సంక్రాంతి పండుగకు సంబంధించిన విశిష్టత, విశేషాలను (Sankranti Festival Essay in Telugu)ఇక్కడ అందించాం. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగ వివరాలు ఇక్కడ అందించాం.
తెలుగులో సంక్రాంతి పండుగ విశిష్టత (Snkranti Festival in Telugu) :
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను (Snkranti Festival in Telugu) ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను 4 రోజులు అంటే బోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఈ నాలుగు రోజులను ఒక వేడుకలా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, బోగి మంటలు, గాలిపటాలు, కోడి పందాలు, కొత్త బట్టలు, చుట్టాలు, పిండివంటలతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. అందుకే సంక్రాంతి కోసం ఏడాదంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.
సంక్రాంతి సందడి.. (Snkranti Festival in Telugu)
నిజానికి జనవరి నెలలో ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి నెలకొంటుంది. పిండి వంటలు వండడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆఫీసులకు, స్కూళ్లకి సెలవులు తీసుకోవడం, బస్సు, ట్రైన్ టికెట్లను తీసుకోవడం.. వంటి పనులు అన్ని పండుగకు రెండు నెలల ముందే మొదలవుతుంది. ఏపీ ప్రజలకు ఈ పండుగ అంత ప్రత్యేకమైనది. సంక్రాంతికి శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు 27 ఉంటాయి.
ఇక సంక్రాంతి శాస్త్రపరంగా కూడా చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాలని 12 రాశులుగా డివైడ్ చేశారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు.అలాగే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు అ రాశిని మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల బాధలు అంటవని ఓ నమ్మకం.
భోగి పండుగ... (Snkranti Festival in Telugu)
పెద్ద పండుగగా భావించే ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ భోగి పండుగ రోజున తెల్లవారుజామునే అందరూ నిద్రలేస్తారు. అభ్యంగన స్నానం చేస్తారు. పిల్లలు, పెద్దలు, యువతీ, యువకులు, ఆడవాళ్లు, మగవాళ్లు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద భోగి మంటలను వేస్తారు. ఉదయపు చలిలో వెచ్చని మంటలతో సేద తీరుతారు. అంతేకాదు పాతకు స్వస్తి చెప్పి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పనికిరాని వస్తువులను, పిడకలను వేస్తారు. చెడు లక్షణాలని భోగి మంటల్లో దగ్ధం చేసి.. కొత్త లక్షణాలను, కొత్త సంతోషాలను ఆహ్వానించేందుకు చిహ్నంగా భోగి మంటల్లో పాత వస్తువులను వేసి దగ్ధం చేస్తారు. అలా భోగి పండుగతో ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ మొదలవుతుంది. భోగి పండుగ రోజు ఇంట్లో అందరూ ప్రత్యేకమైన, సంప్రదాయమైన వంటలను చేసుకుంటారు.
సంక్రాంతి పండుగ... (Snkranti Festival in Telugu)
భోగి పండుగ తర్వాత సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ రోజున ఇంటి ముందర పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల నడుమ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను బంతి, చేమంతులతో అలంకరించి వాటి చుట్టూ డ్యాన్స్‌లు చేస్తారు.రంగు రంగుల ముగ్గులతో ప్రతి ఇల్లు ఎంతో అద్బుతంగా మారుతుంది. హరిదాసులు హరినామ సంకీర్తనలు ఆలపిస్తారు. గంగిరెద్దులవారు బసవన్నను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తుంటారు. పవిత్రంగా సాన్నం చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. సంక్రాంతి రోజున ఇళ్లలో చనిపోయిన పెద్దలకు పూజలు ప్రత్యేక పూజలు చేస్తారు. పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు చేస్తారు. తల్లిదండ్రులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత,ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంత్రికి ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ రోజున ఆ కాలంలో పండే కూరగాయలన్నింటితో కలిపి దప్పలం అనే కూరను చేసుకుంటారు. పిండి వంటలతో ఇంటిల్లిపాది భోజనాలు చేస్తారు.పండుగ సందర్భంగా బంధువులు, చుట్టాలు, స్నేహితులతో అందరి ఇళ్లు కోలాహాలంగా, సందడిగా ఉంటాయి.
కనుమ పండుగ... (Snkranti Festival in Telugu)
సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు పాడి పశువులను శుభ్రపరుచుకుంటారు. అనంతరం వాటిని అందంగా అలంకరిస్తారు. కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటికి ప్రత్యేకమైన దాణాను అందిస్తారు. గోపూజ చేస్తారు. పంట చేల దగ్గర రైతులు ఇంట్లో వండి పులగాన్ని జల్లుతారు. అంతేకాదు ఆరోజు పూల తోరణాలు, మామిడి తోరణాలతో ఇళ్లను అందంగా మార్చుకుంటారు.
ముక్కనుమ పండుగ... (Snkranti Festival in Telugu)
సంక్రాంతి పండుగలో నాలుగో రోజున ముక్కనుమ అంటారు. ఈ పండుగ రోజున కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు గౌరీదేవి వ్రతం చేసుకుంటారు.ఈ దేవిని తొమ్మిది రోజులు పూజిస్తారు. తొమ్మిది పిండి వంటలతో రోజూ నివేదన చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలని నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున ఇళ్లలో బొమ్మల కొలువు పెడతారు.అదేవిధంగా ముక్కనుమ మాంసాహార ప్రియులు ఇష్టపడే పండుగ కూడా. ఎందుకంటే ముక్కనుమ రోజున రకరకాల మాంసాహార వంటకాలను వండుకుని కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి ఆరగిస్తారు. పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాఖహారమే భుజిస్తారు.ఇది ఎన్నో ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా వస్తుంది.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?
0 Upvotes
0 Downvotes
/articles/sankranti-festival-essay-in-telugu/
మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.
సిమిలర్ ఆర్టికల్స్
TS TET మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి (TS TET Previous Year Question Papers)
ఉగాది పండుగ విశిష్టత.. పచ్చడిలో ఉన్న ప్రత్యేకతలు (Ugadi Festival in Telugu)
నవంబర్ 14 బాలల దినోత్సవం స్పీచ్ తెలుగులో (Children's Day Speech in Telugu)
ఏపీ 10వ తరగతి రీవాల్యుయేషన్ 2025కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (AP SSC Revaluation 2025)
TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి
ఇంటర్మీడియట్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ లోకి ఎలా చేరాలి? (How to Get into the Indian Air Force after Intermediate?)