- టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023 పూర్తి వివరాలు (TS DOST Admission 2023 …
- టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023 ముఖ్యమైన వివరాలు (TS DOST Admission 2023 …
- టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023 ముఖ్యమైన తేదీలు (TS DOST Admission 2023 …
- టీఎస్ దోస్త్ 2023 అర్హత ప్రమాణాలు (TS DOST 2023 Eligibility Criteria)
- టీఎస్ దోస్త్ అప్లికేషన్ ఫార్మ్ 2023 కో సం కావాల్సిన డాక్యుమెంట్లు (Required …
- టీఎస్ దోస్త్‌లో 2023 ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? (How to Fill TS …
- DOST UG అడ్మిషన్ 2023లో పాల్గొన్న విశ్వవిద్యాలయాల జాబితా (List of University …
టీఎస్ డిగ్రీ అడ్మిషన్ 2023 (TS Degree Admission 2023):
మీరు ఇంటర్ పూర్తి చేశారా? డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే డిగ్రీలో ప్రవేశాల కోసం (TS Degree Admission 2023) ఎదురుచూసే వారికి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్లో అందజేశాం. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో అడ్మిషన్లు ఎలా పొందవచ్చో, ఇష్టమైన కాలేజీలను, కోర్సులను ఎలా ఎంచుకోవచ్చో? ఇక్కడ తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఆన్‌లైన్ విధానంలో దోస్త్ (DOST) ఆన్‌లైన్ వేదిక ద్వారా డిగ్రీలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. డిగ్రీ ప్రవేశాల కోసం (TS DOST 2023) దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ పూరన్తైంది. దోస్త్ 2023 ఇంట్రా కాలేజ్ ఫేజ్ 3 అలాట్‌మెంట్ పబ్లిష్ అయింది.
DOST అడ్మిషన్ 2023 ప్రక్రియ ద్వారా B.A, B.Com (Voc), B.Com (Hon), BSW, BBM, BCA మరిన్ని కోర్సుల్లో ప్రవేశాన్ని పొందవచ్చు. షెడ్యూల్ ప్రకారం దోస్త్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. వెబ్ ఆప్షన్లను అందించాలి. డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రాసెస్‌లో భాగంగా దోస్త్ అడ్మిషన్ల కోసం వెబ్ కౌన్సెలింగ్ జరిగింది. నిర్దిష్ట రౌండ్లో సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి, సంస్థలో ధ్రువీకరించుకున్నారు.
టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023 పూర్తి వివరాలు (TS DOST Admission 2023 full Deatails)
టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.విశేషాలు | వివరాలు |
---|---|
కండక్టింగ్ బాడీ | తెలంగాణ స్టేట్ కౌన్సెల్ ఆఫ్ హయ్యార్ ఎడ్యుకేషన్ |
అధికారిక వెబ్‌సైట్ | dost.cgg.gov.in |
టీఎస్ దోస్త్ 2023 రిజిస్ట్రేషన్ | ఆన్‌లైన్ |
కాలేజీల సంఖ్య | 978 |
పాల్గొనే యూనివర్సిటీల సంఖ్య | 06 |
కోర్సుల సంఖ్య | 510 |
టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023 ముఖ్యమైన వివరాలు (TS DOST Admission 2023 Important Points)
తెలంగాణ దోస్త్ 2023 ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విషయాలను నిర్ధారణ చేసుకోవాలి.- TS DOST అధికారిక పోర్టల్ దరఖాస్తు ఫార్మ్‌ను విడుదల చేస్తుంది.
- రిజిస్ట్రేషన్‌కు ముందు అభ్యర్థులు తమ ఆధార్ నెంబర్ వారి మొబైల్ నెంబర్‌తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోవాలి.
- అభ్యర్థులకు DOST 2023 అడ్మిషన్ ప్రాసెస్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే వారికి సమీపంలోని DOST హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలి.
- ఆసక్తి గల అభ్యర్థులు దోస్త్ 2023 కింద అడ్మిషన్‌ను అందిస్తున్న వివిధ కాలేజీలను జాగ్రత్తగా పరిశీలించాలి.
టీఎస్ దోస్త్ అడ్మిషన్ 2023 ముఖ్యమైన తేదీలు (TS DOST Admission 2023 Dates)
అభ్యర్థులు తప్పనిసరిగా నిర్వహించే అధికారం ద్వారా నిర్దేశించిన అన్ని ముఖ్యమైన ఈవెంట్‌లపై ట్యాబ్‌ను ఉంచాలి. అందువల్ల దరఖాస్తుదారులు DOST 2023 అడ్మిషన్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీల కోసం దిగువ పట్టికను చూడాలి, తద్వారా వారు ఏ ఈవెంట్‌ను కోల్పోరు.ఈవెంట్ | ముఖ్యమైన తేదీలు |
---|---|
టీఎస్ దోస్త్ 2023 నోటిఫికేషన్ | మే 11, 2023 |
ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ | మే 16, 2023 |
ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్లు | మే 20 నుంచి జూన్ 11, 2023 |
ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ రౌండ్ 1 PH/CAP | జూన్ 08, 2023 |
NCC/ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ | జూన్ 09, 2023 |
సీట్ల కేటాయింపు జాబితా (మొదటి జాబితా) | జూన్ 16, 2023 |
సీట్ల కేటాయింపు జాబితా (1వ జాబితా) | జూన్ 16, 2023 |
సంబంధిత కాలేజీలకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ | జూన్ 16 నుంచి 25, 2023 వరకు |
రెండో రౌండ్ నమోదు | జూన్ 16 నుంచి 26,2023 వరకు |
వెబ్ ఆప్షన్లు రౌండ్ 2 | జూన్ 16 నుంచి 27, 2023 వరకు |
ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ - రౌండ్ 2 | జూన్ 26 2023 |
(PH/CAP/NCC/ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్) | |
సీటు కేటాయింపు (2వ జాబితా) | జూన్ 30, 2023 |
సంబంధిత కళాశాలలకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ | జూలై 1 నుంచి 5, 2023 వరకు |
ప్రత్యేక కేటగిరీ ధ్రువీకరణ - రౌండ్ 3 | |
మూడో రౌండ్ నమోదు | జూలై 1 నుంచి 14, 2023 వరకు |
వెబ్ ఆప్షన్లు రౌండ్ 3 | జూలై 1 నుంచి 15, 2023 |
(PH/CAP/NCC/ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్) | జూలై 14, 2023 |
సీటు కేటాయింపు (3వ జాబితా) | జూలై 20, 2023 (పబ్లిష్ అయింది) |
సంబంధిత కళాశాలలకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ | జూలై 21 నుంచి 31, 2023 వరకు |
ఆన్‌లైన్ స్వీయ-నివేదిత విద్యార్థులందరూ కళాశాలలకు రిపోర్ట్ చేయడం | జూలై 22 నుంచి 31, 2023 వరకు |
ఇంట్రా-కాలేజ్ ఫేజ్ సీట్ల ప్రచురణ | ఆగస్టు 5 |
ప్రత్యేక దశ రిజిస్ట్రేషన్లు | ఆగస్టు 7 నుంచి 13 వరకు (ప్రారంభమైంది) |
ప్రత్యేక డ్రైవ్ దశ కోసం DOST 2023 వెబ్ ఆప్షన్లు | ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు |
ప్రత్యేక డ్రైవ్ వెబ్ ఆప్షన్లు | ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 5 వరకు |
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | సెప్టెంబర్ 4 |
స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కోసం సీట్ల కేటాయింపు | సెప్టెంబర్ 9 |
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ | సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు |
టీఎస్ దోస్త్ 2023 అర్హత ప్రమాణాలు (TS DOST 2023 Eligibility Criteria)
- అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్రం (BIETS) లేదా మరొక బోర్డు నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
- అడ్మిషన్స్ కమిటీ వారి మొదటి ప్రయత్నంలోనే వారి అర్హత పరీక్షలలో ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తుంది.
ఇతర కోర్సులకు ఉండాల్సిన అర్హతలు
- BIETS లేదా ఏదైనా ఇతర సంబంధిత బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (వృత్తిపరమైన) మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సును క్లియర్ చేసిన అభ్యర్థులు B.A.లో ప్రవేశానికి అర్హులు. లేదా దోస్త్ పరిధిలోని కాలేజీల్లో బీకామ్ కోర్సులకు అర్హులు. అదనపు బ్రిడ్జ్ కోర్సును చదివిన వివిధ B.Sc లో ప్రవేశానికి అర్హులు.
- B.Sc కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చదవాలనుకునే సబ్జెక్ట్‌లో 40 శాతం స్కోర్‌తో అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
- ఆర్ట్స్ లేదా కామర్స్ స్ట్రీమ్‌లలో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు B.Scకి హాజరు కావడానికి అర్హులు కాదు.
- సైన్స్, ఆర్ట్స్ లేదా కామర్స్ స్ట్రీమ్‌లలో ఏదైనా అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు B.A, B.Com, BSW, BBA, BBM, BCA ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- BSW ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోరుకునే దరఖాస్తుదారులు తప్పనిసరిగా అర్హత పరీక్షలో కనీసం 40 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది.
టీఎస్ దోస్త్ అప్లికేషన్ ఫార్మ్ 2023 కో సం కావాల్సిన డాక్యుమెంట్లు (Required Documents for TS Dost Application Form 2023)
DOST 2023 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించేటప్పుడు అభ్యర్థులు ఈ మెయిల్ ఐడీ , ఫోన్ నెంబర్‌తో నమోదు చేసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు ఫార్మ్‌తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్ల గురించి ఈ దిగువున అందజేయడం జరిగింది.
- ఆధార్ కార్డ్
- యాక్టివ్ మొబైల్ నెంబర్
- అభ్యర్థి ఫోటో
- అర్హత పరీక్ష సర్టిఫికెట్
- బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికెట్ (అవసరమైతే)
- స్పోర్ట్స్ & ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సర్టిఫికెట్ (అవసరమైతే)
- PWD సర్టిఫికెట్ (అవసరమైతే)
టీఎస్ దోస్త్‌లో 2023 ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే? (How to Fill TS DOST Application Form 2023)
టీఎస్ దోస్త్‌లో 2023 రిజిస్ట్రేషన్‌కు ఈ దిగువున తెలిపిన విధానాన్ని ఫాలో అవ్వాలి- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.in కు వెళ్లాలి.
- హోంపేజీకి ఎడమ వైపున ఉన్న 'Candidate pre-registration’ ట్యాబ్‌ను ఎంచుకోవాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అర్హత పరీక్ష, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నెంబర్, అభ్యర్థి పేరు, తండ్రి పేరు ఇవ్వాలి. చివరగా డిక్లరేషన్ బాక్స్‌లో ‘ఆధార్ అథెంటికేషన్’ బటన్‌పై క్లిక్ చేయాలి
- తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వచ్చిన OTPని జోడించాలి.
- తర్వాత కంప్యూటర్ స్క్రీన్‌పై మీ DOST ID కనిపిస్తుంది.
- అనంతరం proceed for payment బటన్‌ను ఎంచుకుని దోస్త్ 2023 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈ-వాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
- DOST పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి మొబైల్ నెంబర్‌కు 6 అంకెల పిన్ వస్తుంది.
- DOST పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి DOST ID, 6 అంకెల PINని నమోదు చేయాలి.
- తర్వాత ‘application details entry'పై క్లిక్ చేసి మీ DOST 2023 దరఖాస్తు ఫార్మ్‌ని పూరించాలి.
- అనంతరం అవసరమైన పత్రాలను స్కాన్ చేస అప్‌లోడ్ చేయాలి. తర్వాత గుర్తులు, సంప్రదింపు వివరాలను నమోదు చేయాలి.
- సహాయక పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి
- DOST దరఖాస్తు ఫార్మ్‌లో మార్పులు చేయడానికి లేదా తప్పులను సవరించడానికి 'ప్రివ్యూ'ని చూసుకోవాలి.
- ఒక్కసారి అప్లికేషన్ చెక్ చేసుకుని DOST 2023 దరఖాస్తు ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి.
- మీ దరఖాస్తు ఫార్మ్‌ని విజయవంతంగా ఆమోదించబడిన తర్వాత ఓ మెసెజ్‌ని అందుకుంటారు. తర్వాత సూచన కోసం మీ DOST అప్లికేషన్ నెంబర్‌ని గుర్తించాలి.
- తర్వాత వెబ్ ఆప్షన్‌లను, మీకు నచ్చిన కోర్సులు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఎంచుకోవాలి.
- CBCS కోర్సుల కోసం అదనపు సమాచారం అందించవలసి ఉంటుంది.
- వివిధ CBCS ప్రాధాన్యతల కోసం అభ్యర్థులు అనేక సబ్జెక్ట్ కాంబినేషన్‌లను ఇవ్వాలి
- తర్వాత "CBCSతో వెబ్ ఆప్షన్ల సేవ్ చేయి"పై క్లిక్ చేయాలి.
- "మీ సమర్పించిన వెబ్ ఆప్షన్లు విజయవంతంగా సేవ్ చేయబడ్డాయి" అని మీ కంప్యూటర్ స్క్రీన్‌పై మెసెజ్ కనిపిస్తుంది.
DOST UG అడ్మిషన్ 2023లో పాల్గొన్న విశ్వవిద్యాలయాల జాబితా (List of University Participated in DOST UG Admission 2023)
తెలంగాణలోని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ కొన్ని యూనివర్సిటీల యూజీ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లను ప్రకటించింది. DOST UG కళాశాల జాబితా 2023 వివరాలను ప్రభుత్వం ప్రధాన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక్కడ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివరాలను అందిస్తాం. ఈ యూనివర్సిటీల అభ్యర్థులు వంద రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. DOST అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం ఆరు విశ్వవిద్యాలయాలను అందిస్తుంది.
- ఉస్మానియా యూనివర్సిటీ
- పాలమారు విశ్వవిద్యాలయం
- తెలంగాణ యూనివర్సిటీ
- శాతావాహన విశ్వవిద్యాలయం
- కాకతీయ యూనివర్సిటీ
- మహాత్మా గాంధీ యూనివర్సిటీ
తెలంగాణ (TS DOST) ఆన్‌లైన్ సర్వీస్ ద్వారా ఈ ఆరు విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న కాలేజీల్లో UG కోర్సులకు ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో 400000 కంటే ఎక్కువ సీట్లను భర్తీ చేయడానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తన అధికారిక పోర్టల్ ద్వారా మూడు కౌన్సెలింగ్ సెషన్‌లను నిర్వహిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఫలితాల అనంతరం విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీల్లో, కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు. డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు టీఎస్ దోస్త్ 2023 రిజిస్ట్రేషన్ చాలా అవసరం. పైన తెలిపిన సమాచారం ఉపయోగపడిందని మేము భావిస్తున్నాం.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్, వార్తల కోసం College Dekhoని ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ (TS TET 2024), ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫార్మ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
సీటెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అవసరమైన పత్రాలు (CTET July Application Form 2023) ఇవే
CTET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను ఎలా సరి చేసుకోవాలి? (CTET 2024 Application Form Correction)
AP DSC ఖాళీల జాబితా 2024 (AP DSC Vacancies 2024) - పోస్టు ప్రకారంగా AP DSC ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి
బీఈడీ తర్వాత కెరీర్ ఆప్షన్లు (Career Options after B.Ed) ఇక్కడ తెలుసుకోండి
TS EDCET 2024 కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాల జాబితా (List of Documents Required for TS EDCET 2023 Counselling)