విద్యార్థుల కోసం తెలుగులో ఫేర్‌వెల్ స్పీచ్ (Farewell Speech in Telugu)

Andaluri Veni

Updated On: February 09, 2024 05:14 pm IST

స్కూల్లో ఫేర్ వెల్ ఫంక్షన్ (వీడ్కోలు ఫంక్షన్)లు జరుగుతుంటాయి. ఆ సమయంలో విద్యార్థులు మాట్లాడానికి తడబడుతుంటారు. వారి కోసం ఇక్కడ ఫేర్‌వెల్ స్పీచ్‌ను (Farewell Speech in Telugu) అందజేశాం. 
విద్యార్థుల కోసం తెలుగులో ఫేర్‌వెల్ స్పీచ్ (Farewell Speech in Telugu)

తెలుగులో ఫేర్‌వెల్ స్పీచ్ (Farewell Speech in Telugu): స్కూల్లో ఫేర్ వెల్ ఫంక్షన్ (వీడ్కోలు ఫంక్షన్)లు జరుగుతుంటాయి. తమ చదువును పూర్తి చేసుకుని తోటి విద్యార్థులకు, టీచర్లకు, విద్యా సంస్థకు, స్టాఫ్‌కి వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి ఎదుర్కోక తప్పదు. ఈ ఫంక్షన్ చాలా ఉద్వేగభరితంగా సాగుతుంటుంది. ఎందుకంటే విద్యార్థులకు ఆ విద్యా సంస్థతో, టీచర్లతో, స్టాఫ్‌తో ఒక అనుబంధం ఏర్పడుతుంది.   ఆ అనుబంధాన్ని విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు విద్యార్థులు ఎంతగానో బాధపడుతుంటారు. ఆ జ్ఞాపకాలను  నింపుకుని బయటకు అడుగు పెడుతున్న వారికి కొత్త విద్యార్థులు అంతే సాదారంగా వీడ్కోలు పలుకుతుంటారు.  కానీ ఆ వీడ్కోలు ఫంక్షన్‌లో విద్యార్థులు ప్రసంగించాల్సి ఉంటుంది.

నిజానికి సంవత్సరాలుగా చదువుకున్న విద్యా సంస్థకు, టీచర్లకు, తమ ఫ్రెండ్స్‌కి  వీడ్కోలు చెప్పడం చాలా కష్టం. ఆ టైమ్‌లో మాట్లాడడం విద్యార్థులకు ఓ సవాల్ అనే చెప్పాలి. అందుకే విద్యార్థులు ఫేర్‌వెల్ స్పీచ్ (Farewell Speech in Telugu) కోసం నానా తంటాలు పడుతుంటారు. విద్యార్థులకు ఈ ఇబ్బందులను తొలగించడానికి ఆ స్పీచ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో అందజేశాం.  వీడ్కోలు ఫంక్షన్‌లో విద్యార్థులు ఎలా మాట్లాడితే బాగుంటుందో దాని కోసం అనుసరించాల్సిన టిప్స్‌ని ఇక్కడ అందజేశాం.

వీడ్కోలు చెప్పడం అంటే సంతోషం, బాధల మిశ్రమ సందర్భం అని చెప్పుకోవాలి. ఒకే సమయంలో సంస్థను, తమను విడిచి వెళ్లిపోతున్నామనే బాధ, జీవితంలో ముందుకు సాగుతున్నామనే సంతోషం రెండు ఉద్వేగాలు కలుగుతాయి. ఇలాంటి సమయంలో ఇచ్చే ప్రసంగం చాలా హుందాగా, ప్రభావంతంగా ఉండాలి.  వారు మరెంతో ముందుకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని చెబుతూనే, విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉందనే విషయాన్ని వివరించాలి.

తెలుగులో  500 పదాల ఫేర్‌వెల్ స్పీచ్   (Farewell Speech in 500 words in Telugu)

సాధారణంగా నేను ఎమోషనల్‌గా ఉండే వ్యక్తిని కాను. కానీ ఈరోజు ఉద్వేగభరితంగా మీ ముందుకు వస్తున్నాను. నేను మీ అందరితో కలపి ఇలా మాట్లాడడం ఇదే చివరిసారి అనుకుంటుంటే ఎంతో దు:ఖం కలుగుతుంది. ఇక ఈ సంస్థ‌కు సంబంధించి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అవి నా చనిపోయే రోజు వరకు నాతో ఉంటాయి. మీరందరూ కూడా ఈ జ్ఞాపకాలను మీ జీవితాంతం వరకు కొనసాగిస్తారని నేను భావిస్తున్నారు. ఈ అందమైన స్కూల్ ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.

