Children's Day Speech in Telugu (తెలుగులో చిల్డ్రన్స్ డే స్పీచ్)
: జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం అందుకే ఆయన పుట్టిన రోజుని మనదేశంలో చిల్డ్రన్ డే గా జరుపుకుంటున్నాం. వీలు ఉన్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. చిన్న పిల్లల కల్మషం లేని మనసు వారి ఆలోచనలు నెహ్రూ గారికి ఎంతో నచ్చేవి. అందుకే ఆయనకు పిల్లలతో కలిసి ఉండడం అంటే చాలా ఇష్టం. ఆయన తన ప్రతీ పుట్టిన రోజుని కూడా పిల్లలతో కలిసి చేసుకునేవారు. పిల్లలు అందరూ కూడా జవహర్ లాల్ నెహ్రూ గారిని "చాచా" అని సంబోధించేవారు.
ఇది కూడా చూడండి:
చిల్డ్రన్స్ డే కొటేషన్స్, స్పీచ్ ఐడియాలు
500 పదాల్లో బాలల దినోత్సవం స్పీచ్ ( Children's Day Speech in 500 Words)
నేటి బాలలే రేపటి మన భారతదేశ భవిష్యత్తు అని ఆయన ఎల్లప్పుడూ అనేవారు. పిల్లల కోసం ఏదైనా చేయాలి అని తపిస్తూ ఉండేవారు. ప్రత్యేకంగా పిల్లల కోసమే చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ను ప్రారంభించారు. భారతదేశం లోని పిల్లల అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఆయన చాలా కృషి చేశారు. అందుకే ఆయన పుట్టిన రోజు నవంబర్ 14 వ తేదీని మనం బాలల దినోత్సవం గా జరుపుకుంటూ ఉన్నాం.
తర్వాత భారత ప్రభుత్వం కూడా బాలల కోసం చాలా కార్యక్రమాలు మొదలు పెట్టింది. సర్వ శిక్షా అభియాన్ క్రింద అందరికీ చదువుకునే హక్కు కల్పించింది. 14 సంవత్సరాల వరకూ ఉన్న పిల్లలు అందరూ తప్పనిసరిగా చదువుకోవాలి అని నిర్ణయించింది. బాల కార్మికులు ఎవరూ ఉండకూడదు అని విశేషంగా కృషి చేస్తూ ఉంది. 2001 సంవత్సరంలో 1.2 కోట్ల మంది బాల కార్మికులు ఉండగా 2011 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 43.53 లక్షలకు తగ్గింది. 2023 సంవత్సరానికి ఇంకా విశేషంగా తగ్గే అవకాశం ఉంది కానీ అధికారిక లెక్కలు లేవు. అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి భారతదేశం చాలా ప్రయత్నిస్తుంది. మరి అలా పోటీ పడాలి అంటే అంటే పునాదులు చాలా దృఢంగా ఉండాలి. భారతదేశ భవిష్యత్తు కి పునాదులు ఇప్పుడు ఉన్న బాలలే అని అందరూ గుర్తు ఉంచుకోవాలి. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు బాలల గురించి ఇలా అన్నారు
'మనం ఈ ప్రపంచంలో నిజమైన శాంతిని బోధించాలంటే, యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన శాంతిని కొనసాగించాలంటే, మనం పిల్లలతో ప్రారంభించాలి.'
చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ విషయం మీద అయినా ఉండే ఆసక్తి, ఉత్సాహం పెరిగే కొద్దీ ఉండదు అని గమనించాలి.
ఒక నాలుగేళ్ల పిల్లవాడు సగటున రోజుకి 100 ప్రశ్నలు అడుగుతాడు అని తెలిసింది. అదే 25 సంవత్సరాల వ్యక్తి రోజుకి 10 ప్రశ్నలు కూడా అడగడం లేదు.
అంటే కొత్త విషయం తెలుసుకోవాలి అనే ఆసక్తి పెద్ద వారిలో కంటే పిల్లల లోనే ఎక్కువగా ఉంటుంది. అలాంటి బాల్యానికి (Children's Day Speech in Telugu) పెద్దవారు కూడా విలువ ఇవ్వాలి.
నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ఒక్క వాక్యం చాలు పిల్లలకు మనం ఎంత విలువ ఇవ్వాలో అర్ధం చేసుకోవడానికి. కానీ రేపటి భవిష్యత్తు ను తరగతి గదులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు చాలా మంది. నిజంగా పిల్లలను అర్థం చేసుకుని వారి అభిరుచులకు తగ్గట్లు ప్రోత్సహించే తల్లి తండ్రులు ఎంత మంది ఉన్నారు అని అందరూ ఒకసారి ఆలోచించాలి. కేవలం స్కూల్ లో చేర్పిస్తే తల్లి తండ్రుల పని అయిపోదు కదా. అలాగే పిల్లలకు మార్కులు ఒక్కటే లక్ష్యంగా ఉండకూడదు కదా.
నిజమే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రుడి మీదకు కూడా వెళ్లగలిగాం. కానీ పిల్లల మనసుని అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నాం అని మాత్రం ఒప్పుకోవాలి. ఐతే అందరూ కాదు కొంతమంది మాత్రమే. రాజస్థాన్ లోని కోటా అనే జిల్లాలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలో ఒత్తిడి తట్టుకోలేక 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే వారి మీద ఎంత ఒత్తిడి ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. రాంక్ రాకపోతే జీవితం వృథా అనే భావన వారిలో తగ్గించాలి కానీ రోజు రోజుకీ ఆ భావన పెంచితే భారతదేశ భవిష్యత్తు ఏం అవుతుంది?
భారత ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గడం లేదు. 2017 నుండి 2021 వరకూ ఐదు సంవత్సరాలలో భారతదేశం మొత్తం మీద 50,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే మీరు నమ్మగలరా? కానీ అది నిజం.
టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందాము, చంద్రుడి దక్షిణ ఉపరితలం దగ్గరలో సాప్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా రికార్డు సృష్టించాము. కానీ విద్యార్థుల ఆత్మహత్యల లో కూడా ఎక్కడ ఆ స్థానం కోసం పోటీ పడుతూ ఉన్నామో అని కూడా భయంగా ఉంది.
పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలి అంటే శారీరకంగా కూడా ఆటలు ఆడుతూ దృఢంగా ఉండాలి. కానీ ఎన్ని పాఠశాలల్లో పిల్లల కోసం ఆటస్థలం ఉంటుంది అసలు? ఉన్నా కూడా వారానికి ఎంత సేపు వారు ఆడుతున్నారు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడం మరింత తగ్గిపోయింది. అల్లరి చేయకుండా ఉంటారు అని తల్లి తండ్రులే వారికి సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు ఏదైనా ఒక లిమిట్ దాటితే వారికి చాలా ప్రమాదం అని అందరూ గుర్తు ఉంచుకోవాలి. పిల్లలు (Children's Day Speech in Telugu) మంచిగా పెరగడానికి అయినా చెడు ఆలోచనలు రావడానికి అయినా సమాజం బాధ్యత చాలా ఉంటుంది. అస్తమానం ర్యాంకు లు, మార్కులు మాత్రమే కాకుండా వారికి ప్రకృతిని కూడా పరిచయం చేయండి. స్వేచ్చగా ఎదగడానికి సహకరించండి.
ఇవి కూడా చదవండి
క్రిస్మస్ వ్యాసం తెలుగులో | నూతన సంవత్సర వ్యాసం తెలుగులో |
---|---|
ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత | స్వాతంత్య్ర దినోత్సవం ప్రాముఖ్యత |
400 పదాల్లో బాలల దినోత్సవం స్పీచ్ ( Children's Day Speech in 400 Words)
అందరికీ నమస్కారం!
బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నవంబర్ 14వ తేదీ పిల్లలకు, పిల్లలకు అంకితం చేయబడిన రోజు మరియు ఇది మన ప్రత్యేకత, కలలు మరియు మనలో మనం కలిగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించే ప్రత్యేకమైన రోజు . ముందుగా, ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరియు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రతిరోజూ మమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మరియు ప్రతిష్టాత్మకంగా భావించేలా చేస్తారు మరియు ఒక రోజంతా మాకు అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు, మీరు ఆశ్చర్యపోవచ్చు, మనకు బాలల దినోత్సవం ఎందుకు అవసరం? సరే, ఇది కేవలం వినోదం మరియు ఆటల కోసం ఒక రోజు కాదు (ఆ భాగం అద్భుతంగా ఉన్నప్పటికీ!). బాలల దినోత్సవం అంటే మన హక్కులు మరియు అవసరాలను గుర్తించడం మరియు గౌరవించడం. మీరు చూడండి, మేము తోటలోని చిన్న మొక్కలలా ఉన్నాము. ఎదగడానికి మరియు వృద్ధి చెందడానికి మనకు సరైన శ్రద్ధ మరియు సంరక్షణ అవసరం. ఆ సంరక్షణలో మంచి విద్య, సురక్షితమైన వాతావరణం మరియు ఆరోగ్యకరమైన ఆహారం ఉంటాయి. పెద్దగా కలలు కనే మరియు ఆ కలల కోసం పని చేసే స్వేచ్ఛ మనకు ఉండాలని కూడా దీని అర్థం.
