- టీఎస్ గురుకులం పీజీటీ ఉద్యోగాల వివరాలు (TS Gurukulam PGT Jobs Details)
- టీఎస్ గురుకులం పీజీటీ నోటిఫికేషన్ 2023 (TS Gurukulam PGT Notification 2023)
- సబ్జెక్టుల వారీగా పీజీటీ పోస్టుల వివరాలు (TREIRB PGT Post Vacancies)
- TREIRB PGT అర్హత ప్రమాణాలు (TREIRB PGT Eligibility criteria)
- TREIRB PGT అప్లికేషన్ 2023 కోసం అవసరమైన పత్రాలు (Documents Required for …
తెలంగాణ పీజీటీ రిక్రూట్‌మెంట్ 2023 (TREIRB PGT Application 2023):
టీచర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి వాళ్లకు గుడ్‌న్యూస్.TREIRB 2023 సంవత్సరానికి PGT రిక్రూట్‌మెంట్‌ను (TS PGT Recruitment 2023) ప్రకటించింది. వివిధ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీల పరిధిలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ఈ TS గురుకులం PGT నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మొత్తం 1276 పీజీటీ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. తెలంగాణ గురుకులం సంస్థలకు టీచర్లు, ఇతర సిబ్బందిని నియమించే బాధ్యత నిర్వహిస్తుంది. బోర్డ్ ఇటీవలే 2023 సంవత్సరానికి PGT రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది.రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది.
తెలంగాణ పీజీటీ 1276 పోస్టుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్-లింక్ |
---|
ఇందులో భాగంగా తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు TSWREIS, TTWREIS, MJP TSBCWREIS, TREIS, TMREIS గురుకులాలలో సబ్జెక్ట్ వారీగా PGT పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారం అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాలు ఏమిటో ఈ ఆర్టికల్లో తెలియజేశాం. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి జీతం ఎంత ఇస్తారో ఇక్కడ తెలుసుకోవచ్చు.
టీఎస్ గురుకులం పీజీటీ ఉద్యోగాల వివరాలు (TS Gurukulam PGT Jobs Details)
రిక్రూట్‌మెంట్ పేరు | TREIRB PGT రిక్రూట్‌మెంట్ 2023 |
---|---|
పేరు | టీఎస్ గురుకులం పీజీటీ రిక్రూట్‌మెంట్ 2023 |
పీజీటీ రిజిస్ట్రేషన్ | 17-04-2023 నుంచి 17-05-2023 |
PGT పోస్టుల సంఖ్య | 1276 |
పీజీటీ పే స్కేల్ | రూ.45960 నుంచి రూ.124150 |
రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్ | http://treirb.telangana.gov.in/ |
టీఎస్ గురుకులం పీజీటీ నోటిఫికేషన్ 2023 (TS Gurukulam PGT Notification 2023)
తెలంగాణలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) పోస్టుల భర్తీకి తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) ద్వారా TREIRB PGT నోటిఫికేషన్ 2023 దాని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడింది.సబ్జెక్టుల వారీగా పీజీటీ పోస్టుల వివరాలు (TREIRB PGT Post Vacancies)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1276 పోస్టులను భర్తీ చేయగా అందులో సబ్జెక్టుల వారీగా ఎన్ని ఖాళీలున్నాయో ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది.తెలుగు | 183 |
---|---|
హిందీ | 168 |
ఇంగ్లీష్ | 180 |
మ్యాథ్స్ | 231 |
ఫిజికల్ సైన్స్ | 142 |
బయోలాజికల్ సైన్స్ | 161 |
సోషల్ స్టడీస్ | 202 |
TREIRB PGT అర్హత ప్రమాణాలు (TREIRB PGT Eligibility criteria)
PGT పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.- యూజీసీతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 45 శాతం మార్కులతో గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) (BA, BEd, BSc,BEd) చేసి ఉండాలి.
- ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి మెథడాలజీ లేదా లాంగ్వేజ్ పండిట్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
- ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి. అతను/ఆమె 58 ఏళ్లు దాటితే ఏ వ్యక్తికి అర్హత ఉండదు.
TREIRB PGT అప్లికేషన్ 2023 కోసం అవసరమైన పత్రాలు (Documents Required for TREIRB PGT Application 2023)
ఈ పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన సూచించిన అర్హతలు ఉండాలి. అదే సమయంలో వారి దగ్గర ఈ కింద తెలిపిన డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాలి. ఆ పత్రాల ఏమిటో ఇక్కడ చూడండి.- ఆధార్ కార్డ్
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ/ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు
- స్టడీ (బోనాఫైడ్), నివాస ధ్రువీకరన పత్రం
- కమ్యూనిటీ సర్టిఫికెట్ (SC/ST/BC), తెలంగాణ ప్రభుత్వం సమర్థ అధికారం ద్వారా జారీ చేయబడిన BCల విషయంలో నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికెట్
- EWS రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమర్థ అధికారం జారీ చేసిన దరఖాస్తు సంవత్సరానికి ముందు ఆర్థిక సంవత్సరానికి ఆదాయ ధ్రువీకరణ పత్రం. (01.01.2023 తర్వాత జారీ చేయబడింది).
- స్పోర్ట్స్ & డిఫరెంట్లీ ఏబుల్డ్ రిజర్వేషన్, మాజీ సైనికులకు వయో సడలింపు క్లెయిమ్ చేసే సర్టిఫికెట్లు.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా JPG ఫార్మాట్ ద్వారా అతని/ఆమె స్వంత స్కాన్ చేసిన ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
ఆసక్తి, అర్హత ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి https://treirb.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో సెలక్షన్ ఉంటుంది. అన్ని రకాలు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150ల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్, ఆర్టికల్స్ కోసం College Dekhoని చూస్తూ ఉండండి.
సిమిలర్ ఆర్టికల్స్
నవంబర్ 14 బాలల దినోత్సవం స్పీచ్ తెలుగులో (Children's Day Speech in Telugu)
సంక్రాంతి పండుగ విశేషాలు (Sankranti Festival Essay in Telugu)
ఏపీ 10వ తరగతి రీవాల్యుయేషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (AP SSC Revaluation 2025)
TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి
ఇంటర్మీడియట్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ లోకి ఎలా చేరాలి? (How to Get into the Indian Air Force after Intermediate?)
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి