ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు కార్డు పోతే ఏం చేయాలి? (Importance of Right to Vote in Telugu)

Andaluri Veni

Updated On: May 08, 2024 09:59 AM

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. కొన్నిరోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యత (Importance of Right to Vote in Telugu) గురించి ఇక్కడ తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి. 
 
ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు కార్డు పోతే ఏం చేయాలి?  (Importance of Right to Vote in Telugu)

తెలుగులో ఓటు హక్కు ప్రాముఖ్యత  (Importance of Right to Vote in Telugu) : దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. అతి త్వరలో కొన్ని అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ ఎన్నికలు 2024 (Loksabha Elections 2024) జరగనున్నాయి. జూన్ 1 వరకు భారతదేశమంతటా ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను మొదలుపెట్టారు. ప్రజలు తమ కీలకమైన ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకునే సందర్భం వచ్చింది. 18 ఏళ్లు పైబడిన వారైతే, మీకు భారతదేశంలో ఓటు వేసే రాజ్యాంగ హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును (Importance of Right to Vote in Telugu) వినియోగించుకోవచ్చు. అయితే  కొన్ని మెట్రో పాలిటన్ నగరాల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ ఓటింగ్ నమోదు అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది.

భారతదేశంలో ఇప్పటికీ వంద శాతం ఓటింగ్ నమోదు అవ్వడం లేదు. రాజకీయాలు ప్రజల్ని ఎప్పుడూ అయోమయానికి గురిచేసే అంశమే. పేదరికాన్ని నిర్మూలించడం, విద్య, ప్రాథమిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, వృద్ధులకు ప్రణాళికలు… ఇలా అన్ని అంశాలపై మన ఆలోచన ఏంటన్నది నిర్ణయించడం అందరి విధి. మనల్ని ఎవరు పాలించాలన్నది నిర్ణయించే అవకాశం కల్పించేవే ఎన్నికలు. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల పోలింగ్ ముగిసింది. మరో రెండు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది.

ఓటు ఎందుకు ముఖ్యం? (Why is Voting Important?)

ప్రజలందరూ కలసి ఓటు వేసిన వ్యక్తి నాయకుడవుతాడు. ఒకసారి ఎన్నుకోవడం అయిన తర్వాత ఐదేళ్ల పాటు ఆ నాయకత్వంలో, ఆ ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఎన్నికైన నాయకుల ఆధ్వర్యంలో ఏవైనా పొరపాట్లు, తప్పులు జరిగితే ప్రతి పక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ఎండగడుతుంటాయి. ప్రశ్నిస్తుంటాయి. ప్రజలతరుపున నిలబడతాయి. సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే.. వ్యవస్థ దశ, దిశల్లో మార్పులు వచ్చేస్తాయి. పెద్ద పెద్ద తప్పిదాలు కూడా జరుగుతుంటాయి. అంటే సరైన నాయకుడిని ఎంచుకోకపోతే.. వ్యవస్థలన్ని విఫలం అవుతాయి. ప్రజాస్వామ్యం ఫెయిల్ అవుతుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాడానికి, వ్యవస్థాగత మార్పులు జరగడానికి  ప్రజలు చేతుల్లో ఉండే ప్రధానమైన అస్త్రం ఓటు హక్కును. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు వ్యవస్థలన్ని సక్రమంగా పని చేస్తాయి. అందుకే ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజల బాధ్యతగా ఫీల్ అవ్వాలి.  ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవడం భారతీయ ప్రజల బాధ్యత అయినట్టే, ఓటర్ల అవసరాలను తీర్చడం ఎన్నుకున్న నాయకుడి బాధ్యత అవుతుంది.

'ప్రజలు, ప్రజల కోసం, ప్రజలచేత' అనే ప్రజాస్వామ్య నినాదానికి ఓటింగ్ మూలస్తంభం. దేశం-నిర్మాణ ప్రక్రియలో, ప్రభావ మార్పులో నిజంగా పాల్గొనాలనుకుంటే తప్పనిసరిగా ఓటు వేయాలి. పౌరుడు ఓటు వేయడానికి కారణం వెదకాల్సిన అవసరం లేదు. ఓటు వేయడానికి చట్టపరమైన బాధ్యత లేనప్పటికీ, అది తప్పనిసరి అని అర్థం చేసుకోవాలి.  ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటరు ఐడీ లేదా ఎలక్ట్రానిక్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC) కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం, ఓటర్లు తమ ఓటరు ID కార్డు ఫిజికల్ కాపీని పోగొట్టుకున్నప్పటికీ, పోలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

మీ ఓటరు ID కార్డు పోయినా ఓటు వేసే అవకాశం ఉందా?

వేయవచ్చు. మీరు మీ ఓటరు ఐడీ కార్డు ఫిజికల్ కాపీని పోగొట్టుకున్నప్పటికీ మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. దీనికోసం మీరు ఎన్నికల స్లిప్  ప్రింట్‌ని పొందాలి. తమ ఓటరు ఐడీ కార్డులను కోల్పోయిన ఓటర్లు ఈ పత్రాలలో ఒకదాన్ని పోలింగ్ బూత్‌కు తీసుకెళ్లవచ్చు.
  • పాస్‌పోర్ట్
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డ్
  • వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత
  • MNREGA కార్డ్
  • కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు
  • ఫోటోతో పెన్షన్ కార్డులు

ECI వెబ్‌సైట్‌ని ఉపయోగించి అధికారిక ఓటరు జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి?

అధికారిక ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి, మీరు భారత ఎన్నికల సంఘం (ECI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ECI వెబ్‌సైట్‌కి చేరుకున్న తర్వాత మీరు ఏమి చేయాలి:
  • స్టెప్ 1: 'ఎలక్టోరల్ రోల్‌లో వెతకండి' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 2: రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి
  • స్టెప్ 3: సంబంధిత వివరాలను పూరించండి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి
  • స్టెప్ 4: జాబితాలో మీ పేరును కనుగొనడానికి సెర్చింగ్‌ని బటన్‌ని క్లిక్ చేయండి.

అధికారిక ఓటరు జాబితాలో మీ పేరు కనిపించకపోతే ఏం చేయాలి?

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ECI వెబ్‌సైట్‌లో ఫార్మ్ 6'ని పూరించాలి. ఆ దరఖాస్తులో ఓటర్లు వ్యక్తిగత వివరాలను అందించి, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫార్మ్‌ను సబ్మిట్ చేసి రిఫరెన్స్ నెంబర్‌ని ఉపయోగించి మీ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయాలి.

ఆఫ్‌లైన్ మోడ్‌ను ఉపయోగించి నమోదు చేసుకోవడానికి, ఓటర్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు లేదా బూత్ స్థాయి అధికారుల నుంచి ఫార్మ్‌ను 6ను పొందవలసి ఉంటుంది. ఆఫ్‌లైన్ ఫార్మ్‌ను పూరించేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, యుటిలిటీ బిల్లు, రేషన్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలను సులభంగా ఉంచుకోవాలని వారికి సూచించబడింది.

అధికారిక ECI వెబ్‌సైట్‌లో మిమ్మల్ని నమోదు చేసుకునే ముందు, మీరు ఓటరు నమోదు కోసం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఆ అర్హతలను ఇక్కడ చూడండి.
  • ఓటర్ల జాబితాను సవరించే సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు
  • పాస్‌పోర్ట్-సైజ్ కలర్ ఫోటో అందించడం
  • జనన ధ్రువీకరణ పత్రం వంటి వయస్సు రుజువును అందించడం
  • ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, APL/BPL కార్డ్‌లు లేదా ప్రఖ్యాత సంస్థలు జారీ చేసిన లెటర్‌లు వంటి అడ్రస్ ప్రూఫ్‌ను సబ్మిట్ చేయడం.

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు గుర్తింపు కార్డును ఎలా దరఖాస్తు చేసుకోవాలి?  (How to Apply a Voter ID Card in Andhra Pradesh)

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ ఐడీ కోసం ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • స్టెప్ 1: అభ్యర్థులు ముందుగా అధికారిక CEO ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌ను https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html సందర్శించాలి. హోమ్‌పేజీలో  పైన Voter అనే ఆప్షన్‌లోకి వెళ్లి Register as Voter అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • స్టెప్ 2: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో అవసరమైన వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి. దాంతో అకౌంట్ క్రియేట్ అవుతుంది.
  • స్టెప్ 3: అనంతరం  వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఈ-రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 4: తర్వాత కొత్త ఓటర్ ID కార్డ్‌ని పొందడానికి ఫార్మ్ 6ని ఎంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ ఓటరు ID నమోదు కోసం లేదా ప్రింటెడ్ డేటాను సరిదిద్దడానికి వారు ఫార్మ్ 8ని ఎంచుకోవచ్చు. ఒక వ్యక్తి చిరునామాను మార్చినట్లయితే ఫార్మ్ 8Aని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • స్టెప్ 5: వారు ఎంచుకున్న ఫార్మ్‌లో పేరు, వయస్సు, పుట్టిన తేదీ, చిరునామా, ఇతర కుటుంబ వివరాలను పూరించాలి. ఫైనల్‌గా 'Submit' బటన్ పై క్లిక్ చేయాలి.
  • స్టెప్ 6: వినియోగదారు అవసరమైన పత్రాలు, ఫోటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు విజయవంతంగా సబ్మిట్ అయితే అనంతరం స్క్రీన్‌పై రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తుంది.  అనంతరం ధ్రువీకరణ కోసం బూత్ స్థాయి అధికారి దరఖాస్తుదారు ఇంటికి వస్తారు. అన్ని వివరాలను క్రాస్ చెక్ చేసుకుని దరఖాస్తును ఆమోదిస్తారు. తర్వాత కొత్త ఓటరు ID కార్డ్ దరఖాస్తుదారు చిరునామాకు పోస్టల్లో పంపిస్తారు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం కాలేజ్ దేఖోని ఫాలో అవ్వండి. తాజా అప్‌డేట్లను పొందండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/importance-of-right-to-vote-in-telugu/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Top