- 2024 గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలివే (Republic Day 2024)
- 2024 కవాతు ప్రత్యేకత ఏమిటీ? (What is special about the 2024 …
- Republic Day 2024 థీమ్ ఏంటి?
- 250 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu …
- గణతంత్ర దినోత్సవం - చరిత్రలో కొన్ని నిజాలు (Republic day facts and …
- తెలుగులో 200 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic day essay in …
- 500 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu …
- పది లైన్లలో రిపబ్లిక్ డే గురించి ( 10 Lines on Republic …
- రిపబ్లిక్ డే ఆర్టికల్ రాయడానికి 10 టిప్స్ (10 Tips Republic Day …
- గణతంత్ర దినోత్సవం 2024: రిపబ్లిక్ డే వ్యాసాల కోసం సూచనలు (Republic Day …
- గణతంత్ర దినోత్సవం 2024: గణతంత్ర దినోత్సవంపై చిన్న వ్యాసం (Republic Day 2024: …
తెలుగులో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu): 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ముఖ్యంగా ఢిల్లీలో జనవరి 26, 2024న రిపబ్లిక్ డే కన్నులపండువగా జరగనుంది. హస్తినలో ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఆరోజున సంబంరాలు అంబరాన్ని అంటుతాయి. గణతంత్ర దినోత్సవం రోజు దేశ విముక్తి కోసం ఎన్నో త్యాగాలు చేసి, తమ ప్రాణాలను అర్పించిప మహానీయులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానికి చిహ్నంగా జనవరి 26న ఢిల్లీలో మన దేశ మువ్వెన్నల జెండా రెపరెపలాడుతుంది. అద్భుతమైన సైనిక కవాతు, కల్చరల్ ప్రోగ్రామ్‌లు జరుగుతాయి. కవాతు ఇండియా గేట్ నుంచి ఎర్ర కోట వరకు ఐదు కిలో మీటర్ల మేర సాగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
2024 గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలివే (Republic Day 2024)
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26 ప్రతి ఏడాది ప్రత్యేక వేడుకలు జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ సంవత్సరం మనం జరుపుకునే భారతదేశ గణతంత్ర దినోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానం పంపించడం జరిగింది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి అవుతుంది. గతేడాది అంటే ఈ వేడుకలకు 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సీసీ హాజరయ్యారు.
2024 కవాతు ప్రత్యేకత ఏమిటీ? (What is special about the 2024 parade?)
ఈ ఏడాదిలో కవాతు కార్యక్రమంలో కూడా ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయనున్నాయి. 144 మంది మహిళా సైనికులు ఒక బృందంగా పాల్గొంటారు. ఇందులో 60 ఆర్మీ, మిగిలిన వారు ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందినవారై ఉంటారు. ఈ విషయాన్ని ఇప్పటికే రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. అదే విధంగా 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 2,274 మంది క్యాడెట్లు 30 రోజుల పాటు జరిగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) రిపబ్లిక్ డే క్యాంప్ 2024లో పాల్గోవడం జరుగుతుంది.Republic Day 2024 థీమ్ ఏంటి?
ప్రతి ఏడాది జరుపుకునే రిపబ్లిక్ డేకు ఒక థీమ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డేకి ఒక థీమ్‌ని పెట్టడం జరిగింది. ఆ థీమ్ ''India – Mother of Democracy'', ''విక్షిత్ భారత్'' (అభివృద్ధి చెందిన భారతదేశం) అని అర్థం.రిపబ్లిక్ డే 2024
భారత దేశానికి సంబంధించిన రెండు ముఖ్యమైన రోజులని ప్రతి భారతీయుడు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఆగస్ట్ 15 కాగా, రెండోది జనవరి 26వ తేదీ. ఆగస్ట్ 15, 1947న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన విషయం అందరికి తెలిసింది. అదే విధంగా జనవరి 26, 1956న మనం సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇప్పటి తరానికి జనవరి 26వ తేదీ ప్రత్యేకత ఏమిటో తెలియదు. అసలు ఆరోజునే రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకోవాలో కూడా తెలియదు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ ఆర్టికల్లో (Republic Day Essay in Telugu) అందజేశాం. ఇప్పటి విద్యార్థులు, పిల్లలు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి తరానికి దేశానికి సంబంధించిన అమూల్యమైన అంశాలను అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.250 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu 250 words)
1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినా బ్రిటీష్ వారి చట్టాలు, రాజ్యాంగమే అమల్లో ఉండేది. అంటే బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం -1935 అమల్లో ఉండేది. కానీ మన దేశానికంటూ సొంత రాజ్యాంగం, చట్టాలు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి రాజకీయ నేతలు, మేధావులు ఆలోచించారు. ఆ మేరకు సొంతం రాజ్యాంగం రూపకల్పనకు అడుగులు వేశారు. దీనికోసం మొదటగా లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో శ్రీకారం చుట్టారు. పూర్ణ స్వరాజ్యం అనే తీర్మానం చేశారు. దీని వెనుక సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కృషి ఉంది. ఈ మేరకు భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వెయిట్ చేశారు. అంటే రాజ్యాంగ రచన 1949లో పూర్తైనా మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. దీంతో జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దై, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.భారత రాజ్యాంగ రచన అంత ఆషామాషిగా కూడా జరగలేదు. దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన అప్పటి మేధావులు ముందుగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను ఎన్నికోగా రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ అంబేడ్కర్ ఛైర్మన్‌ను నియమించారు. రాజ్యాంగ రచనకు ముందుగా వివిధ దేశం రాజ్యాంగాలను పరిశీలించారు. క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం పూర్తి ప్రజాస్వామ్య విధానంలో రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో అనేక సవరణలు జరిగాయి. చివరిగా 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించి, అమలు చేసేందుకు రెండేళ్ల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. మన రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చు అయింది.
మనం రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా నిలిచింది. దేశాన్ని ప్రజాస్వామ్య విధానంలో నడిపించే వీలుగా రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. రాజ్యాంగంలోని చాలా అంశాలు భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని స్ఫురించేలా ఉంటాయి. అనేక మతాలు, కులాల ఉన్న మన దేశంలో అందరికి సమాన హక్కులను, స్వేచ్ఛను అందించే విధంగా చట్టాలను రూపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఎనలేని కీర్తిని ఆర్జించారు.
ఇవి కూడా చదవండి:
తెలుగులో రిపబ్లిక్ డే స్పీచ్ | ఉపాధ్యాయ దినోత్సవం ప్రత్యేకత |
---|---|
తెలుగులో బాలల దినోత్సవం వ్యాసం |
గణతంత్ర దినోత్సవం - చరిత్రలో కొన్ని నిజాలు (Republic day facts and history)
గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన చరిత్రలో కొన్ని నిజాలను ఈ దిగువున అందజేశాం. ఈ అంశాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మన గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన కీలకమైన విషయాలు ఇక్కడ అందజేశాం.- భారత రాజ్యాంగం 1950 జనవరి 26న ఉదయం 10:18 గంటలకు అమల్లోకి వచ్చింది (అధికారికంగా చట్టపరమైన చలామణిలోకి వచ్చింది) ఆ తర్వాత భారతదేశం రిపబ్లిక్ దేశంగా మారింది.
- భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం (ఇది ఒక్క రోజులో చదవడం కుదరలదు). భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 12 షెడ్యూల్‌లు, 97 సవరణలలో 448 వ్యాసాలు ఉన్నాయి.
- భారత రాజ్యాంగాన్ని డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ (డా. బీఆర్ అంబేద్కర్) రచించారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు.
- భారత రాజ్యాంగం రెండు కాపీలు చేతితోనే రాయబడ్డాయి. ఒకటి ఇంగ్లీషులో, ఒకటి హిందీలో.
- 1950 జనవరి 24న భారత రాజ్యాంగం రెండు చేతితో రాసిన కాపీలపై దాదాపు 308 మంది అసెంబ్లీ సభ్యులు సంతకం చేశారు.
- వాస్తవానికి చేతితో రాసిన రెండు భారత రాజ్యాంగ కాపీలు పార్లమెంటు హౌస్‌లోని లైబ్రరీలో హీలియం నిండిన కేసులలో సురక్షితంగా ఉంచారు.
- భారత రాజ్యాంగం ఆవిర్భవించిన తర్వాత దాదాపు 94 సవరణలు (మార్పులు) జరిగాయి.
- సత్యమేవ జయతే (అతి పెద్ద భారతీయ నినాదం) ముండక ఉపనిషత్తు, అథర్వవేదం నుంచి తీసుకోబడింది. ఇది 1911లో అబిద్ అలీతో హిందీలో మొదటిసారిగా అనువదించబడింది.
- జన గణ మన (జాతీయ గీతం) రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో మొదట రాశారు.
- జన గణ మన (జాతీయ గీతం) మొట్టమొదట 1911లో అబిద్ అలీ హిందీ భాషలోకి అనువదించారు. తర్వాత దీనిని అధికారికంగా 1950లో జనవరి 24న భారత జాతీయ గీతంగా ఆమోదించారు.
- భారత జాతీయ గీతం సాహిత్యం, సంగీతాన్ని 1911లో రవీంద్రనాథ్ ఠాగూర్ అందించారు.
- 1911 డిసెంబర్ 27న కోల్‌కత్తలోని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ గీతం తొలిసారిగా పాడబడింది.
- భారత జాతీయ గీతం పాడటానికి లేదా ఆడటానికి 52 సెకన్లు పడుతుంది.
- 1950లో జనవరి 26న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (ప్రభుత్వ గృహంలోని దర్బార్ హాలులో) తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు ప్రతి సంవత్సరం 21 గన్ సెల్యూట్‌లు అందజేస్తారు.
- భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు బీటింగ్ రిట్రీట్ సమయంలో 'అబిడ్ బై మి' (ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ట్యూన్, మహాత్మా గాంధీకి ఇష్టమైనది,క్రైస్తవ శ్లోకం) పాటను పాడటం ద్వారా మూడు రోజులు కొనసాగుతుంది.
- బీటింగ్ రిట్రీట్ వేడుక జనవరి 29న విజయ్ చౌక్‌లో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బ్యాండ్‌ల ప్రదర్శనతో జరుగుతుంది. ఇది భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ముగింపును సూచిస్తుంది.
తెలుగులో 200 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic day essay in telugu 200 words)
రిపబ్లిక్ డే రోజుకు సంబంధించిన ప్రత్యేక విషయాలను తె లుగులో 200 పదాల్లో వ్యాసాన్ని పాయింట్‌ల రూపంలో అందజేశాం. ఈ ముఖ్యమైన అంశాలు విద్యార్థులకు చాలా ఉపయోపగడతాయి.- భారత రాజ్యాంగం కేవలం కాలిగ్రాఫ్ చేయబడింది. ముద్రించబడలేదు. ఇప్పటి వరకు 1000 కాపీలు మాత్రమే రాయబడ్డాయి.
- దేశాధ్యక్షుడు గణతంత్ర దినోత్సవం రోజున ప్రసంగించగా దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించాలనే నియమం ఉంది.
- భారత స్వతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన భారత వీర జవాన్లకు నివాళులర్పించేందుకు ప్రధాని ప్రతి జాతీయ సందర్భంలో అమర్ జవాన్ జ్యోతికి పూలమాల వేస్తారు.
- భారతదేశ గణతంత్ర దినోత్సవం రోజున అర్హులైన అభ్యర్థులందరికీ పరమ వీర్ చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర, అశోక చక్ర వంటి శౌర్య పురస్కారాలతో సత్కరించడం జరుగుతుంది.
- జనవరి 26, 1950న భారతదేశం మొదటి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- మాలిక్ గులాం మొహమ్మద్ (పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్) 1955లో రాజ్‌పథ్ పరేడ్‌కు మొదటి ముఖ్య అతిథి (రిపబ్లిక్ డే పరేడ్ మొదటిసారి ప్రారంభమైంది).
- గణతంత్ర దినోత్సవం రోజున వివిధ రంగాలలో బాలల సాహస విజయాల కోసం 1957లో భారత ప్రభుత్వం పిల్లలకు శౌర్య పురస్కారాలను అందించే ఆచారం ప్రారంభించింది.
- 1950లో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని "స్వరాజ్ దివస్"గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది.
- 1961 గణతంత్ర దినోత్సవ వేడుకలకు బ్రిటన్‌కు చెందిన క్వీన్ ఎలిజబెత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
- 1965 జనవరి 26న హిందీ భాషను మన జాతీయ భాషగా ప్రకటించారు.