స్కూల్ నాకు అమూల్యమైన జ్ఞాపకాలను ఇచ్చింది. నేను పాఠశాల ఆవరణలోకి మొదటిసారి అడుగుపెట్టిన రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇంత తొందరగా కాలం గడిచిపోయిందా? అనిపిస్తుంది.  ఈ పాఠశాల రోజులే జీవితంలో అత్యుత్తమమైన రోజులని తెలియ లేదు. ఇక నుంచి చిన్న చిన్న సరదా క్షణాలను కోల్పోతాను. ప్లేగ్రౌండ్‌లో ఆడుకున్నా, లేదా క్యాంటీన్‌లో,  కారిడార్‌లలో కబుర్లు చెప్పుకునే రోజులని కోల్పోతున్నానని బాధగా ఉంది.

లాస్ట్ బెల్‌ కోసం ఎదురుచూసిన సందర్భాలు, బెల్ వినగానే తరగతి గదుల నుంచి స్వేచ్ఛగా బయటకొచ్చే సమయాలు అద్భుతమైన అనుభూతులు. ఫ్రెండ్స్‌తో ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు అన్ని ఎంతో ఉత్సాహాన్ని నింపేవి. అంతేకాదు ఈ పాఠశాల జీవితం స్నేహాలు, సోషల్ యాక్టివిటీలు వంటి నాకెన్నో ఇచ్చింది.  ఫ్రెండ్స్‌తో క్యాంటీన్‌లో చిరుతిళ్లు తింటూ గడిపిన క్షణాలను మిస్ అవుతాను. అలాగే పాఠశాల స్నేహాలు నిజంగా విడదీయరానివి, ఎంతో విశ్వసనీయమైనవి. అందుకే జీవితం ఎంత కష్టంగా ఉన్నా  మేము మా పాఠశాల స్నేహితులను ఎప్పటికీ విడిచిపెట్టం. ఈ ప్రత్యేకమైన రోజున  మన స్నేహితులతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటామని మనం ప్రతిజ్ఞ చేద్దాం.

జీవితంలో ఈరోజును నేనే కాదు.. ఎవరం మరిచిపోలేము. మన జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగియబోతోంది. అయితే ఒక సరికొత్త అధ్యాయం మన కోసం ఎదురుచూస్తోంది. మనలో చాలా మందికి భవిష్యత్తు గురించి ఆలోచించడం కష్టతరమనే చెప్పాలి.  మనలో కొందరు భవిష్యత్తు గురించి చర్చ వచ్చినప్పుడల్లా వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరిలో ఏదో తెలియని భయం. ముందు ముందు ఎలా ఉండబోతుందనే సంకోచం మనస్సులో ఉంటుంది.  అయితే ఆ వైఖరిని కచ్చితంగా మార్చుకోవాలి. భవిష్యత్తు ఆనందమయంగా మార్చుకునేందుకు చాలా శ్రమ పడాలి. కష్టపడాలి. మనలో ఉండే ప్రతిభకు మరింత పదును పెట్టాలి. ఆ స్పృహ కూడా ఈ పాఠశాల జీవితమే నేర్పించింది.  భవిష్యత్తు అంటే మనం భయపడాల్సిన విషయం కాదు.  వ్యక్తిగతంగా, మన భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు. నిజానికి దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు. అయితే మా పాఠశాల అనుభవం, చదువుకు మా భవిష్యత్తుకు అండగా నిలబడతాయానుకుంటున్నాను.  ఇక టీచర్లు తెలియజేసిన విలువలు మనలో చాలా విశ్వాసాన్ని నింపాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను, మనం ఎలాంటి సవాలునైనా సులభంగా ఎదుర్కోగలం. జీవితం మనపై విసిరే ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం.

టీచర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు (Special Thanks to the Teachers)

ఈ పాఠశాల ప్రయాణంలో మన టీచర్ల గురించి, వారి నేర్పించిన విద్యా బుద్ధులు గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. అందుకే వారి  గురించి మాట్లాడకుండా ఈ స్పీచ్ ముగిస్తే చాలా అసంపూర్ణంగా ఉంటుంది.  ప్రియమైన టీచర్ల వల్లే ఈరోజు మేమంతా ఇలా ఉన్నాం.  టీచర్లు మాకు అందించిన జ్ఞానం మా జీవితంలో అత్యంత విలువైన వాటిలో ఒకటి. మీరు మాకు అందించిన ఈ జ్ఞానమే రాబోయే జీవితానికి మా ఆయుధం. ఇంత మంది నాలెడ్జ్‌ను మాకు అందించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు జీవితంలో ఎంతటి స్థాయికి ఎదిగిని దానికి కారణం టీచర్లే అయి ఉంటారనే స్పృహ నాకు  ఎప్పటికి ఉంటుంది. నాకు విద్యతో పాటు విలువలను నేర్పించిన ఉపాధ్యాయులకు ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను.   ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. చదువును మాత్రమే కాకుండా సంస్కారాన్ని నేర్పించి ఇంతటి వాళ్లను చేసింది వాళ్లే. వారికి వీడ్కోలు పలకడం చాలా కష్టంగా ఉంది.

బరువెక్కిన హృదయంతో ప్రతి ఒక్కరికీ నేను ఇప్పుడు వీడ్కోలు చెబుతున్నాను. ఎక్కడికి వెళ్లినా ఎల్లప్పుడూ ఈ  జ్ఞాపకాలలో నాలో నిలిచి ఉంటాయి. నాకే కాదు ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కోకతప్పదు. ఇక్కడ నుంచి వెళ్తున్న వారందరూ ఇదే అనుభూతి కలుగుతుంది. అంతేకాదు ఒక రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, మీరు ఇక్కడ నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు, వ్యక్తుల గురించి గర్వపడతారని కూడా నేను ఆశిస్తున్నాను.

గత కొన్ని సంవత్సరాలుగా మీరు మా విద్య, విజ్ఞానానికి మూలం ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు మనకు విద్యను అందించడమే కాకుండా జీవిత పాఠాలు కూడా బోధించారు. మా ఉపాధ్యాయులు, సంవత్సరాలుగా, ప్రపంచంతో పోటీపడేలా చేశారు. ఇంకా  అవి మన బలానికి ప్రతీక వారే. మా ఉపాధ్యాయులు మాకు మద్దతుగా నిలిచారు.  అంతేకాదు తప్పులు చేసినప్పుడు కొన్నిసార్లు ఓ తండ్రిగా దండించారు. అయితే మేము మంచిగా ఉండాలని, ప్రతిభావంతులవ్వాలనే మా పట్ల కఠినంగా ఉన్నారనే విషయం మాకు అర్థం అయింది. మీలో ఏ ఉపాధ్యాయులు కూడా మా పట్ల ఒక్క క్షణం కూడా ద్వేషాన్ని కలిగి ఉండరని అర్థమైంది.  వారు ప్రదర్శించిన కఠినత్వం  రాబోయే జీవితంలో ఒక ఆశీర్వాదంగా మారనుందని మాకు బాగా తెలుసు. ఎన్నో ఒడుదుడుకులను దాటడానికి వారు మా పట్ల వ్యవహరించిన తీరు ఎంతగానో ఉపయోగపడనుంది.

నిజానికి మాపై ఎప్పుడూ కఠినంగా ఉండరు.  కోపం లేనప్పుడు వారు తమ ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు. మన ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు ప్రవర్తిస్తుంటారు. అంటే టీచర్లకు విద్యార్థులు ప్రయోజకులవ్వాలనే తపన మాత్రమే ఉంటుంది. అందుకే మన ఎదుగుదల కోసం ఉపాధ్యాయులు ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. అటువంటి గురువులకు ఈ సందర్భంగా  కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విద్యార్థిగా వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని కూడా నాకు అనిపిస్తుంది.  మమ్మల్ని మంచి మనుషులుగా మార్చడానికి ఉపాధ్యాయులు అపారమైన కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు. మా జీవితాలలో మీరు అందించిన అపారమైన సహకారాన్ని చెప్పడానికి మాటలు కూడా సరిపోవు.  టీచర్లను విద్యార్థులుగా మేము ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామని చెప్పగలను. ఇదే సందర్భంగా పాఠశాల స్టాఫ్‌ కూడా  నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు మా కోసం చేసిన కృషిని నేను నిజంగా అభినందిస్తున్నాను.

ఫ్రెండ్స్, ఈ వీడ్కోలు మన స్కూల్ హిస్టరీలో అత్యుత్తమ వీడ్కోలుగా మలచుకుందాం. మన పాఠశాల జీవితానికి వీడ్కోలు పలికేటప్పుడు కొన్ని కన్నీళ్లు వస్తాయి. అదే సమయం కొన్ని చిరునవ్వులు పరుచుకుంటాయి.  ఈ క్షణాన్ని మేము మా జీవితాంతం పదిలింగా ఉంచుకుంటాం. ఈ పాఠశాల జీవితాన్ని ఎప్పటికి మరిచిపోలేం.. ఈ మెమరీస్‌ని వదులుకోలేం. జీవితంలో మరింత ముందుకు వెళ్తున్న సమయంలో ఈ పాఠశాల జీవితం నాకు ఉత్సాహాన్ని అందిస్తోంది. చేదు అనుభవాల్లో ఓ తియ్యని స్పర్శగా ఈ పాఠశాల జ్ఒపకాలను నన్ను పలకరిస్తుంటాయి. బై ఫ్రెండ్స్.

తెలుగులో  250 పదాల ఫేర్‌వెల్ స్పీచ్   (Farewell Speech in 250 words in Telugu)

గౌరవనీయులైన ప్రిన్సిపాల్ సార్, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, నా సీనియర్లు, నా ప్రియమైన మిత్రులకు గుడ్ మార్నింగ్. నా తరగతి విద్యార్థులందరి తరపున నా సీనియర్ల వీడ్కోలు పార్టీలో నేను మాట్లాడలనుకుంటున్నాను.  ఫ్రెండ్స్.. ఈరోజే మీతో, ఈ స్కూల్ ప్రాంగణంలో గడిపే చివరి రోజు. వీడ్కోలు చెప్పడానికి మనస్సు రావడం లేదు. కానీ వెళ్లక తప్పడం లేదు. నా అల్లరిని భరించినందుకు, నా పాఠాలను, బతుకు పాఠాలను నేర్పించినందుకు టీచర్లకు ధన్యవాదాలు. నా చిలిపి పనులను, మాటలను  సహించినందుకు తోటి విద్యార్థులకు చాలా చాలా  థ్యాంక్స్. ఈ పాఠశాల ఆవరణలో గడిపిన ప్రతి క్షణం నాకు చాలా అమూల్యమైనది. ఎప్పటికీ కోల్పోనిది. క్లాస్ రూంలో, క్యాంటీన్‌లో, ప్లే గ్రౌండ్‌లో, ల్రైబరరీలో ఇలా గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతగానో నచ్చింది. ఈ ప్రతిష్టాత్మక పాఠశాలలోని ప్లేగ్రౌండ్, లైబ్రరీ, ల్యాబ్ రూమ్‌లో మేము చాలా సంవత్సరాలు కలిసి చాలా ఆనందించాం.  ఈ పాఠశాల నాకు పరీక్షలు పెట్టడమే కాదు.. ఎంతో మంచి ఫ్రెండ్స్‌ని అందించింది.

మేము వేర్వేరు నేపథ్యాల నుంచి ఇక్కడ వచ్చాం. అయితే మేము ఒకే యూనిఫాం ధరించినందున పాఠశాలలో ఒకేలా కనిపిస్తాం. మనందరికీ భిన్నమైన భావాలు, వైఖరులు ఉన్నాయి. అయినా సరే ఉపాధ్యాయులు మమ్మల్ని ఒకే విధంగా చూశారు. కేవలంలో క్లాసు రూములోని పాఠాలని మాత్రమే కాదు మాలోని వెనుకబాటు ఆలోచనలను సరిచేశారు. తెలియక చేసిన తప్పులను మన్నించారు. మాలో ఉన్న తప్పుడు ఆలోచనలను భరించారు. ఎదుటి వారిని కలుపుకోవడం, కలసికట్టుగా ఉండడంలో మాధుర్యాన్ని తెలియజేశారు.

పాఠశాలల పొందిన నాలెడ్జ్‌తో ఇప్పుడు మరింత ముందుకు వెళ్లే సమయం వచ్చింది.  మేము చాలా సంవత్సరాల క్రితమే ఈ పాఠశాలలో చేరాం. అయితే అప్పుడే మా పాఠశాల జీవితం అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది.  ఈ పాఠశాల విద్యా వాతావరణం చాలా కఠినంగా, ప్రేరణాత్మకంగా ఉంది. మాకు చాలా బాగా నచ్చింది. మంచి చదువుతో కలిసి ఎన్నో అనుభవాలు పొందాం. నేను మీతో కొన్ని సరదా క్షణాలను పంచుకోవాలనుకుంటున్నాను.

నేను నా చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడిని. సాధారణంగా తరగతి గదిలో నా స్నేహితులను ఆటపట్టించేవాడిని. అయితే నా క్లాస్ టీచర్ చక్కటి బోధన వల్ల నా చెడు ప్రవర్తనలన్నీ మంచివిగా మారిపోయాయి. నన్ను నిజంగా మంచి విద్యార్థిగా మార్చిన నా ఉపాధ్యాయులందరికీ నేను చాలా కృతజ్ఞుడని.  ఎన్నో సంతోషకరమైన, విలువైన అనుభవాలను అందించిన పాఠశాలకు, స్నేహితులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

తెలుగులో  200 పదాల ఫేర్‌వెల్ స్పీచ్   (Farewell Speech in 200 words in Telugu)

ఫ్రెండ్స్.. ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఎన్నో మీతో పంచుకోవాలనుంది. కానీ మాట్లాడలేకపోతున్నాను. పాఠశాలల ఇన్నిరోజులు అప్పుడే గడిచిపోయాయా? అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎంతో సరదాగా సాగిపోయింది. ఆట, పాటలతో, సరదాలతో, మార్కులు, పరీక్షలతో గడిచిపోయింది. ఈ పాఠశాల ఆవరణలో ఏడ్చిన రోజులు, ఏడిపించిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. ఓడిపోవడం, గెలవడం అన్ని ఇక్కడ చూశాను. తెచ్చుకున్న ఫుడ్‌నే కాదు, బాధలని కూడా స్నేహితులతో పంచుకోవడం కూడా ఇక్కడ తెలుసుకున్నాను. ఇంతలోనే ఇక్కడ వారిని వదిలి వెళ్లాలనే ఆలోచన నన్ను చాలా చాలా బాధిస్తుంది.
తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎలా వీడ్కోలు చెప్పాలో తెలియడం లేదు.

నాలాంటి చాలామంది విద్యార్థులను ఈ స్కూల్‌ తయారు చేసింది. కానీ నాకు మాత్రం ఈ స్కూల్ చాలా ప్రత్యేకమైనది. ఈ పాఠశాలల్లో ఉన్న ప్రతి బెంచ్, ప్రతి క్లాస్, ప్రతి చెట్టు నాకు, నా స్నేహితులకు బాగా తెలుసు. ఈ స్కూల్ క్లాసులోనే కాదు.. మేము ప్లే గ్రౌండ్‌లో కూడా మేము చాలా నేర్చుకున్నాం. ఈ స్కూల్లో ప్రతి వస్తువుతోనూ, చెట్టు, పుట్టతోనూ, బ్లాక్ బోర్డుతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

స్నేహితులతో కలిసి బిగ్గరగా నవ్వడం, జోకులు, నవలలు చదవడం, ఇతరుల లంచ్ బాక్స్‌లు తినడం, రోడ్లపై పరుగెత్తడం, మెట్లపై పోటీలు, స్నేహితులను ఎగతాళి చేయడం వంటి ఎన్నో సంతోషకరమైన క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ జ్ఞాపకాలన్నీ నాకు విలువైనవి. నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. పాఠశాల మన రెండో ఇల్లు లాంటిది, అక్కడ మేము మా భవిష్యత్తును రూపొందించుకున్నాం. నేను భవిష్యత్తులో నా స్నేహితులను కలుస్తానో లేదో నాకు తెలియదు కానీ Facebook, ఈ మెయిల్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్, స్కైప్, గూగుల్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల ద్వారా వారితో కచ్చితంగా కనెక్ట్ అయి ఉంటాను.

పాఠశాలల నేను పొందిన ప్రతిదానికీ అంటే ఉపాధ్యాయులకు, వారు అందించిన ప్రేమకి, స్నేహానికి, నా స్నేహితులు, జూనియర్‌లందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఎవరినైనా బాధించినందుకు, నా ప్రవర్తన విసిగించినందుకు నన్ను క్షమించండి. జూనియర్లకు, నా ప్రియమైన స్నేహితులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పదో తరగతి విద్యార్థుల కోసం ఫేర్ వెల్ స్పీచ్ (Farewell Speech for 10th Class Students)

ఇక్కడ ఉన్న వారందరికీ చాలా శుభోదయం..

నేను ఈ రోజు కొంచెం ఉద్విగ్నంగా ఉన్నాను. మీరందరూ అదే అనుభూతి చెందుతున్నారని నాకు తెలుసు. మీ తల్లిదండ్రులు మరియు సంరక్షకులు మిమ్మల్ని ఈ పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద విడిచిపెట్టి, మీ చిన్న అడుగులు కొత్త ప్రదేశంలోకి అడుగుపెట్టిన రోజులు నాకు స్పష్టంగా గుర్తున్నాయి.

పాఠశాలలోకి మీ మొదటి చిన్న అడుగులు వేయడానికి మీరందరూ ఉపాధ్యాయుల చేతులు పట్టుకున్నారు. మీరు ఏడ్చారు, చిరాకు పడ్డారు, మీ తరగతి గది మినహా అన్ని వైపులకు ఇక్కడ మరియు అక్కడకు పరిగెత్తారు. మీరందరూ సర్దుకుపోవడానికి కొన్ని రోజులు మరియు మీ టీచర్లను ఇష్టపడటానికి కొన్ని నెలలు పట్టింది, కానీ ఈ రోజు మీ టీచర్, క్లాస్‌రూమ్‌లు, ప్లేగ్రౌండ్ మరియు మొత్తం పాఠశాల మీకు అత్యంత ప్రత్యేకమైనవిగా మారవచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

కొన్నిసార్లు మీరు నిరుత్సాహానికి గురయ్యారు, కొన్నిసార్లు మీరు సంతోషంగా లేరు, కొన్నిసార్లు మీరు సరదాగా ఉంటారు మరియు కొన్నిసార్లు మీరు అధ్యయనం చేసేవారు కానీ మీ ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ మీకు మంచిగా మరియు సుఖంగా ఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కాబట్టి, మీరు మీ గురువులు మరియు గురువులు మరియు మీ రెండవ తల్లిదండ్రులు అయిన మీ గురువుల పట్ల మీరు కృతజ్ఞతలు మరియు కృతజ్ఞతలు తెలియజేయవలసిన సమయం ఇది.

ప్రిన్సిపాల్‌గా, మీపై విశ్వాసాన్ని పెంపొందించడానికి మిమ్మల్ని సరిగ్గా పోషించడానికి నేను ఎల్లప్పుడూ నా వంతు ప్రయత్నం చేశాను. ఈ ఉదయం అసెంబ్లీ ద్వారా, మీ కోసం, మీ కుటుంబ స్నేహితులు మరియు మీ దేశం కోసం మీ పరీక్షల కోసం ప్రార్థించమని నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేరేపించాను. ఈ విద్యాలయం నుండి మీరు ఈ రోజు హృదయంలో మీతో పాటు జ్ఞాన నిధిని తీసుకుంటున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

జూనియర్ విద్యార్థులకు వీడ్కోలు ప్రసంగం (Farewell Speech for Students by Junior)

గౌరవనీయులైన ప్రిన్సిపాల్ సార్, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, నా సీనియర్లు, నా ప్రియమైన మిత్రులకు శుభోదయం. నా తరగతి విద్యార్థులందరి తరపున నా సీనియర్ల వీడ్కోలు పార్టీలో నేను మాట్లాడాలనుకుంటున్నాను.  ఇంటర్మీడియట్ చదువుతున్న మా సీనియర్‌ల వీడ్కోలు పార్టీ. మేము ఈ ప్రతిష్టాత్మక పాఠశాల  ప్లేగ్రౌండ్, లైబ్రరీ, ల్యాబ్ రూమ్‌లో చాలా సంవత్సరాలు ఆనందించాం. మేము వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చాం. అయితే మేము ఒకే యూనిఫాం ధరించినందున పాఠశాలలో ఒకేలా కనిపిస్తాం. మనందరికీ భిన్నమైన భావాలు, వైఖరులు ఉన్నాయి. అయినప్పటికీ  మేము మా సీనియర్లతో పాఠశాలలో మంచి లక్షణాలను అభివృద్ధి చేస్తాం.

మన హోం వర్క్ లేదా ఇతర క్లాస్‌ వర్క్‌ల కోసం మేము మా సీనియర్ల నుంచి సహాయం తీసుకున్నాం. ఏ పరిస్థితిలోనైనా మాకు సహాయం చేయడానికి మా సీనియర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మా ఫుట్‌బాల్ మ్యాచ్ పోటీ, క్విజ్ పోటీల సమయంలో వారు మాకు చాలా సహాయం చేశారు. నా సీనియర్స్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను మా జూనియర్లకు మంచి సీనియర్‌గా మారుతాను.

ఈ సందర్భంగా సీనియర్లతో నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు నుంచి మీరు పాఠశాల నుంచి కళాశాలలకు వెళ్తున్నారు. మీ కాలేజీ జీవితం ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నందని నేను భావిస్తున్నాను. మీరు సరైన వృత్తిలో రాణించేందుకు ఈ కళాశాల జీవితం ఎంతో దోహదం చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు వీడ్కోలు చెప్పడం చాలా కష్టంగా ఉంది. మేము మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోము.  భవిష్యత్తులో మీరు, మీ సహాయం మాకు ఎల్లప్పుడూ అవసరం అవుతుంది.  మీ సహాయ సహకారాలు ఇక ముందు కూడా మాకు అందించాల్సిందిగా కోరుతున్నాను.

ప్రాథమిక పాఠశాల నుంచి వెళ్లిపోయే విద్యార్థులకు వీడ్కోలు ప్రసంగం (Farewell Speech for Students Leaving Primary School)

ఇక్కడ ఉన్న వారందరికీ శుభోదయం..

కొన్ని సంవత్సరాల క్రితం, మీరందరూ ఈ ప్రతిష్టాత్మకమైన లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి మనోహరమైన, ఉత్సాహభరితమైన విద్యార్థులుగా వచ్చారు. ఇప్పుడు మీరు ఏదైనా వాస్తవ ప్రపంచ సవాలును స్వీకరించడానికి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న పరిణతి చెందిన యుక్త వయస్కులుగా వెళ్తున్నారు. ఈ ప్రపంచంలో మీ సొంత గుర్తింపును ఏర్పరచుకోవడానికి మీరు మీ జీవితకాల వృత్తిని ఎంచుకునే సమయం ఇది. ఈ సమయంలో మీరు మీ జీవితం, వృత్తిపరమైన చదువుల గురించి తీవ్రంగా ఆలోచించవలసి ఉంటుంది.

ఈ రోజు మిమ్మల్ని ఈ హాల్లో చూసినప్పుడు నాకు గొప్ప సంతృప్తిని కలిగించే రేపటి నాయకులుగా కనిపిస్తున్నారు.  మీతో కలిసి ఇన్ని సంవత్సరాలుగా కలసి ఉన్నాం. మేము ఎప్పటికీ ఆదరించే ఆనందకరమైన జ్ఞాపకాలను మీరు మాకు అందించారు. మీలో కొందరు మమ్మల్ని బాగా నమ్మారు. మీ విద్యాపరమైన లేదా వ్యక్తిగత సమస్యలను మాతో పంచుకున్నారు. మాపై మీకున్న నమ్మకాన్ని చూసి మేము చాలా సంతోషంగా ఉండేవాళ్లం. మీ సమస్యలను నిర్భయంగా పరిష్కరించడానికి సాధ్యమైనంత ఉత్తమమైన మార్గంలో మీకు మార్గనిర్దేశం చేయడానికి, సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ తీవ్రంగా ప్రయత్నించాం.  కాబట్టి మీరు మీ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరచడానికి వారి అద్భుతమైన ప్రయత్నాల కోసం ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

మీ ప్రిన్సిపాల్‌గా ఈ రోజు నేను మీకు చెబుతాను. రాబోయే జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. అయితే మీరందరూ ఈ కష్టాలు, సవాళ్లతో పోరాడి నిలబడతారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు దృఢంగా ఉండండి. జీవితంలో  స్నేహితులను తెలివిగా ఎన్నుకోండి. మీ అన్ని పనులను చేసేటప్పుడు ఓపికగా ఉండండి. కష్టపడి పని చేయడానికి భయపడకండి. కష్టపడి పని చేస్తేనే జీవితంలో కచ్చితంగా విజయం సాధించవచ్చు.

పది లైన్లలో పాఠశాల నుంచి వెళ్తున్న విద్యార్థుల వీడ్కోలు ప్రసంగం (10 Lines on a Farewell Speech By Students Leaving School)

ఫేర్‌వెల్ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడలేరు. ఎందుకంటే వారిలో మిశ్రమ ఉద్వేగాలుంటాయి. కానీ ఆ సమయంలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థుల కోసం సింపుల్‌గా ఫెయిల్ వెల్ కార్యక్రమంలో మాట్లాడాల్సిన, ప్రస్తావించాల్సిన విషయాలను ఇక్కడ అందజేశాం.
  • అందరికీ వీడ్కోలు చెప్పడం అంత సులభమైన విషయం కాదు.  దీని గురించి ఎవరూ మనకు  బోధించలేదు.
  • ప్రతి ప్రయాణానికి ప్రారంభం, ముగింపు ఉంటుంది. ఇన్నేలా తర్వాత, మా స్కూల్ జీవితానికి వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది.
  • నా స్నేహితులు, ఉపాధ్యాయులందరితో సహా మీలో ప్రతి ఒక్కరినీ నేను మిస్ అవుతున్నాను.
  • కలసి తిరిగిన కాలాన్ని, క్యాంటీన్‌లో కబుర్లను, చిరుతిళ్లు తింటూ గడిపిన సందర్భాలను నేను మిస్ అవుతాను.
  • మనమందరం భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉండాలి.  జీవితం మనపై విసిరే ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ ప్రిపేర్ అయి ఉండాలి.
  • ఈ స్కూల్‌ను విడిచిపెట్టి, నా జీవితంలోని ఈ అధ్యాయాన్ని ముగించడం నాకు చాలా బాధగా ఉంది. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలని నాకు ఆసక్తిగా ఉంది.
  • ఇన్నేళ్లూ నాకు సహాయం చేసినందుకు నా స్నేహితులందరికీ, నా టీచర్లందరికీ, నాన్ టీచింగ్ స్టాఫ్‌కి ధన్యవాదాలు.
  • ఏది ఏమైనా మనం టచ్‌లో ఉంటామని, ఈ వీడ్కోలు మన స్కూల్ డేస్‌కి వీడ్కోలు అని, మన స్నేహానికి ఎప్పటికీ ఉండదని గుర్తుంచుకోండి.

కాలేజీ విద్యార్థులు ఫేర్ వెల్ ప్రసంగానికి ప్రిపేర్ అయ్యేందుకు టిప్స్ (Tips To Write Farewell Speech for College Students)

కాలేజీ విద్యార్థులు వీడ్కోలు సభలో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం  మంచి టిప్స్ ఇక్కడ అందజేశాం.
  • ముందుగా ఒక డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసుకోవాలి.
  • ప్రసంగం ప్రారంభంలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి.
  • హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి.
  • మీ ఆలోచనలను పంచుకోవడానికి ఏ మాత్రం సంకోచించకండి
  • మీ ప్రసంగం మరింత ఆసక్తికరంగా ఉండేంది. కొన్ని చిన్న చిన్న కథలను షేర్ చేసుకోవాలి.
  • ప్రేక్షకులతో ఎంగేజ్ అయ్యేలా మాట్లాడేటప్పుడు రిలాక్స్‌గా ఉండాలి.
  • ప్రేక్షకుల ప్రతి స్పందనను గమనిస్తూ.. దానికనుగుణంగా మీ ప్రసంగాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలి.
  • సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రసంగం సమయంలో నవ్వండి, నవ్వించండి.
  • మీరు వీడ్కోలు పలికిన వారికి కృతజ్ఞతలు తెలియజేయండి.

మంచి వీడ్కోలు ప్రసంగాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? (How to Prepare a Memorable Farewell Speech)

మీరు మీ వీడ్కోలు ప్రసంగాన్ని అందించే ముందు, మీరు ఒక ప్రణాళికను రూపొందించాలి. తగినంత ప్రిపరేషన్ మీ ప్రసంగాన్ని ఇవ్వడానికి సమయం వచ్చినప్పుడు మీరు ప్రశాంతంగా మరియు మరింత ఆత్మవిశ్వాసంతో అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. మీరు మీ మొత్తం ప్రసంగాన్ని వ్రాయాలనుకోవచ్చు లేదా మీ ప్రధాన మాట్లాడే అంశాలను వివరించవచ్చు.

డ్రాఫ్ట్ సిద్ధం  చేసుకోవాలి: ప్రసంగంలో ముందుగా ఏమేమి మాట్లాడుకోవాలనుకుంటున్నారో? ఆ పాయింట్లను జాబితా చేసుకోవాలి.  స్పీచ్‌లో తోటి విద్యార్థుల గురించి, ఉపాధ్యాయులు, స్టాఫ్‌ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్లను రాసుకోండి.

ఇంట్రడక్షన్ రాసుకోండి: స్పీచ్‌లో ముందు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని రాసుకోవాలి. మిమ్మల్ని మీరు చాలా సహజంగా, అర్థవంతంగా పరిచయం చేసుకునే విధంగా ఇంట్రడక్షన్ రాయండి. ప్రేక్షకులకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి.  మీరు స్కూల్‌ని విడిచిపెడుతున్న సందర్భాన్ని ప్రస్తావిచంాలి. అందరికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ నాలుగు అంశాలు ఉండేలా చూసుకోవాలి.

మీ ఐడియాలను పంచుకోండి: మీ పరిచయం అయిన తర్వాత  నిజాయితీగా, గౌరవప్రదమైన స్వరంలో పాఠశాలతో మీకున్న  అనుభవాలు, జ్ఞాపకాల గురించి పంచుకోవాలి.  మీ ప్రత్యేక హాస్యంతో మీ వ్యక్తిత్వం తెలిసేలా ప్రసంగం ఉండేలా ప్రిపేర్ చేసుకోండి.  మీ స్నేహితులను, వారితో గడిపిన సమయాన్ని గురించి అందులో ఉండేలా చూసుకోండి. వీలైనంత వరకు పాజిటివ్‌‌గా ఉండేలా  వీడ్కోలు ప్రసంగాన్ని సిద్ధం చేసుకోండి.

ఎడిట్ చేయండి: మీరు రాసుకున్న ప్రసంగాన్ని మళ్లీ ఒక్కసారి బిగ్గరగా చదువుకోండి.  మీరనుకున్న విధంగా వచ్చిందో లేదో చూసుకోండి.  పదాలు సరిగ్గా లేకపోతే ఎడిట్ చేసుకోండి.  అనవసరమై అంశాలుంటే తొలగించండి.  వీడ్కోలు ప్రసంగం ఐదు నిమిషాల కంటే తక్కువగా ఉండేలా ఎడిట్ చేయండి. ఫైనల్‌గా ఫ్రూఫ్ చూసుకుని మీరనుకున్న విధంగా స్పీచ్ ఇచ్చేందుకు మానసికంగా కూడా ప్రిపేర్ అవ్వండి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం College Dekhoని ఫాలో అవ్వండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/farewell-speech-in-telugu/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!