తెలంగాణ ఎంసెట్‌‌కు దరఖాస్తు చేసుకోవానికి ఈ డాక్యుమెంట్లు ఉన్నాయా? (Documents for TS EAMCET 2025 Application)

Rudra Veni

Updated On: February 25, 2025 02:04 PM

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియకు ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్లు అభ్యర్థుల దగ్గర తప్పనిసరిగా ఉండాలి. డాక్యుమెంట్ల లిస్ట్‌ని (Documents for TS EAMCET 2025 Application) ఇక్కడ చూడండి. 
తెలంగాణ ఎంసెట్‌‌కు దరఖాస్తు చేసుకోవానికి ఈ డాక్యుమెంట్లు ఉన్నాయా?  (Documents for TS EAMCET 2025 Application)

తెలంగాణ ఎంసెట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 2025 (Documents for TS EAMCET 2025 Application) : TS EAMCET దరఖాస్తు ప్రక్రియ  2025 ఫిబ్రవరి 25, 2025న ప్రారంభమైంది. అభ్యర్థులు TS EAMCET 2025 అప్లికేషన్‌ని ఏప్రిల్ 4, 2025వ తేదీ నాటికి పూరించవచ్చు. తెలంగాణ ఎంసెట్ రిజిస్ట్రేషన్ల సమయంలో, అభ్యర్థులు కొన్ని డాక్యుమెంట్లను  (Documents for TS EAMCET 2025 Application) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. TS EAMCET రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 2025 జాబితాలో ఇంటర్మీడియట్  తరగతి సర్టిఫికెట్లు, తెలంగాణ ఆన్‌లైన్ సెంటర్ ఫీజు ( తెలంగాణ ఆన్‌లైన్ సెంటర్ ద్వారా చెల్లింపు జరిగితే), ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం మొదలైనవి ఉంటాయి. అధికారులు సూచించిన స్పెసిఫికేషన్ల ప్రకారం అభ్యర్థి సంతకం, ఫోటో వంటి డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాలి.

ఈ TS EAMCET 2025 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అసలైనవి, ప్రామాణికమైనవి అయి ఉండాలి. ఎవరైనా అభ్యర్థి ఫేక్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తూ పట్టుబడితే, వారి రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. కాబట్టి, అభ్యర్థులు TS EAMCET రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 2025 అప్‌లోడ్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సేకరించి సిద్ధం చేసుకోవాలి. TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2025ని పూరించడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను ఇక్కడ అందించాం.

TS EAMCET 2025 దరఖాస్తు ఫార్మ్ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే విడుదలవుతుంది. TS EAMCET దరఖాస్తు ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, డాక్యుమెంట్ అప్‌లోడ్, ఫీజు చెల్లింపు వంటి అంశాలుంటాయి. ఇక్కడ TS EAMCET రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 2025, దరఖాస్తులో పూరించాల్సిన వివరాలు, డాక్యుమెంట్ల స్పెసిఫికేషన్లు, మార్గదర్శకాలను తెలియజేసాం.

TS EAMCET రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల జాబితా 2025 (List of TS EAMCET Registration Documents 2025)

TS EAMCET 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ అప్‌లోడ్ తప్పనిసరి దశ. TS EAMCET రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల జాబితా 2025 దిగువున ఇవ్వబడింది. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండటానికి TS EAMCET రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు అభ్యర్థులు ఈ డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఈ TS EAMCET 2025 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసేటప్పుడు అభ్యర్థులు అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలి.
  • TS ఆన్‌లైన్ సెంటర్ రసీదు (చెల్లింపు TS ఆన్‌లైన్ సెంటర్ ద్వారా జరిగితే)
  • ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా పదో తరగతి లేదా తత్సమాన ధ్రువీకరణ పత్రం
  • MRO లేదా కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన స్థానిక అభ్యర్థి సర్టిఫికెట్
  • MRO/ కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • ఆధార్ కార్డు
  • క్రెడిట్/డెబిట్ కార్డ్

TS EAMCET రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 2025 స్పెసిఫికేషన్లు (TS EAMCET Registration Documents 2025 Specifications)

TS EAMCET 2025 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి అవసరమైన పత్రాల జాబితాలో అభ్యర్థి సంతకం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో ఉంటాయి. ఈ రెండు డాక్యుమెంట్లను అధికారులు పేర్కొన్న పరిమాణం, ఫార్మాట్ ప్రకారం అప్‌లోడ్ చేయాలి. అభ్యర్థులు అధికార మార్గద్శకాల ప్రకారం ఈ డాక్యుమెంట్లను అనుకూలీకరించడానికి వివిధ ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించవచ్చు.

డాక్యుమెంట్ పేరు

సైజ్

ఫార్మాట్

సంతకం

15 kb కంటే తక్కువ

JPC/ JPEG

పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్

30 kb కంటే తక్కువ

JPG/ JPEG

TS EAMCET 2025 రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన వివరాలు (Details Required for TS EAMCET 2025 Registration)

TS EAMCET దరఖాస్తు ఫార్మ్ 2025కు జోడించడానికి అభ్యర్థులు కింది సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • అభ్యర్థుల పేరు
  • అభ్యర్థి జెండర్
  • అర్హత పరీక్ష తాజా రెండో సంవత్సరం హాల్ టికెట్ నెంబర్/ 10+2
  • వ్యక్తిగత ఈ మెయిల్ ID
  • SSC లేదా తత్సమాన హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ
  • SC/ST/BC అభ్యర్థుల విషయంలో కుల ధ్రువీకరణ పత్రం (SC/ST అభ్యర్థులకు మాత్రమే కుల ధ్రువీకరణ పత్రం దరఖాస్తు సంఖ్య)
  • వ్యక్తిగత మొబైల్ నెంబర్
  • పీహెచ్, ఎన్‌సీసీ, క్రీడలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మొదలైనవి.
  • స్థానిక స్థితి రుజువు కోసం అధ్యయనం లేదా నివాసం లేదా సంబంధిత సర్టిఫికెట్ (గత 12 సంవత్సరాలు)
  • రూ. లక్ష కంటే తక్కువ లేదా రూ. లక్ష కంటే ఎక్కువ. రూ. 2 లక్షల కంటే తక్కువ లేదా రూ. 2 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయ వివరాలు
  • కలర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్
  • సంతకం
  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)

TS EAMCET రిజిస్ట్రేషన్ ఫీజు 2025 (TS EAMCET Registration Fees 2025)

TS EAMCET 2025 దరఖాస్తు ఫీజు కేటగిరీ వారీగా, స్ట్రీమ్ వారీగా మారుతుంది. అభ్యర్థులు TS EAMCET 2025 రిజిస్ట్రేషన్ ఫీజులను కింద చెక్ చేయవచ్చు.

స్ట్రీమ్

కేటగిరి

దరఖాస్తు ఫీజు

అగ్రికల్చర్

SC/ ST కేటగిరి

రూ. 500/-

జనరల్ కేటగిరీ & ఇతరాలు

రూ. 900/-

ఇంజనీరింగ్

జనరల్ కేటగిరీ & ఇతరాలు

రూ. 900/-

SC/ ST కేటగిరి

రూ. 500/-

ఇంజనీరింగ్ & అగ్రికల్చర్

SC/ ST కేటగిరి

రూ. 1000/-

జనరల్ కేటగిరీ & ఇతరాలు

రూ. 1800/-

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/required-documents-for-ts-eamcet-2025-application/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All