- జనవరి 26, 1950న, సారనాథ్‌లోని అశోక సింహం భారతదేశ జాతీయ చిహ్నంగా ఎంపికైంది.
- వందేమాతరం 1950 జనవరి 24న భారతదేశ జాతీయ గీతంగా స్వీకరించబడింది. ఈ పాట బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన దేశభక్తి నవల ‘ఆనందమఠం’ కవిత నుంచి తీసుకోవడం జరిగింది.
- భారత రాజ్యాంగం ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే 2018 వరకు కేవలం 102 సవరణలు మాత్రమే జరిగాయి, ఇది బలమైన రాజ్యాంగాలలో ఒకటిగా నిలిచింది.
500 పదాల్లో రిపబ్లిక్ డే వ్యాసం (Republic Day Essay in Telugu 500 words)
అంబేద్కర్ చేసిన కృషి, శ్రమ వల్ల సమాజంలో బలహీన వర్గాల ప్రజలకు సమాన హక్కులను, స్వేచ్ఛను పొందగలుగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జనవరి 26న భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది.
భారత గణతంత్ర దినోత్సవం (జనవరి 26)కు సంబంధించి ఇంకా చాలా ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత రాజేంద్ర ప్రసాద్ పార్లమెంట్ దర్బార్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఐదు మైళ్ల పొడవున సాగిన పరేడ్ తర్వాత, ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
అలాగే 1955లో జనవరి 26వ తేదీన జరిగే కవాతుకు రాజ్‌పథ్ శాశ్వత వేదిక అయింది. ఆ సమయంలో రాజ్‌పథ్‌ను ‘కింగ్స్‌వే’ అనే పేరుతో పిలిచేవారు, ఇప్పుడు కర్తవ్యాపత్ అని పిలుస్తున్నారు.
ప్రతి సంవత్సరం, 26 జనవరి పరేడ్‌కు ప్రధాన మంత్రి లేదా రాష్ట్రపతి లేదా ఏదైనా దేశ పాలకులను అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితి. మొదటి కవాతు 26 జనవరి 1950న జరగ్గా అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్ణో అతిథిగా ఆహ్వానించడం జరిగింది. అయితే 1955లో రాజ్‌పథ్‌లో మొదటి కవాతు జరిగినప్పుడు, పాకిస్థాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మహమ్మద్‌ను ఆహ్వానించారు.
జనవరి 26వ తేదీన రాష్ట్రపతి రాకతో కవాతు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కవాతులో మొదటగా రాష్ట్రపతి కావలీర్ అంగరక్షకులు జాతీయ జెండాకు వందనం చేస్తారు. ఆ సమయంలో జాతీయ గీతం ప్లే చేస్తారు. అంతేకాగా 21 గన్స్ సెల్యూట్ కూడా ఇవ్వబడుతుంది. అంటే 25- పాండర్స్ అని పిలువబడే భారత సైన్యం ఏడు ఫిరంగులను, మూడు రౌండ్లలో కాల్చడానికి ఉపయోగిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గన్ సెల్యూట్ ఫైరింగ్ సమయం జాతీయ గీతం ప్లే అయ్యే సమయంతో సరిపోతుంది. మొదటి ఫైరింగ్ జాతీయ గీతం ప్రారంభంలో జరుగుతుంది. చివరి కాల్పులు 52 సెకన్ల తర్వాత జరుగుతుంది. ఈ ఫిరంగులు 1941లో తయారు చేయబడ్డాయి. సైన్యం అన్ని అధికారిక కార్యక్రమాలలో వీటిని ఉపయోగిస్తారు.
జనవరి 26 కవాతులో పాల్గొనే వారందరూ తెల్లవారుజామున 2 గంటలకు సిద్ధంగా ఉంటారు. తెల్లవారుజామున 3 గంటలకు రాజ్‌పథ్‌కు చేరుకుంటారు. అయితే కవాతు కోసం సన్నాహాలు ముందు సంవత్సరం జూలై నెలలోనే ప్రారంభమవుతాయి. అప్పుడు పాల్గొనే వారందరికీ వారి భాగస్వామ్యం గురించి అధికారికంగా తెలియజేయబడుతుంది. ఆగస్టు వరకు వారు తమ సంబంధిత రెజిమెంట్ కేంద్రాలలో కవాతును ప్రాక్టీస్ చేస్తారు. డిసెంబర్ నాటికి ఢిల్లీకి చేరుకుంటారు. కవాతులో పాల్గొనేవారు అప్పటికే 600 గంటల పాటు సాధన చేసి ఉంటారు.
ఇండియా గేట్ ప్రాంగణంలో అన్ని ట్యాంకులు, సాయుధ వాహనాలు, భారతదేశ సైనిక శక్తిని చూపించే ఆధునిక పరికరాల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుంది. ప్రతి కానన్‌కు సంబంధించిన విచారణ ప్రక్రియ వైట్‌వాష్ చేసే పని ఎక్కువగా 10 దశల్లో నిర్వహించబడుతుంది. జనవరి 26న జరిగే కవాతు రిహార్సల్ కోసం ప్రతి బృందం 12 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అయితే జనవరి 26వ తేదీన వారు 9 కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే కవర్ చేస్తారు. న్యాయమూర్తులు పరేడ్‌లో కూర్చొని ఉంటారు. పాల్గొనే ప్రతి సమూహానికి 200 పారామితుల ఆధారంగా తీర్పు ఇస్తారు. ఈ తీర్పు ఆధారంగా "ఉత్తమ కవాతు సమూహం" టైటిల్‌ను అందజేస్తారు.
26 జనవరి పరేడ్ ఈవెంట్‌లో నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు ముందుగా నిర్వహించబడుతుంది. అందువల్ల చిన్న పొరపాటు, అతి తక్కువ నిమిషాల ఆలస్యం కూడా నిర్వాహకులకు భారీగా ఖర్చు అవుతుంది. కవాతు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఆర్మీ సిబ్బంది నాలుగు స్థాయిల విచారణను దాటాలి. ఇది కాకుండా వారి చేతులు లైవ్ బుల్లెట్లతో లోడ్ చేయబడలేదని నిర్ధారించుకోవడానికి వారి చేతులను క్షుణ్ణంగా చెక్ చేస్తారు.
ఈవెంట్ అత్యంత ఆకర్షణీయమైన భాగం "ఫ్లైపాస్ట్". "ఫ్లైపాస్ట్" బాధ్యత వెస్ట్రన్ ఎయిర్‌ఫోర్స్ కమాండ్‌పై ఉంటుంది. ఇందులో దాదాపు 41 ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాల్గొంటాయి. కవాతులో పాల్గొన్న విమానం వైమానిక దళంలోని వివిధ కేంద్రాల నుంచి బయలుదేరి నిర్ణీత సమయంలో రాజ్‌పథ్‌కు చేరుకుంటుంది. మహాత్మా గాంధీకి ఇష్టమైన పాట అయినందున ప్రతి రిపబ్లిక్ డే పరేడ్ ఈవెంట్‌లో “Abide with me” పాట ప్లే చేయబడుతుంది. అయితే గత ఏడాది (2023) దాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది.
కవాతులో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది స్వదేశీ తయారు చేసిన INSAS రైఫిల్స్‌తో, ప్రత్యేక భద్రతా దళాల సిబ్బంది ఇజ్రాయెల్‌లో తయారు చేసిన టావోర్ రైఫిల్స్‌తో కవాతు చేశారు. ఈసారి అందుకు భిన్నంగా ఉండవచ్చు.
ఆర్టీఐ ద్వారా లభించిన సమాచారం ప్రకారం, 2014 పరేడ్‌లో జరిగిన పరేడ్ ఈవెంట్‌లో సుమారు 320 కోట్ల రూపాయల ఖర్చు అయింది. 2001లో ఈ ఖర్చు దాదాపు రూ. 145 కోట్లు. ఈ విధంగా, 2001 నుంచి 2014 వరకు జనవరి 26 కవాతుపై చేసిన ఖర్చు 54.51 శాతం పెరిగింది.
కుల, మత, లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో కల్పించారు. అలాగే ప్రతి పౌరుడు దేశసేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నింటకీ గుర్తుచేసుకుంటా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.
పది లైన్లలో రిపబ్లిక్ డే గురించి ( 10 Lines on Republic Day)
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950 జ్ఞాపకార్థం భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా పాటిస్తుంది. ఇది భారతదేశ ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో దేశం పాలక చట్టంగా మారింది. భారతదేశాన్ని బ్రిటిష్ రాజ్యం నుంచి భిన్నమైన రిపబ్లిక్‌గా మార్చింది. భారతదేశం మొత్తం ఈ వేడుకను చాలా ఆనందంగా. ఉత్సాహంగా జరుపుకుంటుంది. 75వ గణతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం జనవరి 26, 2023న నిర్వహించబడుతుంది. క్రింద అందించబడిన 10 లైన్ల జాబితాను ఉపయోగించి గణతంత్ర దినోత్సవం గురించి స్పష్టమైన అవగాహన పొందండి.
- జనవరి 26న భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని దేశ జాతీయ పండుగగా పాటిస్తాం.
- భారత రాజ్యాంగం జనవరి 26, 1950లో ఈ రోజున అమల్లోకి వచ్చింది.
- భారత రాజ్యాంగ పితామహుడిగా పేర్కొన్న బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది భారతదేశ అత్యున్నత చట్టం.
- భారత రాజ్యాంగంలో బలహీనవర్గాలకు సమాన హక్కులను, స్వేచ్ఛను అందించేలా చట్టాలను రూపొందించారు.
- భారత రాజ్యాంగ ప్రవేశిక దేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమని పేర్కొంది.
- జనవరి 26న రాజ్‌ఘాట్‌లో అమరవీరులను సన్మానించి, ఆ రోజు అద్భుతమైన వేడుకను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.
- గణతంత్ర దినోత్సవం రోజున అనేక మంది ప్రముఖులు, విశిష్ట విదేశీ అతిథుల సమక్షంలో అత్యున్నత సైనిక గౌరవాలు కూడా ఇవ్వబడతాయి.
- వివిధ పరిస్థితులలో ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు బహుమతులు కూడా ఇవ్వబడతాయి.
- దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
- మన స్వత్రంతం కోసం పోరాడిన వారిని గౌరవించటానికి రిపబ్లిక్ డే రోజు ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది.
రిపబ్లిక్ డే ఆర్టికల్ రాయడానికి 10 టిప్స్ (10 Tips Republic Day Essay Writing)
ప్రతి ఏడాది జరుపుకునే రిపబ్లిక్ డే రోజున కచ్చితంగా మంచి వ్యాసం రాయాల్సి ఉంటుంది. కానీ చాలామంది విద్యార్థులు ఆ ఆర్టికల్ ఎలా రాయాలో? తెలియక ఇబ్బంది పడుతుంటారు. విద్యార్థులు ఇక్కడ తెలియజేసిన టిప్స్‌తో వ్యాసం చాలా సులభంగా రాయవచ్చు. రిపబ్లిక్ డేపై మంచి వ్యాసం రాసేందుకు పది టిప్స్ ఈ దిగువున తెలియజేశాం.1. ఏదైనా ప్రత్యేక అంశంపై రాయాలనుకునే ముందు ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంటే ఆ ప్రత్యేకమైన డేకు సంబంధించిన చరిత్ర, ఇతర అంశాల గురించి స్టడీ చేయాలి.
2. రాయాలనుకునే అంశానికి సంబంధించిన పుస్తకాలు, వెబ్ డేటాబేస్‌లు, ఆన్‌లైన్ జర్నల్‌లు, వీడియోలు, నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలను చూడాలి. వాటిలో ఉన్న నిజనిజాలను గ్రహించాలి.
3. రాయాలనుకునే అంశంపై పూర్తి అవగాహనను పెంచుకోవాలి. తర్వాత రాయడం మొదలుపెట్టాలి.
4. మనకు ఎంచుకున్న టాపిక్ గురించి ఏ భాషలో రాయాలనుకునే ఆ భాషకు సంబంధించిన గ్రామర్‌పై పట్టు సాధించాలి. చదివే పాఠకులకు సులభంగా అర్థమయ్యే విధంగా సరళంగా ఆర్టికల్‌ని రాయాలి.
5. చెప్పాలనుకునే అంశంపై ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా రాయాలి. రాయడం పూర్తైన తర్వాత రెండు మూడుసార్లు ప్రూఫ్ రీడింగ్ చూసుకోవాలి.
6. రాసిన అంశం మరింత బలంగా పాఠకులకు అర్థం కావడానికి సంబంధిత రిఫరెన్స్‌లను కూడా అందజేయాలి. రాసిన టాపిక్‌పై అప్పటికే పబ్లిష్ అయిన పుస్తకాలు, పరిశోధనా పత్రికను కోడ్ చేయాలి.
7. మీరు మీ పరిశోధన, వాదనలు వివరించడం ద్వారా అంశం ప్రాముఖ్యతను కూడా చూపవచ్చు.
8. వ్యాసాన్ని రాసేటప్పుడు మీ వాదనకు మద్దతు ఇవ్వడానికి చారిత్రక వాస్తవాలు, సంఖ్యా డేటా, స్థలాలు, వ్యక్తుల వివరణలు వంటి నిర్దిష్ట వివరాలను ఉపయోగించాలి.
9. మీరు రాస్తున్న అంశం సమాజాన్ని ప్రభావితం చేసేదైతే దాని ప్రభావాన్ని వివరించడం, ఎందుకు అంత ప్రభావం చూపిందో చర్చిచండం చాలా అవసరం. ఈ సమాచారం అందించడం ద్వారా పాఠకుడికి మీరు మీ అంశంపై నిపుణుడని, మీపై వారికి నమ్మకాన్ని పెంచుతుంది.
10. మీరు మీ రచనలో మరింత నమ్మకంగా ఉండేందుకు వివిధ అంశాలపై నమూనా వ్యాసాలు రాయడాన్ని పరిగణించండి. రెగ్యులర్ ప్రాక్టీస్ మీ క్రాఫ్ట్‌ను మెరుగుపరుచుకోవడంలో మీకు సహాయపడుతుంది
గణతంత్ర దినోత్సవం 2024: రిపబ్లిక్ డే వ్యాసాల కోసం సూచనలు (Republic Day 2024: Instructions for Republic Day Essays)
భారతదేశం రాజ్యాంగం స్వాతంత్రం తర్వాత అమలులోకి వచ్చిన క్షణాన్ని స్మరించుకుంటూ జనవరి 26న గణతంత్ర దినోత్సవం 2024 ఉత్సవాలను జరుపుకోవడానికి దేశం మొత్తం సిద్ధంగా ఉంది. ఈ ముఖ్యమైన రోజున, దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తాయి. ఇందులో భారత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, ఉల్లాసమైన నృత్య ప్రదర్శనలు, ఆకర్షణీయమైన స్కిట్‌లు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, వ్యాస రచన పోటీలు ఉంటాయి. అది చాలా మందికి సవాల్‌గా ఉండవచ్చు.ఇంట్రడక్షన్: రిపబ్లిక్ డే ప్రాముఖ్యత దాని చారిత్రక నేపథ్యాన్ని క్లుప్తంగా వివరించే సరళమైన పరిచయంతో మీ వ్యాసాన్ని ప్రారంభించండి. పాఠకుల దృష్టిని ఆకర్షించడానికి కోట్స్, వాస్తవం అనే చెప్పగలిగే ప్రూఫ్‌లను ప్రారంభించండి.
చారిత్రక సందర్భం: జనవరి 26, 1950న ఇండియన్ రిపబ్లిక్ స్థాపనకు దారితీసిన సంఘటనల సంక్షిప్త అవలోకనాన్ని అందించండి. డాక్టర్ బీఆర్ వంటి కీలక వ్యక్తుల గురించి హైలైట్ చేయండి. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ పాత్రను వివరించండి.
రిపబ్లిక్ డే ప్రాముఖ్యత: భారతదేశం సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారే దిశగా ప్రయాణిస్తున్న సందర్భంలో గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించండి. రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలు, సూత్రాలను చర్చించండి.
సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం: భారతదేశం గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని గణతంత్ర దినోత్సవం ఎలా జరుపుకుంటుంది? దాని పౌరులలో ఐక్యతా భావాన్ని ఎలా పెంపొందిస్తుందో..? నొక్కి చెప్పండి. దేశ వారసత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు,కవాతులను పేర్కొనండి.
జాతీయ గీతం, జెండా ఎగురవేయడం: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయడం, జాతీయ గీతాన్ని ఆలపించే సంప్రదాయాన్ని చర్చించండి. ఈ చర్యల వెనుక ఉన్న ప్రతీకవాదాన్ని మరియు దేశభక్తి భావాన్ని పెంపొందించడంలో వాటి పాత్రను హైలైట్ చేయండి.
పరేడ్, వేడుకలు: రిపబ్లిక్ డే పరేడ్ గురించి వివరంగా తెలియజేయండి, పరేడ్‌లో ఆకట్టుకునే సైనిక ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రముఖుల ఉనికిని ప్రస్తావిస్తుంది. ఇది దేశం సాధించిన విజయాలు మరియు పురోగతిని ఎలా ప్రతిబింబిస్తుందో చర్చించండి.
యువత ప్రమేయం: సాంస్కృతిక కార్యక్రమాలు, జెండా-ఎగురవేత వేడుకలు లేదా సమాజ సేవ ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యువత చురుకుగా పాల్గొనడాన్ని గుర్తించండి. దేశ భవిష్యత్తును రూపొందించడంలో యువత పాత్రను హైలైట్ చేయండి.
సవాళ్లు, ఆకాంక్షలు: గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు కోసం ఆకాంక్షలను ప్రతిబింబించండి. సవాళ్లను అధిగమించి, ప్రగతిని సాధించడంలో రాజ్యాంగ సూత్రాలు దేశాన్ని ఎలా నడిపిస్తాయో చర్చించండి.
గ్లోబల్ దృక్పథం: గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం స్థితిని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా దాని పాత్రను స్పర్శించండి. ఇండియన్ రిపబ్లిక్ విలువలకు అనుగుణంగా ఏదైనా అంతర్జాతీయ సహకారాలు లేదా దౌత్యపరమైన చర్యల గురించి చర్చించండి.
గణతంత్ర దినోత్సవం 2024: గణతంత్ర దినోత్సవంపై చిన్న వ్యాసం (Republic Day 2024: Short Essay on Republic Day)
భారతదేశంలో గణతంత్ర దినోత్సవం, జనవరి 26న జరుపుకుంటారు, 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని సూచిస్తుంది. రిపబ్లిక్ డే అనేది ప్రజాస్వామ్య సూత్రాల వేడుక. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర భారత రాష్ట్రపతి జెండా ఎగురవేయడం, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే ఉల్లాసమైన కవాతుతో రోజు ప్రారంభమవుతుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పిస్తుంది. గణతంత్ర దినోత్సవం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని సమర్థించడంపై ప్రతిబింబిస్తుంది. ఇది ప్రజాస్వామ్య అధికారాలను గుర్తించి, ఉజ్వల భవిష్యత్తు వైపు చూస్తున్న బలమైన, కలుపుకొని పోయే దేశానికి సామూహిక నిబద్ధత.భారతీయులు గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. స్వతంత్ర దేశంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించే రోజు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కవాతు జరుగుతుంది.
రక్షణ మంత్రిత్వ శాఖ సమన్వయంతో జరిగే పరేడ్‌ను భారత రాష్ట్రపతి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం భారతదేశ సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించడమే కాకుండా దాని విభిన్న సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. రిపబ్లిక్ డే వేడుకలకు అధికారిక ముగింపు బీటింగ్ ది రిట్రీట్, ఇది వేడుకలన్నీ ముగిసిన తర్వాత జరుగుతుంది. 26 నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వ భవనాలు తళతళా మెరుస్తున్న దీపాలతో సర్వాంగ సుందరంగా వెలిగిపోతున్నాయి. జనవరి 29, గణతంత్ర దినోత్సవం తర్వాత మూడో రోజు, బీటింగ్ రిట్రీట్ వేడుక జరుగుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం College Dekhoని ఫాలో అవ్వండి.
సిమిలర్ ఆర్టికల్స్
TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి
ఇంటర్మీడియట్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ లోకి ఎలా చేరాలి? (How to Get into the Indian Air Force after Intermediate?)
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి
విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (Independence Day Speech in Telugu)
భారత స్వతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ తెలుసుకోండి (Freedom Fighters Speech in Telugu)
భారతీయ జెండా ప్రత్యేకతలు ఏమిటో తెలుసా? (Indian Flag History in Telugu)