ఈ రోజున, పిల్లలను ప్రేమించిన భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను మనం స్మరించుకుంటాము. పిల్లలే దేశం యొక్క భవిష్యత్తు అని ఆయన నమ్మారు మరియు ఆయన నమ్మకం సరైనది! కాబట్టి, ప్రతి సంవత్సరం, మనం అతని పుట్టినరోజును బాలల దినోత్సవంగా (Children's Day Speech in Telugu) జరుపుకుంటాము, పిల్లల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ మరియు గౌరవాన్ని గౌరవిస్తాము.
అయితే బాలల దినోత్సవం అంటే కేవలం ఒక వ్యక్తిని మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు. ఇది మనలో ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకోవడం. మనమే భవిష్యత్తు, మరియు మన కలలు, ఆలోచనలు మరియు చర్యలు మనం నివసించే ప్రపంచాన్ని తయారు చేస్తాయి. పెద్దలకు మన మాటలు వినడానికి, మన ఆశలు మరియు భయాలను అర్థం చేసుకోవడానికి మరియు మన కలలను సాధించడంలో మాకు మద్దతు ఇవ్వాలని గుర్తుచేసే రోజు.
మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బహుమతి, ప్రత్యేకమైన ప్రతిభ లేదా మనల్ని ఒకరికొకరు భిన్నంగా చేసే కలలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. బహుశా మీరు డాక్టర్, శాస్త్రవేత్త, కళాకారుడు, ఉపాధ్యాయుడు లేదా మరేదైనా కావాలని కోరుకుంటారు. మీ కల ఏమిటో పట్టింపు లేదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, కలలు కనే హక్కు మీకు ఉంది మరియు ఆ కలను నిజం చేసుకునే అవకాశం మీకు ఉంది. కానీ గుర్తుంచుకోండి, కలలు స్వయంగా నెరవేరవు. వాటి కోసం మనం పని చేయాలి. మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎంత కష్టంగా అనిపించినా వదులుకోకూడదు. ఒక చిన్న మొక్క అందమైన పువ్వుగా ఎదగడానికి నీరు, సూర్యరశ్మి మరియు సంరక్షణ అవసరం అయినట్లే, మన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మనకు మద్దతు మరియు సరైన అవకాశాలు అవసరం.
ఈరోజు మనకు మరియు మన చుట్టూ ఉన్న పెద్దలకు వాగ్దానం చేద్దాం. మనం ఉత్తమంగా ఉండగలమని, కష్టపడి చదువుకుంటామని మరియు ఇతరులతో మంచిగా మరియు దయగా ఉంటామని వాగ్దానం చేద్దాం. మన పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకుంటామని, మన పెద్దలను గౌరవిస్తామని మరియు సరైనది కాని దేనికైనా వ్యతిరేకంగా నిలబడతామని వాగ్దానం చేద్దాం.
మన బాల్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తామని కూడా వాగ్దానం చేద్దాం. ఆడండి, నేర్చుకోండి, స్నేహితులను చేసుకోండి మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించండి. మరియు కలలు కనడం ఎప్పుడూ ఆపకండి!
అందరికీ బాలల దినోత్సవ (Children's Day Speech in Telugu) శుభాకాంక్షలు! ఈ రోజు మరియు ప్రతి రోజును సద్వినియోగం చేసుకుందాం. మన కలలు భవిష్యత్తు నిర్మాతలు, ప్రేమ, మద్దతు మరియు కృషితో మనం వాటిని నిజం చేసుకోవచ్చు.
జైహింద్…
సిమిలర్ ఆర్టికల్స్
ఉగాది పండుగ విశిష్టత.. పచ్చడిలో ఉన్న ప్రత్యేకతలు (Ugadi Festival in Telugu)
సంక్రాంతి పండుగ విశేషాలు (Sankranti Festival Essay in Telugu)
ఏపీ 10వ తరగతి రీవాల్యుయేషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (AP SSC Revaluation 2025)
TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి
ఇంటర్మీడియట్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ లోకి ఎలా చేరాలి? (How to Get into the Indian Air Force after Intermediate?)
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి