నర్సింగ్ డిప్లొమా అడ్మిషన్ 2023 (Diploma in Nursing Admission 2023) ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫార్మ్ , అర్హతలు ఇక్కడ తెలుసుకోండి

Andaluri Veni

Updated On: September 19, 2023 05:12 PM

భారతదేశంలోని టాప్ నర్సింగ్ కళాశాలలు డిప్లొమా కోర్సును అందిస్తున్నాయి.  నర్సింగ్ డిప్లొమా ప్రవేశాలు మెరిట్ ఆధారంగా జరుగుతాయి.  నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించిన అర్హత, ఎంపిక ప్రక్రియ, ఫీజులు,  జాబితా గురించి (Diploma in Nursing Admission 2023) వివరాలు ఇక్కడ అందజేశాం.

విషయసూచిక
  1. నర్సింగ్‌లో డిప్లొమా ఎందుకు అభ్యసించాలి? (Why Pursue a Diploma in Nursing?)
  2.  నర్సింగ్ డిప్లొమా2023 ముఖ్యాంశాలు (Why Pursue a Diploma in Nursing?)
  3. నర్సింగ్ డిప్లొమా 2023 అడ్మిషన్ ప్రక్రియ (Diploma in Nursing2023 Highlights)
  4. నర్సింగ్ డిప్లొమా అర్హత ప్రమాణాలు2023 (Diploma in Nursing Eligibility Criteria2023)
  5. నర్సింగ్ డిప్లొమా అప్లికేషన్ ప్రాసెస్2023 (Diploma in Nursing Application Process2023)
  6. నర్సింగ్‌లో డిప్లొమా అడ్మిషన్2023 కోసం అవసరమైన పత్రాలు (Documents Required for Diploma …
  7. నర్సింగ్ డిప్లొమా సిలబస్ (Diploma in Nursing Syllabus)
  8. నర్సింగ్ డిప్లొమా కోర్సు ఫీజు2023 (Diploma in Nursing Course Fee2023)
  9. డిప్లొమా నర్సింగ్ కోర్సు వివిధ కళాశాలల ఫీజు నిర్మాణం2023 (Diploma in Nursing …
  10. నర్సింగ్ డిప్లొమా కెరీర్ ఆప్షన్స్ (Diploma in Nursing Career Options)
  11. భారతదేశంలోని నర్సింగ్ కాలేజీలలో డిప్లొమా2023 (Diploma in Nursing Colleges in India2023)
  12. మరిన్ని సంబంధిత కథనాలు
  13. Faqs
Diploma in Nursing Admissions

నర్సింగ్ డిప్లొమా2023 అడ్మిషన్లు  (Diploma in Nursing Admission2023): నర్సింగ్‌లో కెరీర్‌ వైపు అడుగులు వేయాలనుకుంటున్నారా? భారతదేశంలో డిప్లొమా నర్సింగ్ అడ్మిషన్లకు (Diploma in Nursing Admission2023) సంబంధించిన సమాచారం కోసం వెదుకుతున్నారా? అయితే అలాంటి అభ్యర్థులకు మన దేశంలో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి.  ఆ అవకాశాలు గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నర్సింగ్ డిప్లొమా కోర్సు మూడేళ్ల పాటు ఉంటుంది. ఇది రెగ్యులర్ కోర్సు. నర్సింగ్ రంగంలో రాణించాలనుకునే అభ్యర్థులకు నర్సింగ్ డిప్లొమా చేయడం ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రంగం వైపు అడుగులు వేసే అభ్యర్థుల సంఖ్య బాగా పెరగడంతో సంబంధిత విద్యా సంస్థలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాయి.  ప్రైవేట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్‌లో మెడికల్ రైటింగ్, అడ్మినిస్ట్రేషన్, హెల్త్ కేర్ సెంటర్స్ వంటి విభాగాల్లో డిప్లొమా ఇన్ నర్సింగ్ నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. భారతదేశంలో టాప్ ఇక్కడ కళాశాలల్లో డిప్లొమా నర్సింగ్ అడ్మిషన్ల గురించి, కోర్సు ఫీజు, ఎంపిక ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకోండి.

నర్సింగ్‌లో డిప్లొమా ఎందుకు అభ్యసించాలి? (Why Pursue a Diploma in Nursing?)

సంబంధిత రంగంలో మంచి ప్రారంభం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం నర్సింగ్‌లో డిప్లొమా గొప్పది ఛాయిస్ అనే చెప్పుకోవాలి. నర్సింగ్‌లో డిప్లొమా కెరీర్‌కు సిద్ధం కావడానికి, మీ నైపుణ్యాలను మెరుగుపరచడంలో నర్సింగ్ డిప్లొమా కోర్సు సహాయపడుతుంది. ఆరోగ్య రంగంలో నిపుణుల డిమాండ్ బాగా పెరిగింది.ఈ నేపథ్యంలో ఈ కెరీర్‌లో రాణించాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నర్సింగ్ డిప్లొమా చేయడం చాలా మంచింది. కోర్సు డిప్లొమా హోల్డర్లకు  కొన్ని కళాశాలలు బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్  డైరెక్ట్ అడ్మిషన్‌లను అందిస్తున్నాయి. నర్సింగ్‌లో ఉపాధ్యాయుడు/ప్రొఫెసర్ వంటి అకడమిక్ కెరీర్‌ని చేపట్టాలని ఎదురు చూస్తున్న వారు నర్సింగ్ డిప్లొమాతో తమ కెరీర్‌ను ప్రారంభించవచ్చు.

నర్సింగ్ డిప్లొమా2023 ముఖ్యాంశాలు (Why Pursue a Diploma in Nursing?)

నర్సింగ్ డిప్లొమా అడ్మిషన్‌కు సంబంధించిన  ప్రధాన ముఖ్యాంశాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది.

కేటగిరి

ప్రధాన ముఖ్యాంశాలు

స్థాయి కోర్సు

అండర్ గ్రాడ్యుయేట్

కోర్సు

మూడు సంవత్సరాలు

టైప్

సెమిస్టర్ వారీగా

అర్హత

10+2లో ఉత్తీర్ణత సాధించారు

అడ్మిషన్ ప్రక్రియ

మెరిట్ బేస్

కోర్సు ఫీజు

రూ. 4,000/ నుంచి రూ. 1,00,000/- (వార్షిక)

నర్సింగ్ డిప్లొమా 2023 అడ్మిషన్ ప్రక్రియ (Diploma in Nursing2023 Highlights)

నర్సింగ్ డిప్లొమాలో అడ్మిషన్ పొందేందుకు అభ్యర్థులు తగిన అర్హత ప్రమాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. తగిన అర్హతలున్న అభ్యర్థులు నర్సింగ్‌లో డిప్లొమా పొందడం చాలా సులభం. అభ్యర్థి ఎవరైనా ప్రాథమిక పత్రాలను అందించడంలో విఫలమైతే, వారు అడ్మిషన్ నుంచి తిరస్కరించబడే అవకాశం ఉంటుంది. భారతదేశంలోని చాలా కళాశాలలు B.Sc నర్సింగ్ అందిస్తున్నాయి. మెరిట్ ఆధారంగా కోర్సులో అడ్మిషన్లు అందించడం జరుగుతుంది. నర్సింగ్2023లో డిప్లొమా కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ అందించడం జరిగింది. నర్సింగ్ డిప్లొమాలో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు ఈ అంశాలను పాటించాల్సి ఉంది.

  • తగిన అర్హత ప్రమాణాలున్న అభ్యర్థులు కాలేజీల్లో నర్సింగ్ డిప్లొమాలో అడ్మిషన్‌ కోసం జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్షలను రాయవచ్చు.
  • అర్హతలున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫార్మ్‌ని పూరించాలి. గడువులోగా లేదా అంతకు ముందు అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
  • అన్ని దరఖాస్తులను సేకరించిన తర్వాత  విశ్వవిద్యాలయం బృందం వాటిని ధ్రువీకరిస్తుంది. .
  • అడ్మిషన్ B.Sc నర్సింగ్‌లోకి ఏప్రిల్ మరియు జూన్ మధ్య జరుగుతుంది
  • విద్యార్థులు మెరిల్ జాబితాలో తమ పేరును కనుగొన్న తర్వాత వారు తదుపరి డాక్యుమెంటేషన్ ధ్రువీకరన ప్రక్రియను కొనసాగించవచ్చు

నర్సింగ్ డిప్లొమా అర్హత ప్రమాణాలు2023 (Diploma in Nursing Eligibility Criteria2023)

నర్సిం్ డిప్లొమాలో జాయిన్ అయ్యేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.

  • అభ్యర్థి కనీసం 55 శాతం మొత్తం మార్కులుతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత స్ట్రీమ్‌లో 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

  • జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో రెండేళ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా నర్సింగ్ డిప్లొమా  కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నర్సింగ్ డిప్లొమా అప్లికేషన్ ప్రాసెస్2023 (Diploma in Nursing Application Process2023)

నర్సింగ్ డిప్లొమా కోసం దరఖాస్తు ప్రక్రియ ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు మారవచ్చు. చాలా కాలేజీల్లో అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లలో నింపవచ్చు. దరఖాస్తుదారులు వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషనల్, అర్హతలు, నివాస వివరాలు వంటి అవసరమైన మొత్తం సమాచారాన్ని అప్లికేషన్‌లో పూరించాలి. దరఖాస్తు ఫీజు లేదా ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో DD/నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ పూర్తయినట్లు పరిగణించబడుతుంది.

నర్సింగ్‌లో డిప్లొమా అడ్మిషన్2023 కోసం అవసరమైన పత్రాలు (Documents Required for Diploma in Nursing Admission2023)

నర్సింగ్ డిప్లొమా అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాల జాబితా ఈ దిగువున అందజేశాం.

  • పదో తరగతి మార్క్ షీట్

  • ఇంటర్మీడియట్ మార్క్ షీట్

  • డిప్లొమా సర్టిఫికెట్ (వర్తిస్తే)

  • బదిలీ సర్టిఫికెట్

  • మైగ్రేషన్ సర్టిఫికెట్

  • క్యారెక్టర్ సర్టిఫికెట్

  • వైద్య ధ్రువీకరణ పత్రం

  • దరఖాస్తు ఫీజు చెల్లింపు రసీదు

  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)

నర్సింగ్ డిప్లొమా సిలబస్ (Diploma in Nursing Syllabus)

మొదటి సంవత్సరం

రెండో సంవత్సరం

మూడో సంవత్సరం

సెమిస్టర్ 1

సెమిస్టర్ 2

సెమిస్టర్ 3

సెమిస్టర్ 4

సెమిస్టర్ 5

సెమిస్టర్ 6

మైక్రోబయాలజీ

నర్సింగ్  ప్రాథమిక అంశాలు

మెడికల్-సర్జికల్ నర్సింగ్ I

ఆంకాలజీ/ స్కిన్

కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్

పీడియాట్రిక్ నర్సింగ్

అనాటమీ

ఆరోగ్యం భావన

చెవి, ముక్కు, గొంతు

కంప్యూటర్ చదువు

మిడ్‌వైఫరీ, గైనకాలజికల్ నర్సింగ్

కమ్యూనిటీ హెల్త్ సర్వీస్

ప్రయోగశాల సాంకేతికతలకు పరిచయం

వ్యక్తిగత పరిశుభ్రత

అంటువ్యాధి

మెంటల్ హెల్త్ మరియు సైకియాట్రిక్ నర్సింగ్

మనస్తత్వశాస్త్రం

రోగి అంచనా

రుగ్మతల నిర్వహణ

మానసిక రుగ్మతలు

రోగనిరోధక శక్తి

ప్రథమ చికిత్స

నర్సింగ్ డిప్లొమా కోర్సు ఫీజు2023 (Diploma in Nursing Course Fee2023)

వార్షిక కోర్సు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో డిప్లొమా ఇన్ నర్సింగ్ ఫీజు కింద పేర్కొనబడింది:-

టైప్

కనీస వార్షిక ఫీజు

గరిష్ట వార్షిక రుసుము

ప్రభుత్వ కళాశాలలు

రూ. 4,000/-

రూ. 50,000/-

ప్రైవేట్ కళాశాలలు

రూ. 50,000/-

రూ. 5,50,000/-

డిప్లొమా నర్సింగ్ కోర్సు వివిధ కళాశాలల ఫీజు నిర్మాణం2023 (Diploma in Nursing Course Fee Structure2023 of Different Colleges)

ఇన్స్టిట్యూట్ పేరు

లొకేషన్

సగటు వార్షిక ఫీజు

SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కాంచీపురం

రూ.35,000

శక్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్

తమిళనాడు

రూ.20,000

మహాత్మా జ్యోతి రావ్ ఫూలే విశ్వవిద్యాలయం

జైపూర్

రూ.26,000

సురబి కాలేజ్ ఆఫ్ నర్సింగ్

తమిళనాడు

రూ. 21,000

సింఘానియా విశ్వవిద్యాలయం

రాజస్థాన్,

రూ.92,000

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థొరాసిక్ అండ్ వాస్కులర్ డిసీజ్

చెన్నై

రూ.20,000

వెంకటేశ్వర నర్సింగ్ కళాశాల

చెన్నై

రూ.40,000

అనుగ్రహ్ నారాయణ్ మగద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్

బీహార్

రూ.1,600

నర్సింగ్ డిప్లొమా కెరీర్ ఆప్షన్స్ (Diploma in Nursing Career Options)

కోర్సు పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు వెదకగల కొన్ని మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్‌లు, ఆరోగ్య కేంద్రాలు మొదలైన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రాం తర్వాత ఉన్నత చదువులు చదివితే ఉద్యోగావకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. నర్సింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు పరిగణించగల కొన్ని ఉద్యోగ ప్రొఫైల్‌లు ఇక్కడ ఉన్నాయి.

ఉపాధి రంగాలు

  • ప్రభుత్వ ఉద్యోగాలు

  • ఆసుపత్రులు

  • నర్సింగ్ హోమ్స్,

  • వైద్య రచన,

  • పరిపాలన,

  • ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు

  • పాఠశాలలు

ఉద్యోగ ప్రొఫైల్‌లు

  • హెడ్ నర్సింగ్ సర్వీసెస్

  • నర్సింగ్ ఇన్‌ఛార్జ్

  • అత్యవసర నర్సులు

  • నర్సింగ్ అసిస్టెంట్

  • ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సు

  • టీచర్

  • పరిశోధకుడు

జీతం

రూ 2,00,000/- నుంచి రూ 5,50,000/-

భారతదేశంలోని నర్సింగ్ కాలేజీలలో డిప్లొమా2023 (Diploma in Nursing Colleges in India2023)

కొన్ని టాప్ భారతదేశంలోని నర్సింగ్ కాలేజీలలో డిప్లొమా కింద ఇవ్వబడింది. మీరు ఈ కళాశాలల్లో దేనికైనా దరఖాస్తు చేయాలనుకుంటే, మా Common Application Form (CAF) మరియు మీకు నిపుణుల సహాయం అందించబడుతుంది.

నెంబర్

కళాశాల పేరు

టైప్

లొకేషన్

ఫీజులు

1

ఆచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

ప్రైవేట్ కాలేజ్

బెంగళూరు, కర్ణాటక

రూ. 99,000/-

2

మహాత్మా జ్యోతి రావ్ పూలే యూనివర్సిటీ

ప్రైవేట్

జైపూర్, రాజస్థాన్

రూ. 25,000/-

3

సాగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ మేనేజ్‌మెంట్

ప్రైవేట్

బారాబంకి, ఉత్తరప్రదేశ్

రూ. 36,200/-

4

నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ

ప్రైవేట్

గ్రేటర్ నోయిడా, ఉత్తర ప్రదేశ్

రూ. 40,000/-

5

శోభితా యూనివర్సిటీ

ప్రైవేట్

మీరట్, ఉత్తరప్రదేశ్)

రూ. 35,000/-

6

మేల్మరువత్తూరు అధిపరాశక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్

ప్రైవేట్

కాంచీపురం, తమిళనాడు

రూ. 20,000/-

7

టోపివాలా నేషనల్ మెడికల్ కాలేజ్

ప్రైవేట్

ముంబై, మహారాష్ట్ర

...

8


జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్

ప్రైవేట్

పుదుచ్చేరి, పాండిచ్చేరి

...

మరిన్ని సంబంధిత కథనాలు

నర్సింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి క్రింది లింక్‌లను క్లిక్ చేయండి అడ్మిషన్, దాని సంబంధిత సమాచారం:-

10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సులు ఏమిటి: కోర్సు వివరాలు, పరిధి,కళాశాలలు

మీకు ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే, దయచేసి QnA సెక్షన్ పై ప్రశ్న అడగడం ద్వారా మా నిపుణులను సంప్రదించండి. కాలేజ్ దేఖో.

మరింత నర్సింగ్ సంబంధిత సమాచారం కోసం అడ్మిషన్ , CollegeDekho తో చూస్తూ ఉండండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta

FAQs

నర్సింగ్‌ డిప్లొమాలో ఎలా అడ్మిషన్ పొందాలి?

నర్సింగ్‌ డిప్లొమాలో అడ్మిషన్ పొందడానికి అభ్యర్థులు బదిలీ సర్టిఫికెట్, మైగ్రేషన్ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్‌తో పాటు 10+2 సర్టిఫికెట్‌ను,  పదో తరగతి మార్కుల షీట్‌ని అందించాలి.

డిప్లొమా నర్సింగ్‌లో వివిధ కెరీర్ అవకాశాలు ఏమిటి?

నర్సింగ్ డిగ్రీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు హెడ్ నర్సింగ్ సర్వీస్, నర్సింగ్ అసిస్టెంట్, టీచర్, ఎమర్జెన్సీ నర్సు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సు వంటి  మరిన్ని ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

నర్సింగ్‌లో డిప్లొమా పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

నర్సింగ్‌లో డిప్లొమా పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు పడుతుంది. విద్యార్థులు నర్సింగ్‌లోని వివిధ అంశాలను నేర్చుకుంటారు. నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పోలిస్తే డిప్లొమా వ్యవధి తక్కువ. పూర్తైన తర్వాత విద్యార్థులు నమోదు చేసుకున్న నర్సులు లేదా సిబ్బంది నర్సులుగా పని చేస్తారు.

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ డిప్లొమా నర్సింగ్ కళాశాల ఏది?

  • జిప్మర్ పుదుచ్చేరి
  • సుమన్‌ దీప్ విద్యాపీఠ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్
  • నిట్టే విశ్వవిద్యాలయం
  • దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం
  • మేల్మరువత్తూరు అధిపరాశక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ & రీసెర్చ్
  • GC బెంగళూరు
  • కైలాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అండ్ పారా మెడికల్ సైన్స్
  • TNMC ముంబై

ఒక నర్సు ఎంత వరకు సంపాదించవచ్చు?

నర్సింగ్ నిపుణులలో చాలా మంది సంవత్సరానికి రూ. లక్ష రూపాయల నుంచి రూ.3.2 లక్షల వరకు సంపాదించగలరు.

డిప్లొమా ఇన్ నర్సింగ్‌లో ఉండే సబ్జెక్టులు ఏమిటి?

నర్సింగ్ డిప్లొమాలో రిసోర్స్ మేనేజ్‌మెంట్, గ్రూప్ డైనమిక్స్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, ఫీల్డ్ స్టడీ/సెమినార్, మరిన్ని వంటి సబ్జెక్టులు ఉంటాయి. అంతేకాకుండా అభ్యర్థులకు ప్రాక్టీకల్స్ కూడా ఉంటాయి. 

 

నర్సింగ్‌లో డిప్లొమా కోసం ముఖ్యమైన రిఫరెన్స్ పుస్తకాలు ఏమిటి?

  • చైల్డ్ హెల్త్ నర్సింగ్
  • కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్
  • అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ
  • మెడికల్-సర్జికల్ నర్సింగ్
  • ఇంకా చాలా ఉన్నాయి.

నర్సింగ్‌లో డిప్లొమా పూర్తైన తర్వాత ప్లేస్‌మెంట్‌లు ఎలా ఉంటాయి?

నర్సింగ్‌లో డిప్లొమా చదువుతున్న చాలా మంది విద్యార్థులు ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు పొందగలుగుతారు. కొన్ని టాప్ మాక్స్ హాస్పిటల్, మేదాంత హాస్పిటల్, ఎయిమ్స్, ఫోర్టిస్ మెమోరియల్, ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్, షాల్బీ హాస్పిటల్స్, మరిన్ని రిక్రూటర్‌లు ప్లేస్‌మెంట్ ప్రయోజనాల కోసం వివిధ క్యాంపస్‌లను సందర్శిస్తారు.

నేను 10+2 డిగ్రీ లేకుండా నర్సింగ్‌లో డిప్లొమా చదవవచ్చా?

ఏదైనా కాలేజీల్లో ఇంటర్మీడియట్ చేయకుండా నర్సింగ్‌లో డిప్లొమా చేయడం కష్టం.  10+2 ప్రాథమిక అర్హత కిందకు  వస్తుంది. నర్సింగ్ డిప్లొమా చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా అర్హతలు కలిగి ఉండాలి. 

 

 

View More
/articles/diploma-in-nursing-admission-process/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

సిమిలర్ ఆర్టికల్స్

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Nursing Colleges in India

View All
Top