలిటెక్నిక్ కళాశాల విజయనగరం
30 AKRG కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నల్లజర్ల
31 సర్ సి.ఆర్. రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ఏలూరు
32 సి.వి. రామన్ పాలిటెక్నిక్ కళాశాల పాలకొల్లు
33 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కడప
34 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రాజంపేట
35 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల జమ్మలమడుగు

విద్యార్థులు ఏపీ పాలిసెట్ పరీక్షలో మంచి రాంక్ సాధిస్తే అత్యుత్తమ కళాశాలల్లో వారికి నచ్చిన బ్రాంచ్ లో అడ్మిషన్ పొందవచ్చు. \

AP POLYCET 2024 గురించి ( About AP POLYCET 2024)

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్, అధికారిక వెబ్‌సైట్ appolycet.nic.inలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP POLYCET 2024 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. AP POLYCET 2024 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు AP POLYCET దరఖాస్తు ఫారమ్ 2024 పేర్కొన్న గడువులోపు పూరించాలి. AP POLYCET దరఖాస్తు ఫారమ్ 2024 నింపే ముందు అభ్యర్థులు AP POLYCET అర్హత ప్రమాణాలు 2024 కూడా తెలుసుకోవాలి అని సూచించారు . AP POLYCET 2024 పరీక్షకు విజయవంతంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు AP POLYCET అడ్మిట్ కార్డ్‌లు 2024 రూపొందించబడతాయి.

ఆంద్రప్రదేశ్ పాలిటెక్నిక్ కోర్సుల గురించి మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/best-polytechnic-courses-in-andhra-pradesh-after-ap-ssc-result/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Education Colleges in India

View All

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!